Gas Rates: ప్రజలకు మార్నింగ్ షాక్- సిలిండర్‌పై రూ. 50 పెంపు, వెయ్యి రూపాయలు దాటేసిన సిలిండర్
రోజురోజుకు సామాన్యుడిపై ధరల భారం పెరిగిపోతోంది. ఇప్పటికే ఆయిల్ రేట్లతో సతమతమవుతున్న ప్రజలపై ఆయిల్ కంపెనీలు మరో పిడుగు వేశాయి.
![Gas Rates: ప్రజలకు మార్నింగ్ షాక్- సిలిండర్‌పై రూ. 50 పెంపు, వెయ్యి రూపాయలు దాటేసిన సిలిండర్ Oil companies raise price by Rs 50 per gas cylinder for domestic use Gas Rates: ప్రజలకు మార్నింగ్ షాక్- సిలిండర్‌పై రూ. 50 పెంపు, వెయ్యి రూపాయలు దాటేసిన సిలిండర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/02/c889a6ad84925a2558c19f392d7cfbb7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆయిల్ కంపెనీలు సామాన్యులకు షాక్ ఇచ్చాయి. గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్‌పై యాభై రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఆయిల్ కంపెనీలు. ఇకపై సిలిండర్ బుక్ చేస్తే 1052 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. తక్షణమే ఈ ధరలు అమల్లోకి వస్తాయని ఆయిల్ సంస్థలు చెప్పాయి.
The price of 14.2 kg Domestic LPG cylinder increased by Rs 50 with effect from today. The domestic cylinder will cost Rs 999.50/cylinder from today.
— ANI (@ANI) May 7, 2022
నెలనెలా గ్యాస్ సిలిండర్ల ధరలను రివైజ్ చేసే ఆయిల్ కంపెనీలు ఒకటో తేదీన కూడా రివైజ్ చేశాయి. అప్పటికి మాత్రం గృహ వినియోదారులపై భారం పడకుండా కనికరించినట్టే కనిపించాయి. కమర్షియల్ సిలిండర్‌పైనే భారం వేశాయి. ఇది జరిగి వారం తిరగకుండానే ఇప్పుడు షాక్ ఇచ్చాయి.
ఒకటో తేదీని కమర్షియల్ సిలిండర్ ధరలను కూడా భారీగా పెంచాయి ఆయిల్ కంపెనీలు సిలిండర్‌పై 104 రూపాయలు వడ్డించాయి. దీంతో సిలిండర్ కాస్ట్ దాదాపు మూడువేల రూపాయలకు చేరింది. చెన్నైలో 2729 రూపాయలుగా ఉంది.
గ్యాస్ ధరల పెంపుపై కేటీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
#AchheDin Badhai Ho Phir Ek Baar 👏👏 https://t.co/Q4IDe7qUOH
— KTR (@KTRTRS) May 7, 2022
గ్యాస్ ధరల పెంపుపై సోషల్ మీడియాలో చాలా విమర్శలు వస్తున్నాయి. బీజేపీ లీడర్లను నెటిజన్లు చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా వాళ్లు చేసిన పోరాటాల చిత్రాలు పెట్టి నిలదీస్తున్నారు.
#GasPrice
— varsha roshan (@RoshanVarsha2) May 7, 2022
Caption please pic.twitter.com/4MrMJJlxJB
Yeh 999 achcha nahi lagraha ... Round off kardhen ... 1000 Rs achcha lagta hei ...#GasPrice #Modi https://t.co/d9AtAMAhXi pic.twitter.com/0hx3jKIf8z
— K. V𝔞𝔡𝔦𝔳𝔢𝔩𝔞𝔫 🇮🇪🇮🇳 (@KevinVadivelan) May 7, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)