Maternity Leaves: మహిళలకు ఏడాది పాటు మెటర్నటీ లీవ్స్, కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
Maternity Leaves: ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఏడాది పాటు మెటర్నటీ లీవ్స్ ఇవ్వనున్నట్టు సిక్కిం ప్రకటించింది.
Maternity Leaves:
ఏడాది మాతృత్వ సెలవులు..
సిక్కిం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 12 నెలల మెటర్నటీ లీవ్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. పురుషులకు పెటర్నటీ లీవ్ కింద నెల రోజుల పాటు సెలవులు ఇస్తామని వెల్లడించింది. సిక్కిం స్టేట్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (SSCSOA) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ ప్రకటించారు. ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు, వాళ్లపై ఎక్కువ కేర్ తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం వివరిస్తోంది. దీనికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తెలిపారు. Maternity Benefit Act 1961 చట్టం ప్రకారం...ఓ మహిళకు 6 నెలల వరకూ మెటర్నటీ లీవ్స్ ఇవ్వొచ్చు. లేదంటే 26 వారాల వరకూ సెలవులు ఇచ్చేందుకు వీలుంది. అది కూడా పెయిడ్ మెటర్నటీ లీవ్స్. అయితే...సిక్కింలో జనాభా తగ్గిపోతోంది. ప్రస్తుతం భారత్‌లో అతి తక్కువ జనాభా ఉన్నది ఈ రాష్ట్రంలోనే. మొత్తంగా 6.32లక్షల అక్కడ నివసిస్తున్నారు. సిక్కిం అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకం అని చెప్పిన సీఎం ప్రేమ్ సింగ్...అందుకే వాళ్ల ప్రయోజనాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టు స్పష్టం చేశారు. అంతే కాదు. ప్రమోషన్స్ విషయంలోనూ తమ ప్రభుత్వం శ్రద్ధ పెట్టినట్టు వివరించారు. కొత్తగా IASలుగా ఛార్జ్ తీసుకున్న వాళ్లకు అభినందనలు తెలిపారు.
ఫైజర్‌లో పెటర్నటీ లీవ్స్..
దిగ్గజ ఫార్మా కంపెనీ ఫైజర్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత్‌లో పని చేసే పురుషులు 12 వారాల పాటు పిత్రృత్వ సెలవులు (Paternity leaves) తీసుకోవచ్చని వెల్లడించింది. ఈ వారమే ఈ నిర్ణయం తీసుకుంది. దత్తత తీసుకున్న వారికీ ఈ సెలవులు వర్తించ నున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. రెండేళ్ల కాలంలో ఈ పెటర్నిటీ లీవ్స్ తీసుకునేందుకు అవకాశ ముంటుంది. ఒకేసారి గరిష్ఠంగా నాలుగు వారాలు, కనిష్ఠంగా రెండు వారాలు సెలవులు తీసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. అంతే కాదు. వైద్య సేవల్నీ విస్తృతం చేసింది. సంతాన లేమితో బాధ పడుతున్న వారికి వైద్యం అందించడంతో పాటు టెలీ మెడిసిన్ సౌకర్యం కూడా కల్పించింది. పురుషులు, స్త్రీలు పిల్లలతో తగినంత సమయం గడపాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణం తీసుకున్నామని ఫైజర్ డైరెక్టర్ శిల్పి సింగ్ వెల్లడించారు. "పేరెంటింగ్‌లోని ఆనందం ఏంటో తెలుసుకోవాలనే పురుషులకు ఇలా సెలవులు ఇచ్చాం. ఈ 12 వారాల లీవ్స్‌తో వాళ్లు పితృత్వాన్ని ఆస్వాదిస్తామని భావిస్తున్నాం" అని అన్నారు. కొవిడ్ వ్యాక్సిన్‌లు తయారు చేయడంలో ఫైజర్ సంస్థ కీలక పాత్ర పోషించింది. పిల్లల సంరక్షణ బాధ్యత కేవలం తల్లులదే అనే ఆలోచనను పక్కన పెట్టి పలు దిగ్గజ సంస్థలు తప్పనిసరిగా పితృత్వ సెలవులు ఇస్తున్నాయి. వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా వర్క్, లైఫ్ బ్యాలెన్స్ కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదే అంటున్నారు నిపుణులు.
Also Read: Karnataka News: వేగంగా దూసుకొస్తున్న కారు, సడెన్‌గా బైక్ యూ-టర్న్- గాల్లో ఎగిరిన యువతి