Sidhu Skipped Dinner: జైలులో డిన్నర్ చేయని సిద్ధూ- ఖైదీ నంబర్ ఎంతో తెలుసా?
Sidhu Skipped Dinner: కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ జైలులో డిన్నర్ చేయలేదని ఆయన తరఫు లాయర్ తెలిపారు.
Sidhu Skipped Dinner: కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూను పటియాలా జైల్లోని బ్యారక్ నంబర్-10లో ఉంచారు. 34 ఏళ్ల క్రితం నాటి కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించింది సుప్రీం కోర్టు. హత్య కేసులో శిక్ష అనుభవిస్తోన్న మరో నలుగురితో కలిసి సిద్ధూ రాత్రంతా గడిపారు. రాత్రి భోజనం కింద చపాతీ, పప్పు ఇచ్చినా ఆయన తినలేదని సమాచారం.
ఖైదీ నంబర్
రాత్రి భోజనం చేయకుండా తినేసి వచ్చానని చెప్పి సిద్ధూ కొన్ని మందులు వేసుకున్నట్లు జైలు వర్గాలు తెలిపాయి. జైల్లో ఆయనకు ఖైదీ నంబర్ 137683 ఇచ్చారు. సిద్ధూకి కాలేయానికి సంబంధించిన సమస్యలున్నాయి. గోధుమలతో తయారైన ఆహారం సిద్ధూకి పడదని ప్రత్యేక భోజనం కోసం సిద్ధూ జైలు అధికారులకు విజ్ఞప్తి చేసినట్టు ఆయన ప్రతినిధి వెల్లడించారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు అమృత్‌సర్‌లో సిద్ధూతో పాటు పోటీపడిన శిరోమణి అకాలీ దళ్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజితా డ్రగ్స్ కేసులో ఈ జైల్లోనే ఉన్నారు.
ఇదే కేసు
1988, డిసెంబర్ 27న రోడ్డుపై సిద్ధూకు, గుర్నామ్ సింగ్ అనే 65 ఏళ్ల వృద్ధుడికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడిని సిద్ధూ తలపై కొట్టడంతో ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. పటియాలాలోని ట్రాఫిక్ జంక్షన్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఆ వృద్ధుడిని వాహనంలో నుంచి బయటకు లాగి మరీ సిద్ధూ పిడిగుద్దులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన గుర్నామ్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు 1999లో సిద్ధూను, ఆయన స్నేహితుడు సంధూను నిర్దోషులుగా తేల్చుతూ తీర్పిచ్చింది. బాధిత కుటుంబం హైకోర్టును ఆశ్రయించడంతో ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు పక్కకు పెట్టింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధూ సుప్రీం కోర్టుకు వెళ్లారు. 2007లో ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది. సిద్ధూకు సెక్షన్ 323 కింద రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పిచ్చింది. ఈ తీర్పుపై బాధిత కుటుంబం అభ్యంతరం తెలుపుతూ సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ రివ్యూ పిటిషన్‌ను విచారించిన సుప్రీం రూ.1000 జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పిచ్చింది. 34 ఏళ్ల నాటి కేసులో సుప్రీం తీర్పును వెలువరించింది.
చేయకుండా తినేసి వచ్చానని చెప్పి సిద్ధూ కొన్ని మందులు వేసుకున్నట్లు జైలు వర్గాలు తెలిపాయి. జైల్లో ఆయనకు ఖైదీ నంబర్ 137683 ఇచ్చారు. సిద్ధూకి కాలేయానికి సంబంధించిన సమస్యలున్నాయి. గోధుమలతో తయారైన ఆహారం సిద్ధూకి పడదని ప్రత్యేక భోజనం కోసం సిద్ధూ జైలు అధికారులకు విజ్ఞప్తి చేసినట్టు ఆయన ప్రతినిధి వెల్లడించారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు అమృత్‌సర్‌లో సిద్ధూతో పాటు పోటీపడిన శిరోమణి అకాలీ దళ్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజితా డ్రగ్స్ కేసులో ఈ జైల్లోనే ఉన్నారు.
Also Read: PM Modi Japan visit: జపాన్‌లో మోదీ సుడిగాలి పర్యటన- 40 గంటల్లో 23 సమావేశాలు
Also Read: COVID 19: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు- 65 మంది మృతి