Reservation For OBC Women: ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ల కోటా రచ్చ
Reservation For OBC Women: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. అయితే ఇందులో OBC మహిళలకు రిజర్వేషన్ల అంశం వివాదాస్పదం, చర్చకు దారి తీస్తోంది.
![Reservation For OBC Women: ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ల కోటా రచ్చ Should there be sub-quota for OBC women? Debate rages Reservation For OBC Women: ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ల కోటా రచ్చ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/20/590a2dd9bb632c8420472e0ed54943101695184095665798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Reservation For OBC Women: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. దశాబ్దాలుగా పెండింగ్ ఉన్న ఈ బిల్లుకు మోక్షం లభించినట్లైంది. అయితే ఇందులో OBC మహిళలకు రిజర్వేషన్ల అంశం వివాదాస్పదం, చర్చకు దారితీస్తోంది. మహిళలకు 33% సీట్ల రిజర్వేషన్ల అంశం గతంలో పార్లమెంట్ లోపల, వెలుపల అనేక ఆవేశ పూరిత చర్చలకు కారణమైంది. 1996 మహిళా రిజర్వేషన్ బిల్లును పరిశీలించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక OBCలకు రిజర్వేషన్‌ను కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించాలని, వారికి రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. రాజ్యసభ, శాసనమండలిలకు కూడా రిజర్వేషన్లు పొడిగించాలని సిఫారసు చేసింది. ఈ సిఫార్సులు ఏవీ 2010 బిల్లు, తాజా బిల్లులో పొందుపరచబడలేదు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో OBC లకు రిజర్వేషన్ కల్పించలేదు.
కొత్త బిల్లుపై బుధవారం లోక్‌సభ చర్చకు రానుంది. 1996లో గీతా ముఖర్జీ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ, 2009లో జయంతి నటరాజన్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నివేదికల్లో ఓబీసీ కోటా అంశంపై రాజకీయ పార్టీలు సమర్పించిన వాదనలు, సిఫార్సులు, పరిశీలనలను ఇక్కడ చూద్దాం. 2008 రాజ్యాంగ చట్టం (108వ సవరణ)పై 2009 డిసెంబరు పార్లమెంటులో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇందులో ఓబీసీ మహిళలు, కొంత మంది మైనారిటీలకు రిజర్వేషన్లపై చర్చకు దారితీసింది, OBCలకు రిజర్వేషన్లు కల్పించాలని ఒక వర్గం అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలించి తగిన సమయంలో దీనిపై చర్యలు తీసుకోవాలని కమిటీ అభిప్రాయపడింది.
1996 రిజర్వేషన్ బిల్లును పరిశీలించిన గీతా ముఖర్జీ నేతృత్వంలోని కమిటీ ఓబీసీలకు కూడా రిజర్వేషన్ల ప్రయోజనాన్ని వర్తింపజేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని సిఫారసు చేసింది. అయితే అప్పటి ప్రభుత్వం OBC మహిళలకు సీట్ల రిజర్వేషన్లు కల్పించడంపై బిల్లులో పొందుపరకపోవడాన్ని ముఖర్జీ నేతృత్వంలోని కమిటీ గమనిచింది. రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ఉన్నందున వారికి OBCలకు రిజర్వేషన్లు లేకుండా పోయాయి.
ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా నివేదిక నమోదు చేసింది. ఉదాహరణకు, రాష్ట్రీయ జనతా దళ్ తన రాతపూర్వక మెమోరాండమ్‌లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో, ముస్లింలు, క్రైస్తవులు, ఇతరులతో సహా OBC, మైనారిటీలు, దళితులు (SC/ST) కోటా తప్పనిసరిగా ఉండాలని. జనాభా లెక్కల ప్రకారం ఈ వర్గాల మహిళలకు కోటాలో తప్పనిసరిగా కల్పించాలని పేర్కొంది. అలాగే సమాజ్ వాదీ పార్టీ సైతం మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే అందులో ఓబీసీ, ముస్లిం మహిళలకు కోటా ఉండాలని స్పష్టం చేసింది.
అయితే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పార్టీలు మహిళా కోటాలో OBCకి ప్రత్యేక కోటా కోసం ఎటువంటి కారణాలు అవసరం లేదని అభిప్రాయపడింది. భారతీయ జనతా పార్టీ తన మెమోరాండంలో.. ప్రతిపాదిత మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తూనే రిజర్వేషన్లలో సబ్ రిజర్వేసన్లను తాము గట్టిగా తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. అలాగా సీపీఐ(ఎం) ప్రతినిధులు సైతం స్పందించారు. రాజ్యాంగబద్ధంగా ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించనందున ఓబీసీ మహిళా కోటాను పొడిగించాలన్న డిమాండ్‌తో తాము ఏకీభవించడం లేదన్నారు.
రిజర్వేషన్ల చట్టబద్దత, న్యాయసంబంధిత విషయాల్లో స్టాండింగ్ కమిటీ తన తుది నివేదికలో ఏకాభిప్రాయం సాధించడంలో విఫలమైంది. కమిటీలోని ఇద్దరు సభ్యులు వీరేందర్ భాటియా, శైలేంద్ర కుమార్ (ఇద్దరూ సమాజ్‌వాదీ పార్టీకి చెందినవారు) మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే ఈ బిల్లును రూపొందించిన విధానంతో విభేదిస్తున్నామని పేర్కొన్నారు. ఓబీసీలు, మైనార్టీలకు చెందిన మహిళలకు కోటా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో కమిటీలో ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే వీలైంత తొందరగా బిల్లును పార్లమెంటులో ఆమోదించి, అమలులోకి తీసుకురావాలని కమిటీ సిఫార్సు చేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)