Nitin Gadkari: సైరస్ మిస్త్రీ ప్రమాదంతో అలెర్ట్ అయిన కేంద్రం - ఇక నుంచి అన్ని వాహనాలకు అది తప్పనిసరి
Nitin Gadkari:ప్రస్తుతం అన్ని వాహనాల్లో సీట్ బెల్ట్ రిమైండర్‌లు ఉన్నప్పటికీ అది ముందు సీట్లకే పరిమితమైంది.
Nitin Gadkari: వాహన తయారీదారులు వెనుక సీట్లకు కూడా సీటు బెల్ట్ అలారం వ్యవస్థను ప్రవేశపెట్టడాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం తెలిపారు. ప్రస్తుతం అన్ని వాహన తయారీదారులు సీట్ బెల్ట్ రిమైండర్‌లు ఉన్నాయి. కానీ అది ముందు సీట్లకు మాత్రమే పరిమితమైంది.
"సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో మరణించినందున, వాహనాలలో వెనుక సీట్లకు కూడా సీట్ బెల్ట్ బీప్ సిస్టమ్ ఉంటుందని మేము నిర్ణయం తీసుకున్నాము" అని ఓ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ చెప్పారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో టాటా మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. కారు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (CMVR)లోని రూల్ 138 (3) ప్రకారం వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులు సీట్ బెల్ట్ పెట్టుకోరు. కానీ ఇది తప్పని సరి అని చాలా మందికి తెలియదు. కొందరికి తెలిసినప్పటికీ విస్మరిస్తుంటారు.
వెనుక సీట్లో కూర్చొని సీటు బెల్టు పెట్టుకోని వారిని పోలీసులు చూసినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. వారిపై ఎలాంటి జరిమానాలు కూడా విధించడం లేదు. అందుకే దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఇటీవలి రోడ్డు మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, 2020లో సీటు బెల్ట్ ధరించకపోవడం వల్ల 15,146 మంది మరణిస్తే... 39,102 మంది గాయపడుతున్నారు.