అన్వేషించండి

Actor Vijay Political Entry: విజయ్ ఇప్పుడే ఎందుకు పార్టీ పెట్టినట్టు? - తమిళనాడులో ఉన్న రాజకీయ పరిణామాలెలా ఉన్నాయి?

Actor Vijay Political Party: తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ కొత్త రాజకీయ పార్టీ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగించింది. అయితే, ఇప్పుడే ఆయన ఎందుకు ప్రకటించారనేది చర్చనీయాంశమైంది.

Reason Behind Actor Vijay New Political Party: తమిళనాడు విలక్షణ రాజకీయాలు ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. అప్పటి జయలలిత నుంచి నేటి తరం వరకూ ప్రముఖ నటులు రాజకీయాల్లో రాణించి ప్రజల మనసులను గెలిచారు. సీఎం పీఠాన్ని అధిరోహించి తమదైన పాలనతో ప్రత్యేక ముద్ర వేశారు. తాజాగా, తమిళ స్టార్ హీరో దళపతి రాజకీయ అరంగేట్రం ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన సృష్టించింది. ఎప్పటి నుంచో ఈ ప్రచారం ఉన్నా.. 'తమిళగ వెట్రి కళగం' పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం దళపతి విజయ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం డీఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు సీఎంగా.. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా ఉన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఏఐడీఎంకే ఎడప్పాడి కె.పళనిస్వామి ఉన్నారు. 

జయలలిత మరణం తర్వాత

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అకాల మరణంతో అన్నాడీఎంకే దిక్కులేని పరిస్థితిని చవిచూసింది. ఆ తర్వాత పార్టీలో అంతర్గత కలహాలతో ఓ.పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళని స్వామి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. చివరకు ఓపీఎస్ కు పళని స్వామి ఉద్వాసన పలికి పైచేయి సాధించారు. ఈ క్రమంలో పన్నీర్ సెల్వం.. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ తో కలిసి పని చేస్తామని ప్రకటించారు. ఇది అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగించింది. శత్రువుకు శత్రువు మిత్రుడనే నానుడిని నిజం చేస్తూ బద్ద శత్రువులైన పన్నీర్ సెల్వం, దినకరన్ చేతులు కలపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. 2024 లోక్ సభ ఎన్నికల నాటికి పటిష్ట కూటమిగా ఏర్పడి.. అన్నాడీఏంకేని నిజమైన పార్టీ కార్యకర్తలకు అప్పగిస్తామని పన్నీర్ సెల్వం, దినకరన్, శశికళ త్రయం చెబుతున్నారు. పార్టీని సంరక్షించడానికే తాము కలిసి పోరాడాల్సిన అవసరం వచ్చిందనే సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాగా, ప్రధాన ప్రతిపక్షంలో చీలికల నేపథ్యం, స్టార్ హీరో రజినీకాంత్ పార్టీ పెడతానని చెప్పి వెనుకడుగు వేయడం వంటి కారణాలతో పార్టీ ఏర్పాటుకు ఇదే సరైన సమయమని దళపతి విజయ్ భావించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

జనం మెచ్చిన నటుడు

తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్ డమ్ ఉన్న నటుడు విజయ్. అభిమానులు 'దళపతి' అని ముద్దుగా పిలుచుకునే విజయ్.. కొంతకాలంగా చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడం సహా.. తన అభిమానులకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల రజినీకాంత్ పాలిటిక్స్ లోకి రానని స్పష్టం చేయడంతో తన పార్టీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఇటీవల 'మక్కల్ ఇయక్కం' (అభిమానుల సంఘం) నిర్వాహకులతో పలుమార్లు సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. 'తమిళగ మున్నేట్ర కళగం' పేరుతో పార్టీ స్థాపిస్థారని తొలుత అంతా భావించినా.. దీనికి స్వల్ప మార్పులు చేసి 'తమిళిగ వెట్రి కళగం' పేరు ఖరారు చేశారు. కాగా, తమిళ స్టార్ నటులు విజయ్ కాంత్ (డీఎండీకే), కమల్ హాసన్ (మక్కల్ నీది మయ్యమ్) సైతం కొత్త పార్టీలు స్థాపించి పాలిటిక్స్ లో అనుకున్నంత విజయం సాధించలేకపోయారు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా బరిలోకి దిగుతామని.. త్వరలోనే జెండా, అజెండాను ప్రకటిస్తామని విజయ్ ప్రకటించారు. ఈ క్రమంలో దళపతి విజయ్ కొత్త పార్టీ తమిళ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. 

Also Read: Jharkhand CM Champai Soren: ఝార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం - 10 రోజుల్లో బల నిరూపణకు గవర్నర్ ఆదేశం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget