Ratan Tata : నానో కారుతో ఆటోమొబైల్ ప్రపంచాన్ని షేక్ చేసిన రతన్ టాటా - IPL, AIR Indiaను ఆదుకున్న రక్షకుడు
Ratan Tata : దేశంలో కష్టం వస్తే ముందుగా గుర్తుకు వచ్చేది టాటా సంస్థే. ప్రభుత్వాలు సైతం మొదట చూసేది టాటా వైపే. అంత క్రెడిబిలిటీని రతన్ టాటా సంపాదించి పెట్టారు. చాలా సమస్యలకు పరిష్కారం చూపారు.

Ratan Tata Death News : లక్ష రూపాయలకే కారు. అంతే దాంట్లో మరో మాట లేదు. లక్ష రూపాయలు అంటే మిడిల్ క్లాస్ వాడు ఈ రోజు బైక్ కొనేందుకు పెడుతున్న ఖర్చు. ఈ రేట్లో కారు కొనిస్తే ప్రతీ సామాన్యుడు కారు ఓనర్ అవుతాడని...అది చూడటానికి చాలా బావుంటుందని కలలు కనేవారు రతన్ టాటా. ఆయన ఆలోచనల్లో నుంచి పుట్టినదే టాటా నానో కారు. ఈ ఒక్క ఆలోచన, ఈ ఒక్క ప్రకటన ఆటో మొబైల్ ప్రపంచాన్ని షేక్ చేసింది.
మనమేమో కోట్లు కోట్లు పెట్టి కార్లలో విలాసాలు పెడుతుంటే ఈ పెద్దాయన ఏంటీ లక్ష రూపాయలకే కారు ఇచ్చేస్తానంటున్నారంటూ కుళ్లుకోని కార్ల కంపెనీలు ఉండి ఉండవు ఆ టైమ్‌లో. చిన్నగా ఎఫర్డబుల్ ప్రైస్‌లో ఓ ఫ్యామిలీ హ్యాపీగా ట్రావెల్ చేయగలిగేలా నానో కారును రూపొందించారు. ఈ కారును 2008లో తీసుకువచ్చారు రతన్ టాటా. అప్పట్లో ఇది పెద్ద సంచలనమైంది.
దురదృష్టవశాత్తు నానో కారు అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఎఫర్డ్ బుల్ కానీ కార్ బుకింగ్‌కి దొరికేది కాదు. లో కాస్ట్ కానీ సేఫ్టీ వైజ్‌గా చాలా ఇష్యూస్ ఉండేవి. సరైన ఆర్‌ఎన్డీ వ్యవస్థ లేకపోవటంతో చిన్న చిన్న లోపాలు సవరించటానికి ఎక్కువ సమయం తీసుకునేవాళ్లు అప్పట్లో. ఈలోగా నానో కారుపై నెగటివ్ ప్రచారం మొదలైంది.
మొత్తానికి నానో కారు ఓ ఫెయిల్యూర్ మోడల్ అనే టాక్ స్ప్రైడ్ అయిపోయింది. రతన్ టాటా ఆలోచన ఉన్నతమైంది. లక్ష రూపాయల్లో ధనవంతులు పొందే విలాసాలను సామాన్యులకు అందిద్దామనుకున్నారు ఆయన. కానీ ఫలితం వేరేలా వచ్చింది. 2018లో టాటా నానో కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కానీ రతన్ టాటా నానో కారును ఫెయిల్యూర్ అనటానికి ఇష్టపడేవారు కాదు. అందుకే ఆయనే సొంతంగా నానో కారులో తిరుగుతూ తన కలను నెరవేర్చుకోలేకపోయాననే బాధపడేవారని చెబుతుంటారు సన్నిహితులు.
ఐపీఎల్, ఎయిర్ ఇండియా సమస్యల్లో ఉన్నప్పుడు కూడా రతన్ టాటా ఆపన్న హస్తం అందించారు. నేను ఉన్నానంటూ ముందుకొచ్చారు. ఎయిర్ ఇండియా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. నిర్వహణ కేంద్రప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారిపోయింది. ఇక మోదీ సర్కార్‌కు ముందున్నదే ఒకటి దారి ఎయిర్ ఇండియాను ఎవరికైనా ప్రైవేట్ సంస్థకు అమ్మేయటం. కానీ ఎవరికి అమ్మాలి. ఎవరికైనా అది ప్రభుత్వం తీరని తలనొప్పి. అప్పటికే అన్ని ప్రభుత్వసంస్థలను ప్రైవేటేజేషన్ చేస్తున్నారని మోదీ సర్కార్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. కానీ వాటికి భయపడి ఎయిర్ ఇండియాను ప్రభుత్వమే కొనసాగిస్తే... అది ప్రభుత్వాన్నే ఓ రోజు కుదిపేయొచ్చు. అందుకే మోదీ సర్కార్‌కి కనిపించిన ఒకే ఒక వ్యక్తి రతన్ టాటా.
కేంద్ర ప్రభుత్వం 2022 వరకూ నిర్వహించిన ఎయిర్ ఇండియా ఒకప్పుడు టాటాల ఆస్తే. టాటా ఎయిర్ లైన్స్ విమాన సర్వీసులను ప్రారంభించింది జేఆర్డీటాటా. మరి అలాంటిది తర్వాత జాతీయకరణలో భాగంగా ఎయిర్ ఇండియాగా మారింది. సో ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంటే మళ్లీ టాటాలే దాన్ని టేకోవర్ చేశారు. పైగా రతన్ టాటా తన దేశభక్తిని కూడా అక్కడే చాటుకున్నారు. తిరిగి సొంతగూటికి వచ్చినా ఎయిర్ ఇండియా పేరు మార్చలేదు రతన్ టాటా. ఇప్పటికి ఎయిర్ ఇండియా పేరే ఉంది. పైగా అప్పులు తీరకపోగా మరింత భారంగా మారినా టాటాలు దాన్ని కొనసాగిస్తున్నారు. టాటాలు నిర్వహించే మరో విమానాయాన సంస్థ ఎయిర్ విస్తారాతో ఎయిర్ ఇండియాను మెర్జ్ చేయాలని చూస్తున్నారు.
వేల కోట్లు సంపాదించే ఐపీఎల్‌కి ఎలాంటి నష్టాలు లేవు కానీ ఓ ఇష్యూ వచ్చి పడింది. అది కూడా జాతీయతకు సంబంధించి. కేంద్రం అప్పట్లో చైనా వస్తువులను నిషేధించింది. చైనా యాప్‌లు, చైనా కంపెనీల వస్తువుల వాడకంపై నిషేధాజ్ఞలు పెట్టింది. అలాంటి టైమ్‌లో ఐపీఎల్‌లో కొన్ని చైనా కంపెనీలే మెయిన్ స్పాన్సర్‌గా ఉన్నాయి. ఇక ప్రతిపక్షాలు అదే అస్త్రాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ఐపీఎల్ మెయిన్ స్పాన్సర్‌గా నిర్విహంచేంత స్థాయి సంస్థను పట్టుకోవాలి. కనిపించిన ఏకైక మార్గం రతన్ టాటానే.
2500 కోట్ల రూపాయల స్పాన్సర్ షిప్‌ను ప్రకటించిన టాటా గ్రూప్ 2022 నుంచి 2028 వరకూ ఐపీఎల్ స్పాన్సర్ షిప్ హక్కులను దక్కించుకుంది. ఇకంతే టాటా ఐపీఎల్‌కు తిరుగులేదు. ఆ బ్రాండింగ్‌కు ఎదురే లేదు. దటీజ్ రతన్ టాటా అండ్ టాటా గ్రూప్ క్రెడిబులిటీ.
Also Read: రతన్ టాటా వారసుల రేస్‌లో మాయా, నెవిల్లే , లియా- ఎవరు ఎందులో గొప్ప!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

