13 New Temples in Ayodhya: అయోధ్యలో మరో 13 ఆలయాలు.. రామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ భారీ ప్రణాళిక
అయోధ్యలో బాలరాముని మందిరమే కాదు.. మరో 13 ఆలయాల నిర్మాణానికి తీర్థ ట్రస్ట్ భారీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఆరు... రామమందిరం లోపలే నిర్మించనుండగా మిగిలిన వాటిని వెలుపల నిర్మించనున్నారు.
13 New Temples in Ayodhya: దాదాపు 500 ఏళ్ల(500 Years) సుదీర్ఘ నిరీక్షణ, అనేక ఉద్యమాలు, నిరసనలు, న్యాయ పోరాటాల అనంతరం.. ఉత్తరప్రదేశ్(UP)లోని రామజన్మభూమి(Rama JanmaBhoomi) అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికి కేవలం తొలి దశ(First Phase) పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఈ పనుల్లో భాగంగా కీలకమైన గర్భాలయం పూర్తి చేయడం.. బాలరాముని విగ్రహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగడం తెలిసిందే. ఆ సేతు హిమాచలం.. బాలరామయ్య ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను తనివితీరా వీక్షించి.. ఆనంద సమ్మోహితమైంది. దేశవ్యాప్తంగా రామ నామస్మరణ మార్మోగింది.
లోపల.. బయట కూడా..
అయితే.. అయోధ్య(Ayodhya)లో కేవలం బాలరాముని మందిరమే కాదు.. మరో 13 ప్రధాన ఆలయాల నిర్మాణానికి రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ భారీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. 13 ప్రధాన ఆలయాల్లో ఆరు దేవాలయాలు.. అయోధ్య రామమందిరం లోపలే(Inside) నిర్మించనుండగా.. మిగిలిన వాటిని వెలుపల నిర్మించనున్నారు. ఈ అంశాలకు సంబంధించి రామజన్మభూమి తీర్థ ట్రస్ట్(RamaJanma Bhoomi Theertha trust) కోశాధికారి స్వామి గురుదేవ్ గిరీజీ(Swami guru dev Giriji) ఓ మీడియా సంస్థకు వివరించారు. ఆయా ఆలయాలకు సంబంధించిన పనులు.. ప్రస్తుతం పురోగతిలో ఉన్నట్టు చెప్పారు.
నాలుగు మూలల్లో..
``ప్రధాన మంత్రినరేంద్ర మోడీ(PM Narendra Modi) చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరిగిన బాలరాముని ఆలయంలో ప్రస్తు తం ఫస్ట్ ఫ్లోర్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. రెండో అంతస్థు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. తర్వాత శిఖరం(Shikhar), పైకప్పు త్వరలోనే పూర్తికానున్నాయి`` అని గురుదేవ్ వివరించారు. అయోధ్య రామాలయంలో మరో ఐదు ప్రధాన ఆలయాల పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. రాముడు విష్ణువు యొక్క అవతారంగా పరిగణించబడుతున్నందున, గణపతి, శివుడు, సూర్యుడు, జగదాంబ దేవతల ఆలయాలను నిర్మిస్తున్నామన్నారు.ప్రధాన ఆలయానికి నాలుగు మూలల్లో ఈ ఆలయాలు ఉంటాయన్నారు.
ఫినిషింగ్ టచ్‌లో పనులు
ఇక, శ్రీరాముని(Sriram) పట్ల దాస్య భక్తిని చాటిన హనుమంతునికి కూడా ప్రత్యేకంగా ఆలయం నిర్మిస్తున్నట్టు గురుదేవ్ వెల్లడించారు. ఈ దేవాలయాలలో ఇప్పటికే విగ్రహాలు స్థాపించడానికి సంబంధించిన పని పురోగతిలో ఉందన్నారు. ప్రస్తుతం పాలిషింగ్, ఫినిషింగ్ టచ్ పనులు మిగిలి ఉన్నాయన్నారు. సీతా రసోయి దగ్గర, సీతా దేవి వంటగదిగా పరిగణించబడే ప్రదేశంలో అన్నపూర్ణ దేవి ఆలయాన్ని నిర్మించనున్నట్టు గురుదేవ్ తెలిపారు.
రామునితో కలిసి నడిచిన వారికి కూడా
అయోధ్య రామాలయ సముదాయం వెలుపల(Out side of the temple), భారీ ప్రదేశంలో మరో ఏడు దేవాలయాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. వీటిని రాముడి జీవితంలో పాలు పంచుకున్న వారికి అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. "ఇవి సాధువులైన వాల్మీకి(Valmiki), వశిష్టుడు(Vasishta), విశ్వామిత్రుడు(Viswamitra), శబరి(Shabari), రాముడి కోసం తన ప్రాణాలను అర్పించిన పక్షి జటాయువు కోసం నిర్మిస్తున్నాం`` అని చెప్పారు.
ఎన్నో విశేషాలు
అయోధ్యలో నిర్మితమైన దివ్య, భవ్య రామమందిరంలో ప్రతిష్ఠించిన నూతన రామ్‌లల్లా విగ్రహానికి ‘బాలక్ రామ్’గా(Balak Ram) నామకరణం చేశారు. ఈ విగ్రహంలో రాముడు ఐదేళ్ల బాలుడిని పోలి ఉండటమే దీనికి కారణమని ఆలయ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఇప్పటివరకూ దాదాపు 50-60 విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠలు నిర్వహించానని, వాటన్నింటిలోకీ ఇదే తనకు అత్యంత అలౌకిక ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. కాగా, రామాయణం, రామచరిత్ మానస్ లాంటి గ్రంథాలను విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాతే బాల రాముడి విగ్రహానికి ఆభరణాలను సిద్ధం చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ పేర్కొంది.