భారత్‌ని ముందుండి నడపగలిగేది రాహుల్ మాత్రమే, కాంగ్రెస్ ధీమా
Rahul Gandhi: వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ భారత్‌ని ముందుండి నడిపిస్తారని డీకే శివకుమార్ వెల్లడించారు.
Congress MP Rahul Gandhi:
డీకే శివకుమార్ వ్యాఖ్యలు..
పార్టీ ప్రెసిడెంట్ పదవిలో లేకపోయినప్పటికీ..రాహుల్ గాంధీ (Rahul Gandhi) చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. కాంగ్రెస్‌ని పూర్తి స్థాయిలో ముందుండి నడుపుతున్నారు. భారత్ జోడో యాత్ర తరవాత ఆయనలో మార్పు కనిపిస్తోంది. ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తున్నారు. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. పార్టీలోని సీనియర్ నేతలంతా రాహుల్ కనుసన్నల్లోనే నడుస్తున్నారు. అంతే కాదు. రానున్న ఎన్నికల బాధ్యత అంతా తీసుకున్నారట రాహుల్. ఈ విషయం కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Election 2024) కాంగ్రెస్‌ని రాహుల్ గాంధీయే లీడ్ చేస్తారని ప్రకటించారు. భారత్ జోడో యాత్ర తరవాత రాహుల్‌కి పాపులారిటీ పెరిగిందని స్పష్టం చేశారు. ఈ కారణంగానే బీజేపీలో భయం మొదలైందని అన్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ మధ్య యుద్ధం మొదలైంది. బీజేపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆ ధాటిని తట్టుకుని మరీ కాంగ్రెస్ కూడా సోషల్ మీడియాలో బీజేపీపై సెటైరికల్ పోస్ట్‌లు పెడుతోంది. ఇటీవల రెండు పార్టీలూ పోస్టర్ వివాదం మొదలైంది. ఇలాంటి తరుణంలో డీకే శివకుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆసక్తికరంగా మారింది.
"రాహుల్ గాంధీ పాపులారిటీ పెరుగుతోంది. అందుకే బీజేపీలో భయం మొదలైంది. భారత్ జోడో యాత్ర తరవాత రాహుల్ వైఖరిలో చాలా మార్పు వచ్చింది. ఇప్పటి వరకూ బీజేపీ ఆయనపై చేసిన తప్పుడు ప్రచారం అంతా తలకిందులైంది. ప్రజలంతా ఇప్పుడు ఆయనని లీడర్‌గా గుర్తిస్తున్నారు. ప్రతి అడుగునీ గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే ముందుండి నడిపిస్తారు"
- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం
VIDEO | "BJP is afraid of the popularity of Rahul Gandhi. After 'Bharat Jodo Yatra', the perception of Rahul Gandhi, that the BJP tried to create, has changed. He is the leader to be watched. He will lead the country in the next elections," says Karnataka Deputy CM @DKShivakumar… pic.twitter.com/FgavCKqznb
— Press Trust of India (@PTI_News) October 7, 2023
ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ట్విటర్లో కాంగ్రెస్ ఓ పోస్ట్ పెట్టింది. "అబద్ధాల కోరు" అంటూ మోదీ ఫొటోను షేర్ చేసింది. త్వరలోనే ఎన్నికల ర్యాలీలకు సిద్ధం అంటూ వెల్లడించింది. ఆ తరవాత మరో ఫోటోనీ షేర్ చేసింది. అందులోనూ ప్రధాని మోదీని టార్గెట్ చేసింది. ఇవి బీజేపీయేతర వర్గాల్లోకి బాగానే వెళ్లాయి.
The Biggest Liar pic.twitter.com/rs56VSWRK1
— Congress (@INCIndia) October 4, 2023
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఇదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీకి పది తలలు అతికించి రావణుడు అంటూ ఓ పోస్ట్ పెట్టింది. ధర్మాన్ని నాశనం చేసే వ్యక్తి, భారత్ వ్యతిరేకి అంటూ స్ట్రాంగ్‌గా రిప్లే ఇచ్చింది. ఇలా రెండు పార్టీల మధ్య పోస్టర్ వార్ మొదలైంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రంగా స్పందించారు.
The new age Ravan is here. He is Evil. Anti Dharma. Anti Ram. His aim is to destroy Bharat. pic.twitter.com/AwDKxJpDHB
— BJP (@BJP4India) October 5, 2023
Also Read: ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కావాల్సిందే, భారత్ తరపున పుతిన్ పోరాటం