By: ABP Desam | Updated at : 18 Jun 2022 09:17 AM (IST)
తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోదీ
ప్రధానమంత్రి మోదీ తల్లీ హీరాబెన్ వందో పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ... తన తల్లిని గుజరాత్‌లో కలిశారు. ఆమె కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమెతో కలిసి ఇంట్లోనే పూజామందిరంలో ప్రత్యేక పూజలు చేశారు
గాంధీనగర్‌లోని రాయసన్ గ్రామంలో మోదీ సోదరుడు పంకజ్ మోదీతో కలిసి హీరాబెన్ నివశిస్తున్నారు. వాంద్‌నగర్‌లోని హట్కేశ్వర్ మహదేవ్ టెంపుల్ నిర్వాహకులు హీరాబెన్ కలకాలం ఆరోగ్యంగా జీవించాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi met his mother Heeraben Modi at her residence in Gandhinagar on her birthday today.
— ANI (@ANI) June 18, 2022
Heeraben Modi is entering the 100th year of her life today. pic.twitter.com/7xoIsKImNN
పంచమహాల్స్‌జిల్లా పావ్‌గఢ్‌లోని మహంకాళి దేవాలయాన్ని మోదీ సందర్శించనున్నారు. దీన్ని పునర్‌నిర్మించిన తర్వాత ప్రధాని మోదీ సందర్శించడం ఇదే తొలిసారి. అక్కడ జరిగే ధ్వజస్తంభ ప్రతిష్టలో పాల్గోనున్నారు.
పావ్‌గఢ్.. గుజరాత్‌లో చాలా ఫేమస్ పర్యాటక ప్రదేశం. దేశంలోని ఉన్న 52 శక్తి పీఠాల్లో పావ్‌గఢ్ ఒకటి. ఇతి పురాతనమైన మా కాళీ టెంపుల్ ఇక్కడ ఉంది. ఇక్కడ విశ్వామిత్ర తపస్సులు చేసేవారని ఇక్కడి వారి నమ్మకం.
పావ్‌గఢ్ సముద్రమట్టానికి 762 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ శక్తిపీఠాన్ని చేరుకోవడానికి మెట్లమార్గంతోపాటు, రోప్‌వే సౌకర్యం కూడా ఉంది. పావ్‌గఢ్‌లోని దేవాలయాన్ని 2004లో ప్రపంచ వారసత్వ సంపదా యునిస్కో గుర్తించింది. ఎంతు ప్రాసస్త్యం ఉన్న ఈ గుడిని చాలా ఏళ్ల నుంచి అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఒక దేవాలయంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేశారు. దేవాలయ పునః ప్రారంభానికి ప్రధాని మోదీ రావడంతో భద్రతా కారణాల దృష్ట్యా భక్తులను రానివ్వలేదు. గురువారం నుంచే భద్రతా దళాలు దేవాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
దేవాలయ శిఖరం శిథిలమై పడిపోవడంతో పూర్తిగా దేవలయాన్ని పునర్‌నిర్మించారు. గర్భగుడిని బంగారు తాపడంతో తీర్చిదిద్దారు. ఒకప్పుడు ఈ గర్భగుడి సమీపంలోనే దర్గా కూడా ఉండేది. దీనిపై ఎప్పటి నుంచో వివాదం నడిచింది. కోర్టుల్లో కేసులు కూడా నడిచాయి. కానీ నాలుగేళ్ల క్రితం ఇరు వర్గాలు కూర్చొని అక్కడి నుంచి దర్గా తీసేసే వేరే ప్రాంతంలో నిర్మించేందుకు అంగీకరించారు. అదే టైంలో గుడి పునర్‌నిర్మాణానికి కూడా అడుగులు పడ్డాయి.
SSC JE Exams: ఎస్‌ఎస్‌సీ జేఈ టైర్-2 పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
CSIR UGC NET 2023: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?
ABP Cvoter Exit Poll: ఏయే రాష్ట్రంలో ఎవరిది పైచేయి? ABP CVoter ఎగ్జిట్ పోల్ కచ్చితమైన అంచనాలు
RRC: నార్త్ సెంట్రల్ రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
Madhya Pradesh Exit Poll 2023 Highlights: మధ్యప్రదేశ్ ఈసారి కాంగ్రెస్‌దే! ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవే
Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!
Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం
Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!
Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!
/body>