గర్భం దాల్చేందుకు పల్లెటూరికి విదేశీ యువతులు క్యూ! మగాళ్లకు డబ్బులిచ్చి మరీ గర్బధారణ !
ఆర్యుల జాతికి చెందిన యువకులతో శారీరకంగా గడిపేందుకు విదేశీయువతులు క్యూ కడుతున్నారు. గర్బం దాల్చి తిరి తమతమ దేశాలకు వెళ్తున్నారు యువతులు.
"ఇచ్చట.. అబ్బాయిలు రెంట్‌కు ఇవ్వబడును.. డబ్బులిచ్చి వీరితో ఏకాంతంగా గడపవచ్చు.!" అదేంటీ.. రెంట్‌కు ఇళ్లను కార్లను ఇవ్వడం చూశాం కానీ.. అబ్బాయిలను అద్దెకు ఇవ్వడం ఏంటని షాక్ అవుతున్నారా..? అవును మీరు చదివింది అక్షరాల నిజం.. మగాళ్లకు డబులిచ్చి మరీ వారితో ఏకాంతంగా గడిపి, పిల్లలను కనేందుకు విదేశీ భామలు ఓ పల్లెటూరికి క్యూ కట్టారు. దీంతో ఆ ఊరికి ప్రెగ్నెన్సీ టూరిజం స్పాట్‌గా మంచి పేరు వచ్చింది. ఇంతకీ.. "ప్రెగ్నెన్సీ టూరిజం" అంటే ఏమిటి.? విదేశీ భామలు ఇక్కడి మగాళ్లతో శృంగారంలో ఎందుకు పాల్గొంటున్నారో వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
ప్రెగ్నెన్సీ టూరిజం:
ఏదైనా పర్యటక ప్రాంతానికి టూరిజం స్పాట్ అనడం సాధారణమే. కానీ ప్రెగ్నెన్సీ టూరిజం అనే పేరును మాత్రం మీరు ఎప్పుడూ విని ఉండరు. ఇంతకీ.. ఈ పేరు ఎలా వచ్చిందంటే.. లద్దాఖ్‌లో సింధూ నది ఒడ్డున ఉండే బియామా, దాహ్, హానూ, దార్చిక్ లాంటి గ్రామాల్లో బ్రోక్పా సముదాయానికి చెందిని ప్రజలు జీవిస్తున్నారు. వీరి సంఖ్య కేవలం 5వేలు మాత్రమే. అయితే ఈ ప్రజలు తమను తాము చిట్ట చివరి ఆర్యులుగా చెప్పుకుంటారు. అయితే ఈ ఆర్యుల గురించి మనం చాలా పురాణాల్లో విన్నాం. ఆర్యులు ఆజానుబాహులని, మంచి అందగాళ్లని పేరుంది. అలాంటి జాతి ఇంకా భూమి మీద ఎక్కడైనా ఉందా అంటే లద్దాఖ్‌లో ఉన్న చిన్న చిన్న గ్రామాలైన బియామా, దాహ్, హానూ, దార్చిక్ లాంటి ప్రాంతాల్లోనే ఉన్నారు. అయితే వీళ్లు ఆర్యులన్న విషయం తెలుసుకున్న విదేశీ యువతులు ఈ గ్రామాలకు క్యూ కడుతున్నారు. ఇలా వచ్చేవారిలో ముఖ్యంగా యూరప్, జర్మన్ మహిళలే ఎక్కువగా ఉన్నారు.
ఆర్యుల జాతి, వారి తరంగా చెప్పుకునే వారితో పిల్లలను కనేందుకు యూరప్ నుంచి మహిళలు ఇక్కడికి వస్తున్నారు. యూరప్‌లో హిట్లర్ కాలం నుంచి ఆర్యజాతి మానవజాతిలోనే స్వచ్ఛమైన జాతి అనే మోజు ఉంది. భూమిపై ఉన్న ప్రజలందరిలో ఆర్యన్లలోనే అత్యంత స్వచ్ఛమైన రక్తం ఉందని జర్మన్ నాజీలు నమ్ముతారు. ఆర్యుల జాతికి చెందిన మగవాళ్ల ఎత్తు చాలా ఎక్కువగా, కండలు తిరిగిన దేహంతో ఉంటారని ప్రసిద్ధి. అంతేకాదు.. బంగారు రంగులో చర్మంతో పాటు జుట్టు ఎరుపు కలర్‌లో, కళ్లు నీలి రంగులో ఉంటాయి. మిగతా లద్దాఖ్ వాసులతో పోలిస్తే బియామా, గార్కొనే దార్చిక్ దాహ్, హానూ లాంటి గ్రామాల్లో ప్రజల ముఖాలు చాలా భిన్నంగా కనిపిస్తాయి. ఇలాంటి వారితో సంభోగంలో పాల్గొని ఆర్యజాతికి చెందిన బిడ్డకు జన్మనివ్వాలని విదేశీ మహిళలు కోరుకుంటున్నారు.
ఇక తాజాగా ఇంటర్నెట్ రాకతో అంతర్జాతీయంగా ఈ జాతి ప్రజల గురించి శోధించేవారి సంఖ్యా పెరిగింది. దీంతో ఈ గ్రామాలకు ప్రెగ్నెన్సీ టూరిజం అనే పేరు వచ్చింది. కానీ, ఆర్యుల జాతి అనే చెప్పుకునే ప్రజలు.. ప్రెగ్నెన్సీ టూరిజం గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు. ఎందుకంటే.. దీని వల్ల తమ సముదాయానికి చెడ్డ పేరు వస్తుందని వారు భావిస్తారు. అయితే కొన్నేళ్ల క్రితం దాహ్ గ్రామంలో ఆర్యులు ఉన్నారన్న విషయం తెలుసుకున్న జర్మనీకి చెందిన ఓ మహిళ.. టూరిజం కోసం ఇక్కడికి వచ్చి ఆర్యుల జాతికి చెందిన మగాళ్లతో చాలా రోజులు గడిపిన్నట్లు తెలుస్తోంది. ఆమె గర్భం దాల్చాకే ఇక్కడి నుంచి వెళ్లిందంటా. ఇలా ఆమె వచ్చి వెళ్లిన తర్వాత ఆమెకు ఓ బాబు జన్మించాడని, ఆ తర్వాత ఈ విషయం ప్రపంచంలోని చాలా మందికి తెలిసిన్నట్లు దాహ్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వెళ్లడించాడు. ఆ తర్వాత క్రమంగా విదేశీయువతులు ఈ చుట్టుముట్టు గ్రామాల్లో ఉన్న ఆర్యుల వద్దకు రావడం.. గర్భం దాల్చడం, ఇక్కడి నుంచి తిరిగి వెళ్లడం జరుగుతుందని తెలిపారు.
ఒకప్పుడు విదేశీ యువతులు వచ్చి ఆర్యుల జాతికి చెందిన అబ్బాలతో ఏకాంతంగా గడపాలని ఉందని అడిగితే ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా వారికి ఇష్టం ఉండే అందుకు అంగీకరించేవారు. కానీ.. ఇప్పుడు అంతా పక్కా కమర్షియల్ అయిందని, విదేశీ అమ్మాయిలు మా వళ్ల మీరు గర్భం దాల్చాలంటే, అందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అంటున్నారు ఆర్యులు జాతికి చెందిన యువకులు. దీంతో ఇప్పుడు పెయిడ్ ప్రెగ్నెన్సీ టూరింజంగా రోజూ సందర్శకులతో ఆ ప్రాంతం ఫేమస్ అవుతోంది.