రాజకీయ పార్టీలకు ఈసీ షాక్, ఎన్నికల లెక్క తేల్చేందుకు స్పెషల్ వెబ్‌పోర్టల్
Political Parties: ఇకపై రాజకీయ పార్టీలు తమ లెక్కల్ని ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేయాలని ఈసీ ఆదేశించింది.
Political Parties:
వెబ్‌పోర్ట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశం..
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఇకపై అన్ని రాజకీయ పార్టీలు తమ ఫైనాన్షియల్ అకౌంట్స్‌కి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌పోర్టల్‌ని క్రియేట్ చేయనుంది. ఎన్నికల కోసం ఎంత ఖర్చు చేశారన్న లెక్కలు ఇందులో డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేయడానికి వీలుంటుంది. ఎన్నికల వ్యయంపై పారదర్శకత ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల అకౌంటబిలిటీ కూడా పెరుగుతుందని వెల్లడించింది. పోల్ ప్యానెల్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే...ఏదైనా ఓ పార్టీ ఆన్‌లైన్ ఈ లెక్కలు సబ్మిట్ చేయకపోతే..అందుకు కారణాలేంటో ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కారణం సరైనదే అనిపిస్తే...హార్డ్ కాపీ ఫార్మాట్‌లో వాటిని సబ్మిట్ చేసేందుకు ఈసీ అనుమతినిస్తుంది. ఆ తరవాత ఎన్నికల సంఘమే ఆ వివరాలను ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేస్తుంది. ఫిజికల్ రిపోర్ట్స్‌ని సబ్మిట్ చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయని, వాటికి పరిష్కారంగానే ఈ కొత్త పోర్టల్ తీసుకొచ్చామని అధికారులు వెల్లడించారు.
Political Parties will now be able to file financial accounts online, with the Election Commission opening a web portal for filing of three types of reports - Contribution Report, Audited Annual Account and Election Expenditure Statements by Political Parties: Election Commission… pic.twitter.com/v3UK01YCzj
— ANI (@ANI) July 3, 2023
In a letter to the political parties, the Commission has said the step has been taken with twin objectives – to overcome difficulties in filing physical reports, and to ensure timely filing in a standardised format A manual and FAQ explaining use of the on-line portal and…
— ANI (@ANI) July 3, 2023
"ఎన్నికల ఖర్చులకు సంబంధించిన లెక్కలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలి. ఫలితంగా పారదర్శకత పెరుగుతుంది. ఎన్నికల ప్రక్రియకు విరుద్ధంగా నడుచుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించడమే అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో నిబంధనలకు అనుగుణంగా అన్ని పార్టీలు నడుచుకోవాలి. ఫిజికల్ రిపోర్ట్స్‌ని నింపడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. వాటికి పరిష్కారమే ఈ వెబ్‌పోర్టల్. Representation of People’s Act, 1951 ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నాం"
- కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ నిర్ణయం కీలకంగా మారింది. ఇప్పటికే RBI రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంది. ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటి ప్రింటింగ్ కూడా ఆగిపోనుంది.
Also Read: IRCTC Room Booking: కేవలం ₹100కే రైల్వే స్టేషన్లో రూమ్ - హోటల్ గదిలా ఉంటుంది