PM Modi Exclusive Interview: మత ఆధారిత రిజర్వేషన్ అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే, ఓబీసీ కోటాతో ఓటు బ్యాంక్ పాలిటిక్స్: ప్రధాని మోదీ
PM Modi About Religion Based Reservation | మత ఆధారిత రిజర్వేషన్లు కల్పించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని, కొన్ని రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు.
PM Narendra Modi Exclusive: న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు 2024 ముగుస్తాయన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ABP నెట్‌వర్క్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. కేంద్రంలో తాము హ్యాట్రిక్ కొడతామని ధీమా వ్యక్తం చేశారు. రిజర్వేషన్ అంశంతో పాటు బెంగాల్‌లో అవినీతి, ఆ రాష్ట్రంపై రెమాల్ తుఫాను ప్రభావం సహా పలు అంశాలపై మోదీ మాట్లాడారు. మత ఆధారిత రిజర్వేషన్లు కొనసాగించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే అని వ్యాఖ్యానించారు. తాము ముస్లింలను వ్యతిరేకించడం లేదని, అయితే రాజ్యాంద విరుద్ధమైన మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు వ్యతిరేకమని స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో రిజర్వేషన్ల అంశంపై వివాదం కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో ఓబీసీ రిజర్వేషన్లపై, న్యాయవ్యస్థపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఇటీవల మోదీ తీవ్రంగా ఖండించారు. 2010 నుంచి మంజూరు అయిన OBC రిజర్వేషన్ల హోదాను కలకత్తా హైకోర్టు గత వారం కొట్టివేసింది. ఆ రిజర్వేషన్లు చట్టవిరుద్ధమని పేర్కొంటూ లక్షల మంది రిజర్వేషన్ సంబంధిత పత్రాలను రద్దు చేస్తూ తీర్పు చెప్పడం తెలిసిందే. కానీ హైకోర్టు తీర్పును మమతా బెనర్జీ వ్యతిరేకించారు.
ఈ ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. ‘కోర్టు తీర్పును మమతా బెనర్జీ వ్యతిరేకించడం న్యాయవ్యవస్థను అవమానించడమే. మత ఆధారిత రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించమే. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించకూడదని పార్లమెంట్ లో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు చెందిన పేదలకు(EWS) రిజర్వేషన్‌ను కల్పించాం. అవి మత ఆధారిత రిజర్వేషన్లు కాదు. ఇప్పటికే దేశాన్ని మత ప్రాతిపదికన విభజించాం. ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రిజర్వేషన్లను అడ్డు పెట్టుకోకూడదు. బెంగాల్‌లో ఓట్ల కోసం 77 సామాజిక వర్గాలను ఓబీసీగా మార్చారు. కర్ణాటకలోనూ ఇలాగే చేశారని’ ప్రధాని మోదీ మత ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకించారు.
జిహాద్ కోసం ఓబీసీల హక్కులను టీఎంసీ కాలరాస్తోంది: ప్రధాని మోదీ
ఇటీవల బరాసత్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా.. సీఎం మమతా పేరును ప్రస్తావించకుండా హైకోర్టు న్యాయమూర్తులను ప్రశ్నించడాన్ని ప్రధాని మోదీ తప్పుపట్టారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) ఓబీసీలకు చేసిన అన్యాయాన్ని కోర్టులు బట్టబయలు చేస్తే, అక్కడ అధికార పార్టీ ఇది జీర్నించుకోలేకపోతోందని సెటైర్లు వేశారు. జిహాదీలకు మద్దతుగా నిలిచిన టీఎంసీ ఓబీసీ యువత హక్కుల్ని కాలరాసిందని ఆరోపించారు. హైకోర్టు ఓబీసీ సర్టిఫికేట్లు రద్దు చేయడాన్ని టీఎంసీ నేతలు ప్రశ్నిస్తున్నారంటే.. వారికి న్యాయవ్యవస్థపై, రాజ్యాంగంపైగానీ ఏమాత్రం గౌరవం లేదన్నారు.
న్యాయవస్థనే తప్పుపడుతూ, కోర్టుల తీర్పులను వ్యతిరేకించడాన్ని అంతా ఖండించాలన్నారు ప్రధాని మోదీ. పరిస్థితి ఇలాగే కొనసాగితే, టీఎంసీ నేతలు జడ్జీలపై తమ గూండాలతో దాడి చేయిస్తారా అని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో న్యాయమూర్తులపై టీఎంసీ ఒత్తిడి పెంచుతోందని, వారి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
Also Read: గత పదేళ్లలో ఈడీ రూ.2,200 కోట్లు సీజ్, యూపీఏ హయాంలో రూ.34 లక్షలే!: ప్రధాని మోదీ