Ayodhya Ram Mandir: అప్పటివరకూ అయోధ్య రామ మందిరానికి వెళ్లొద్దు: కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సలహా
Refrain From Visiting Ram Mandir in Ayodhya: అయోధ్య రాముడి దర్శనానికి ఇప్పట్లో వెళ్లకూడదని సహచర కేబినెట్ మంత్రులకు ప్రధాని మోదీ సూచించారని ప్రభుత్వ వర్గాల సమాచారం.
PM Modi Advises Cabinet Ministers to Refrain From Visiting Ram Mandir: న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడు కొలువుదీరడంతో 5 శతాబ్ధాల కల నెరవేరింది. జనవరి 22వ తేదీన మధ్యాహ్నం అభిజీత్ లగ్నంలో బాలరాముడి విగ్రహానికి అయోధ్య ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట చేయడం తెలిసిందే. జన్మభూమిలో రామయ్య కొలువుతీరాడని, అయోధ్య రాముడి దర్శనాలు జనవరి 23న ప్రారంభమయ్యాయి. భక్తులు భారీ సంఖ్యలో అయోధ్యకు క్యూ కడుతున్నారు. దేశంలో ఎన్నో ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేబినెట్ భేటీలో సహచర మంత్రులకు ప్రధాని మోదీ ఓ సలహా ఇచ్చారు. అయోధ్యలో రాముడి దర్శనానికి ఇప్పట్లో వెళ్లకూడదని సహచర కేబినెట్ మంత్రులకు ప్రధాని మోదీ సూచించారని ప్రభుత్వ వర్గాల సమాచారం. అందుకు గల కారణం సైతం వెల్లడైంది.
సామాన్య భక్తులు అయోధ్య రామాలయానికి భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారని.. ఈ టైమ్‌లో కేంద్ర మంత్రులు లాంటి వీఐపీలు వెళ్తే ప్రోటోకాల్స్ కారణంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తుతాయని ప్రధాని మోదీ సూచించారని తెలుస్తోంది. సాధ్యమైనంత వరకు ఫిబ్రవరి నెల పూర్తయ్యే వరకు అయోధ్య పర్యటనను వాయిదా వేసుకోవాలని.. మార్చి నెల నుంచి రామయ్య దర్శనానికి వెళ్తే బాగుంటుందని, ఆ సమయానికి దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యలో రాముడి దివ్వ స్వరూపాన్ని దర్శించుకుంటారని సహచర కేబినెట్ మంత్రులకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. సామాన్య భక్తులకు దర్శనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ప్రధాని మోదీ భావించారని తెలుస్తోంది. ప్రధాని నిర్ణయంపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
In today's Cabinet meeting, PM Narendra Modi advised all his cabinet colleagues to refrain from visiting the Ayodhya Ram Temple for now. The PM suggested that, due to the heavy rush and to prevent inconvenience to the public caused by VIPs with protocols, Union Ministers should… pic.twitter.com/Qns5FSVCaK
— ANI (@ANI) January 24, 2024
రామ్‌లల్లా విగ్రహానికి ‘బాలక్ రామ్’గా నామకరణం
అయోధ్యలో నిర్మితమైన రామమందిరంలో ప్రతిష్ఠించిన రామ్‌లల్లా విగ్రహానికి ‘బాలక్ రామ్’గా(Balak Ram) నామకరణం చేశారు. ఈ విగ్రహంలో రాముడు ఐదేళ్ల బాలుడిని పోలి ఉండటమే కారణమని ఆలయ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఇప్పటివరకూ దాదాపు 50-60 విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠలు నిర్వహించానని, వాటన్నింటిలోకీ ఇదే తనకు అత్యంత ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. రామాయణం, రామచరిత్ మానస్ లాంటి గ్రంథాలను విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాతే బాల రాముడి విగ్రహానికి ఆభరణాలను సిద్ధం చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ (RamaJanma Bhoomi Theertha trust) పేర్కొంది.
అయోధ్య ఆలయ సముదాయం వెలుపల, భారీ ప్రదేశంలో మరో ఏడు దేవాలయాలు నిర్మిస్తున్నట్టు రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ కోశాధికారి స్వామి గురుదేవ్ గిరీజీ తెలిపారు. వీటిని రాముడి జీవితంలో పాలు పంచుకున్న వారికి అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. "ఇవి సాధువులైన వాల్మీకి(Valmiki), వశిష్టుడు, విశ్వామిత్రుడు(Viswamitra), శబరి, రాముడి కోసం తన ప్రాణాలను అర్పించిన పక్షి జటాయువు కోసం నిర్మిస్తున్నాం`` అని చెప్పారు.