అన్వేషించండి

PM Modi: 'దేశ ప్రజల ప్రేమ నాలో ఉత్సాహాన్ని నింపుతోంది' - నా దేశాన్ని ముక్కలు కానివ్వనన్న ప్రధాని మోదీ

Pm Modi Interview: ప్రజా జీవితానికే అంకితమైన తనలో ప్రజలు అందిస్తోన్న ప్రేమ మరింత ఉత్సాహం నింపుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఏబీపీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ABP Interview With PM Modi: దేశ ప్రజలు అందించిన స్పూర్తి, ప్రేమ తనలో మరింత ఉత్సాహాన్ని నింపుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏబీపీకి ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు.

1. పదేళ్లుగా ప్రధానమంత్రిగా అధికారం నిర్వర్తించినా కూడా ఇంకా మీ పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీనికి కారణం ఏమనుకుంటున్నారు.?

పీఎం మోదీ: ప్రజలు, ఆ పరంధాముడి ఆశీర్వాదం. పాలు ఏవి..నీళ్లు ఏవి అనేది ఆ దేవుడికి తెలుసు మన ప్రజలకు తెలుసు. చెడు ఏంటీ మంచి ఏంటీ అనే విచక్షణా జ్ఞానం ప్రజలకు బాగా ఉంటుంది. మనం ఏం పనులు చేస్తున్నామో వాళ్లు గమనిస్తారు దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. రెండో విషయం నాకు ప్రజలు తప్ప ఎవ్వరూ లేరు. ప్రజా జీవితానికి అంకితమైపోయిన నాలో ప్రజలంతా అందిస్తున్న ఈ ప్రేమ మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. 

2. మోదీజీ..ఇప్పటికి నాలుగో దశ వరకూ ఎన్నికలు పూర్తైపోయాయి. మీరు దేశంలో ఎక్కడికి వెళ్లినా రోజుకు ఆరుసభల్లో పాల్గొంటున్నారు. సభలు పూర్తయ్యాక రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మీరు మూడోసారి ఎంపీ అభ్యర్థిగా వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు. మీకు ఏమని అనిపిస్తోంది.? 2024 ఎన్నికలు సరికొత్త చరిత్రను సృష్టించనున్నాయా.? మీరు కూడా మూడోసారి ప్రధాని కాబోతున్నారు కదా.?

పీఎం మోదీ: నేను ఏబీపీని నమ్ముతాను. మీరు రోజూ వార్తలను విశ్లేషిస్తున్నారు. మీకు సోర్సులుంటాయి. మీకు సమాచారం ఉంటుంది. మీ విశ్లేషణ  ఎలాగైతే ఉంటుందో దేశ ప్రజలకు అలాంటి విశ్లేషణే ఉంటుంది. ఈ పదేళ్ల కాలంలో ప్రపంచం ముందు మన దేశం ఔన్నత్యాన్ని చాటి చెప్పాం. పదేళ్ల విలువైన కాలం ఇది. 2014లో అంటే మేం అధికారంలోకి రాకముందు ఈ దేశం మొత్తం నిరాశ నిస్పృహల్లో మునిగిపోయి ఉంది. కానీ ఇప్పుడు చూడండి ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. మనం ఇక్కడితో ఆగిపోయేవాళ్లం కాదు. ప్రపంచంలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడే వరకూ మన ప్రయాణం ఆగదని ప్రతీ పౌరుడు భావిస్తున్నాడు. 2047 నాటికి వికసిత భారత్ మన లక్ష్యం. ఎవరైనా ఎప్పుడైనా ఊహించారా.? ఓ ఏడో ఎనిమిదో తరగతి చదువుకునే పిల్లాడికి జీ20 సదస్సులు అంటే ఏంటో తెలుస్తుంది తెలుసుకుంటాడని. ఆ విధంగా మన దేశ నాగరికతను ముందుకు తీసుకెళ్తున్నాం. 

3. మోదీజీ మీరు అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ఆధ్యాత్మిక, ధార్మిక పునరుత్థానం జరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ కారిడార్ నిర్మాణం ఇలాంటివి చేశారు. అందుకేనా మిమ్మల్ని విపక్షాలు నేరుగా ఈ ఒక్క అంశంపైనే మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నాయి.?

పీఎం మోదీ: నేను ఓ రాజకీయ నాయకుడిని. ఓ రాజకీయ నాయకుడు ఆధ్యాత్మిక పునరుత్థానం చేయగలగడని నేను ఎప్పుడూ అనుకోను. ఇదంతా వేల సంవత్సరాలుగా మన బుుషులు, మునులు మనకు అందించిన సంపద. అదే ధర్మం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. మధ్యలో కొన్ని వికృత పరిణామాలు మన దేశంలో చోటు చేసుకున్నాయి. వాళ్లొచ్చి మన ఆధ్యాత్మిక శక్తి మీద సంస్కృతి సంప్రదాయాల మీద ఓ ముసుగు పరదా కప్పారు. నేను వచ్చాక జస్ట్ ఆ పరదా తీసేశాను అంతే. ప్రజలు దాన్ని గమనించారు అంతే. రెండోది మనది 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశం. ప్రతీ మనిషికి ఓ కోరిక ఉంటుంది. వాళ్ల అమ్మను గంగానదిలో స్నానం కోసం తీసుకువెళ్లాలని.. ఒక్కసారైనా చార్ ధామ్ యాత్ర చేయించాలని ఉంటుంది. ఒకవేళ నాకు ఈ ఆధ్యాత్మిక మార్గంపై అవగాహన లేకపోతే లేదా నేనేదైనా వ్యాపారాత్మక ధోరణిలో ఆలోచనలు చేస్తుంటే.. ఎలా ఉంటుందో ఆలోచించండి. 140 కోట్ల మంది ప్రజలు రేపు ఎక్కడికైనా వెళ్తుంటే అక్కడ వాళ్లకు పరిశుభ్రమైన టాయిలెట్లు అందుబాటులో ఉండాలా వద్దా. ఇంటర్నెట్ సౌకర్యం కావాలా వద్దా రోడ్లు, ట్రాన్స్ పోర్ట్ ఇవన్నీ ఉండాలి కదా. ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇవే. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతే చేయాల్సింది కానీ వాళ్లు చేయలేదు. అప్పుడు 25 కోట్ల జనాభానే ఉండేవాళ్లు. వాళ్లు ఇప్పటిలా కాశీని అభివృద్ధి చేసి ఉంటే దాని మీద ఆధారపడిన ఎకానమీ పెరిగేది. వాళ్ల జీవితాలు మారిపోయేవి కానీ చేయలేదు. ఈ రోజు చూడండి అయోధ్య ఎకానమీ ఎలా పెరిగిందో. బద్రీనాథ్, కేదార్ నాథ్, ఉత్తరాఖండ్ వాళ్ల జీవితాలన్నీ ఆధ్యాత్మికతతోనే ముడిపడిపోయి ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఎకానమీ మీద మనసు పెట్టాను. మీరు ఈ విషయాన్ని ఆ దృష్టి నుంచే చూడాలి. 

4. కానీ మీ మీద ప్రతిపక్షాలు మాట్లాడున్నది వేరే కదా.? మీరు మూడోసారి అధికారంలోకి వస్తే పార్లమెంటు ఉండదని.. రాజ్యాంగం మిగలదని. .రిజర్వేషన్లు రద్దు చేస్తారని ప్రచారాలు చేస్తున్నారు కదా.. వాటి మీద ఏం మాట్లాడతారు.?

పీఎం మోదీ: నేను 23 ఏళ్లుగా ప్రభుత్వ అధినేతగా ఉన్నాను. ఈ అబద్ధాలు ప్రచారం చేసే బ్యాచ్ అంతా నేను తీసుకున్న ఏ నిర్ణయంపైనైనా సరే ఒక క్లారిటీకి రాలేకపోయారు. నేను తప్పు చేస్తున్నానని కోర్టుల నుంచి వచ్చిన ఆదేశాలు కూడా లేవు. హిందూ ముస్లిం అనే పేర్లను ఓట్ల కోసం వాళ్లు ఎలా వాడుకుంటారో నేను బయటపెట్టాను. వాళ్ల ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ను బహిరంగంగా కడిగిపారేశాను. నేను ఈ దేశాన్ని ముక్కలు కానివ్వను. దేశమంతా ఒక్కటిగానే ఉంటుంది. అలాగే ముందుకు తీసుకెళ్తాను.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy : తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
Kakani Govardhan Reddy:  కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
Police On Jagan: జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం - ఏపీ పోలీసు అధికారుల సంఘం హెచ్చరిక
జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం - ఏపీ పోలీసు అధికారుల సంఘం హెచ్చరిక
Viral Video: ఓటు వేస్తే ఒంటరి మహిళల్ని తల్లుల్ని చేస్తాడట - ఓ లీడర్ హామీ - మహిళా లోకం ఊరుకుంటుందా?
ఓటు వేస్తే ఒంటరి మహిళల్ని తల్లుల్ని చేస్తాడట - ఓ లీడర్ హామీ - మహిళా లోకం ఊరుకుంటుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR Batting Strategy IPL 2025 | లక్నో మీద గెలవాల్సిన మ్యాచ్ ను కేకేఆర్ చేజార్చుకుంది | ABP DesamNicholas Pooran 87 vs KKR | లక్నోకు వరంలా మారుతున్న పూరన్ బ్యాటింగ్Priyansh Arya Biography IPL 2025 | PBKS vs CSK మ్యాచ్ లో సెంచరీ బాదిన ప్రియాంశ్ ఆర్య ఎంత తోపంటేDevon Conway Retired Out Controversy | కాన్వే రిటైర్డ్ అవుట్ అవ్వటం సీఎస్కే కొంప ముంచిందా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
Kakani Govardhan Reddy:  కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
Police On Jagan: జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం - ఏపీ పోలీసు అధికారుల సంఘం హెచ్చరిక
జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం - ఏపీ పోలీసు అధికారుల సంఘం హెచ్చరిక
Viral Video: ఓటు వేస్తే ఒంటరి మహిళల్ని తల్లుల్ని చేస్తాడట - ఓ లీడర్ హామీ - మహిళా లోకం ఊరుకుంటుందా?
ఓటు వేస్తే ఒంటరి మహిళల్ని తల్లుల్ని చేస్తాడట - ఓ లీడర్ హామీ - మహిళా లోకం ఊరుకుంటుందా?
Amaravati Hyderabad Greenfield Expressway: అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం
అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం
Kannappa New Release Date: 'కన్నప్ప' కొత్త రిలీజ్ డేట్ వచ్చింది... జూన్ నెలాఖరున థియేటర్లలోకి విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్
'కన్నప్ప' కొత్త రిలీజ్ డేట్ వచ్చింది... జూన్ నెలాఖరున థియేటర్లలోకి విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్
IPL 2025 Playoffs: హైదరాబాద్‌, చెన్నై, ముంబై జట్లు ప్లేఆఫ్స్ చేరడం కష్టమేనా? పాయింట్ల పట్టికలో ఎవరు ఏ స్థానంలో ఉన్నారు?
హైదరాబాద్‌, చెన్నై, ముంబై జట్లు ప్లేఆఫ్స్ చేరడం కష్టమేనా? పాయింట్ల పట్టికలో ఎవరు ఏ స్థానంలో ఉన్నారు?
Google: పని చెప్పకుండానే ఉద్యోగులకు జీతం ఇస్తున్న Google! కారణం తెలిస్తే షాక్ అవుతారు!
పని చెప్పకుండానే ఉద్యోగులకు జీతం ఇస్తున్న Google! కారణం తెలిస్తే షాక్ అవుతారు!
Embed widget