News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

PM Modi News: ఇండియాలో ఏం జరుగుతోంది? విదేశాల నుంచి వస్తూనే జేపీ నడ్డాను ప్రశ్నించిన ప్రధాని

PM Modi News: ప్రధాని నరేంద్ర మోదీ ఆరు రోజుల అమెరికా, ఈజిప్టు పర్యటన అనంతరం దేశానికి చేరుకున్నారు. ఈక్రమంలోనే బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను దేశంలో ఏం జరుగుతోందంటూ ప్రశ్నించారు. 

FOLLOW US: 
Share:

PM Modi News: ఆరు రోజుల అమెరికా, ఈజిప్టు పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తెల్లవారుజామున భారత్‌కు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాకాశీ లేఖి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వాగతం పలికారు. ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు, పార్టీ ఎంపీలు హర్ష వర్ధన్, హన్స్ రాజ్ హన్స్, గౌతమ్ గంభీర్ కూడా ప్రధానికి స్వాగతం పలికేందుకు వచ్చారు. ప్రధాని మోదీ వచ్చీ రాగానే.. దేశంలో ఏం జరుగుతోందంటూ జేపీ నడ్డాను ప్రశ్నించినట్లు అక్కడకు వెళ్లిన పార్టీ నాయకులు తెలిపారు. 

"దేశంలో ఏం జరుగుతోందని ప్రధాని మోదీ జేపీ నడ్డాను అడిగారు. దీనిపై స్పందించిన నడ్డా.. తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో సాధించిన అభివృద్ధి గురించి వివరిస్తూ నేతలంతా ప్రజలకు దగ్గర అవుతున్నారని చెప్పారు. అలాగే ప్రధాని మోదీ పాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని జేపీ నడ్డా వివరించారు." - బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ

మరో బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ మాట్లాడుతూ.. పార్టీ ప్రజావాణి కార్యక్రమం ఎలా కొనసాగుతోందని ప్రధాని మోదీ అడిగారని.. అందుకు తాము సమాధానాలు కూడా చెప్పామని వివరించారు.

ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 20వ తేదీన అమెరికా పర్యటనకు బయలుదేరి.. న్యూయార్క్‌లో జూన్ 21వ తేదీన 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూఎన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. వైట్ హౌస్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ ఇద్దరు దేశాధినేతలు గురువారం రోజు చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు.. గౌరవార్థం జో బిడెన్ వైట్ హౌస్‌లో డిన్నర్‌ను ఏర్పాటు చేశారు. ఈక్రమంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి డిన్నర్ చేశారు. అమెరికా ఫస్ట్ లేడీ జిల్‌ బైడెన్‌ కూడా మోదీకి ఆతిథ్యం ఇచ్చారు. దాదాపు 400 మంది అతిథులు ఈ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బైడెన్, మోదీ చాలా జోవియల్‌గా కనిపించారు. మోదీపై బైడెన్ ఓ జోక్ వేశారు. అది విని ప్రధాని మోదీ పగలబడి నవ్వారు. ఆల్కహాల్ తీసుకోకుండానే మోదీ డిన్నర్ ముగించేశారంటూ బైడెన్ అన్న మాటకు మోదీ గట్టిగా నవ్వారు. అంతే కాదు. తమ ఇద్దరికీ ఈ అలవాటు లేదని చెప్పారు. వీరిద్దరి భేటీలో రక్షణ, అంతరిక్షం, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో సహకారం కోసం ఒప్పందాలు చేసుకున్నారు.  

అమెరికా పర్యటన ముగించుకుని శనివారం కైరో చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో ఈజిప్టు ప్రధాని మోస్తఫా మడ్‌ బౌలీ స్వాగతం పలికారు. మొదటి సారి ఈజిప్టు వెళ్లిన ప్రధాని.. ఆదివారం సాయంత్రం తన పర్యటనను ముగించుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసితో చర్చలు జరిపారు. అరబ్ దేశం అత్యున్నత గౌరవం 'ఆర్డర్ ఆఫ్ ది నైల్'ను ప్రధాని మోదీ అందుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సంబంధాలు, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టి సారించి ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపారు. రెండు దేశాలు తమ సంబంధాన్ని "వ్యూహాత్మక భాగస్వామ్యం"గా పెంచుకున్నాయి. ప్రెసిడెంట్ ఎల్-సిసి మోడీకి ఈజిప్ట్ అత్యున్నత రాష్ట్ర గౌరవమైన 'ఆర్డర్ ఆఫ్ ది నైల్' అవార్డును ప్రదానం చేశారు. ప్రధాని మోదీకి లభించిన 13వ అత్యున్నత రాష్ట్ర గౌరవం ఇది. 

Published at : 26 Jun 2023 09:44 AM (IST) Tags: PM Modi Modi US Visit BJP Chief JP Nadda Modi Egypt Visit PM Modi Return to India

ఇవి కూడా చూడండి

ABP Cvoter Exit Poll: ఏయే రాష్ట్రంలో ఎవరిది పైచేయి? ABP CVoter ఎగ్జిట్ పోల్ కచ్చితమైన అంచనాలు

ABP Cvoter Exit Poll: ఏయే రాష్ట్రంలో ఎవరిది పైచేయి? ABP CVoter ఎగ్జిట్ పోల్ కచ్చితమైన అంచనాలు

RRC: నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

RRC: నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

Madhya Pradesh Exit Poll 2023 Highlights: మధ్యప్రదేశ్ ఈసారి కాంగ్రెస్‌దే! ABP CVoter ఎగ్జిట్‌ పోల్ అంచనాలు ఇవే

Madhya Pradesh Exit Poll 2023 Highlights: మధ్యప్రదేశ్ ఈసారి కాంగ్రెస్‌దే! ABP CVoter ఎగ్జిట్‌ పోల్ అంచనాలు ఇవే

Chattisgarh Exit Poll 2023 Highlights: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ గెలవడం కష్టమేనా? ఆసక్తికరంగా ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు

Chattisgarh Exit Poll 2023 Highlights: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ గెలవడం కష్టమేనా? ఆసక్తికరంగా ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు

Mizoram Exit Poll 2023 Highlights: మిజోరంలో మళ్లీ MNFదే అధికారం! అంచనా వేసిన ABP CVoter ఎగ్జిట్ పోల్

Mizoram Exit Poll 2023 Highlights: మిజోరంలో మళ్లీ MNFదే అధికారం! అంచనా వేసిన ABP CVoter ఎగ్జిట్ పోల్

టాప్ స్టోరీస్

Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్

Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్

Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్

Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం

Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !

Telangana Exit Poll 2023 Highlights :   ఏబీపీ  సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ -  తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !