Parliament Session: డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ సమావేశాలు, జమ్మూ కశ్మీర్‌పై కేంద్రం మరో కీలక బిల్లు
Pralhad Joshi: పార్లమెంటు శీతాకాల సమావేశాల నిర్వహణపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ సమావేశాల్లో ఈ సారి ఏకంగా 18 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Parliament Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాల నిర్వహణపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ సమావేశాల్లో (Parliament Winter Session) ఈ సారి ఏకంగా 18 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం (Central Government) నిర్ణయించింది. ఇందులో 2 జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir), పుదుచ్చేరి (Puducherry) లలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, 3 నేర శిక్షాస్మృతి బిల్లులు ఉన్నాయి. సమావేశాలు డిసెంబరు 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 22వ తేదీన ముగుస్తాయి. మొత్తం 19 రోజుల పాటు సమావేశాలు జరుగునున్నాయి. అందులో 15 రోజులు ఉభయసభలు కార్యకలాపాలు నిర్వహిస్తాయి.
లోక్‌సభ సెక్రటేరియట్ బులెటిన్ మేరకు.. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో సీట్ల సంఖ్యను 107 నుంచి 114కు పెంచే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. దీనివల్ల కశ్మీర్ నుంచి వలస వెళ్లినవారికి, శరణార్థులకు, ఎస్టీలకు ప్రాతినిధ్యం లభించనుంది. దీనిపోత పాటుగా 2023-24కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లపై సమావేశాల్లో చర్చ, ఓటింగ్ జరగనుంది. ఐపీసీ, సీపీసీ చట్టాల స్థానంలో ద భారతీయ న్యాయ సంహిత, ద భారతీయ నాగరిక సురక్ష సంహిత, ద భారతీయ సాక్ష్య బిల్లులను కేంద్రం తీసుకురానుంది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన ‘క్యాష్ ఫర్ క్వైరీ’ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ నివేదికను ఈ శీతాకాల సమావేశాల్లో లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. కమిటీ సిఫార్సు చేసిన బహిష్కరణ అమల్లోకి రాకముందే సభ ఈ నివేదికను ఆమోదించాల్సి ఉంటుంది. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లు కూడా పెండింగ్ లో ఉంది.
ఈ బిల్లు ఆమోదం పొందితే కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ లకు క్యాబినెట్ హోదా రానుంది. ప్రస్తుతం వారు ప్రస్తుతం వారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాను అనుభవిస్తున్నారు. వాస్తవానికి ఈ బిల్లును గత ప్రత్యేక సమావేశాల్లోనే ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావించింది. కానీ ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో ఆమోదం కోసం ఒత్తిడి తీసుకురాలేదు.
డిసెంబర్ 4వ సమావేశాలు ప్రారంభమవుతుండగా.. దానికి ఒక రోజు ముందే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. కానీ ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కారణంగా అఖిలపక్ష సమావేశం ఒక రోజు ముందుకు జరిపింది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 2న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.