Parliament of India: నేడే నూతన భవనానికి పార్లమెంట్ తరలింపు, రాజ్యాంగ ప్రతితో ఎంపీల నడక ప్రయాణం
Parliament of India: నేడు నూతన భవనానికి పార్లమెంట్ ను తరలిస్తున్నారు. రాజ్యాంగ ప్రతితో ప్రధాని నరేంద్ర మోదీ భవనంలోకి వెళ్తుండగా.. ఎంపీలంతా ఆయనను అనకరించబోతున్నారు.
![Parliament of India: నేడే నూతన భవనానికి పార్లమెంట్ తరలింపు, రాజ్యాంగ ప్రతితో ఎంపీల నడక ప్రయాణం Parliament of India Historic Move From Old to New Parliament Ad Interesting Facts Parliament of India: నేడే నూతన భవనానికి పార్లమెంట్ తరలింపు, రాజ్యాంగ ప్రతితో ఎంపీల నడక ప్రయాణం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/ccc4206570a2149ea38731da0f4db02e1695100222109519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Parliament of India: నూతన పార్లమెంట్ భవనం తరలింపు ఈరోజే సాగనుంది. కొత్త భవన నిర్మామం దేశానికి చిహ్నంగా కనిపించనుంది. పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్ లో ఫోటో సెషన్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగ ప్రతిని తీసుకొని కాలినడకన నూతన భవనానికి వస్తారని అధికారక వర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రధాని వెంటే ఎంపీలంతా ఉంటారని సమాచారం. అక్కడికి వెళ్లిన తర్వాత కొత్త పార్లమెంట్‌లోని వారి వారి ఛాంబర్‌లలో సమావేశం అవుతారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సీనియర్ పార్లమెంటేరియన్‌లుగా ప్రసంగించేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, జేఎంఎం నేత శిబు సోరెన్, బీజేపీ ఎంపీ మేనకా గాంధీకీ ఆహ్వానం పంపారు.
పాత పార్లమెంట్ భవనానికి 96 ఏళ్లు. 1927లో ఈ భవనాన్ని నిర్మించారు. అయితే జవహర్ లాల్ నెహ్రూ "అర్ధరాత్రి" ప్రసంగం చేసి రాజ్యాంగాన్ని ఆమోదించారు. అయితే ఈ భవనం ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. ఈక్రమంలోనే ఎంపీల కోసం సాంకేతిక సౌకర్యాలు అందించడంతో పాటు కార్యాలయాలు నిర్మించారు. బ్రిటీష్ వాస్తుశిల్పులు సర్ ఎడ్విన్ లుటియన్స్ మరియు హెర్బర్ట్ బేకర్ రూపొందించిన ఈ భవనాన్ని.. దేశానికి సంబంధించిన పురావస్తు సంపదగా పరిరక్షించబడుతుంది అని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల మొదటి రోజు ప్రసంగంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భవిష్యత్తుపై ఆశతో తాము ఈ భవనం నుంచి నూతన భవనానికి వెళ్తున్నట్లు తెలిపారు. అలాగే పాత పార్లమెంట్ భవనంలో పని చేసిన 7,500 మంది ఎంపీలను స్మరించుకుంటున్నట్లు వివరించారు. వారందరికీ తాను వందనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆర్టికల్ 370 రద్దు, ఒకే దేశం ఒకే పన్ను, జీఎస్టీతో సహా గత తొమ్మిదేళ్లుగా చేరుకున్న మైలురాళ్లను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.
మేలో ఢిల్లీ నడిబొడ్డున కర్తవ్య మార్గంలో కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ భవనంలో లోక్‌సభ ఛాంబర్‌లో 888 మంది, రాజ్యసభలో 300 మంది సభ్యులు కూర్చునే అవకాశం ఉంది. ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి 1,280 మంది ఎంపీలకు లోక్‌సభ ఛాంబర్‌లో వసతి కల్పించవచ్చు. ప్రతి పార్లమెంటు సభ్యునికి పునరాభివృద్ధి చేయబడిన శ్రమ శక్తి భవన్‌లో 40 చదరపు మీటర్ల కార్యాలయ స్థలం ఉంటుంది. ఇది 2024 నాటికి పూర్తి అవుతుంది. జాతీయ ఆర్కైవ్‌లు కూడా పాత భవనం నుంచి కొత్త భవనంలోకి మారుతాయి. నాలుగు అంతస్తులతో.. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవన నిర్మాణం ఉంది. దీనికి మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. అందులో ఒకటి జ్ఞాన్ ద్వార్, రెండోది కర్మ ద్వార్, మూడోది వీఐపీలు, ఎంపీలు, సందర్శకుల కోసం ప్రత్యేక ప్రవేశాన్ని ఏర్పాటు చేశారు. ఒక మిశ్రమ జంతువు ప్రతి తలుపును కాపాడుతుంది.
పార్లమెంట్ ఇంటీరియర్ మూడు జాతీయ చిహ్నాలను సూచిస్తుంది: కమలం, స్వచ్ఛత, జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. నెమలి భారతదేశ జాతీయ పక్షిని, మర్రి చెట్టు, దీర్ఘాయువు, అమరత్వానికి చిహ్నంగా నిలుస్తాయి. రాజ్యసభ ఛాంబర్ నిర్మాణం జాతీయ పుష్పం కమలం నుంచి ప్రేరణ పొందింది. లోక్‌సభ ఛాంబర్ ఆకర్షణీయమైన నెమలి థీమ్‌ను ప్రదర్శిస్తుంది. వాస్తుశిల్పం, జాతీయ ప్రతీకవాదం కలిసిన ఈ భవనం భారతదేశం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. గంభీరమైన మర్రి చెట్టు డిజైన్‌తో అలంకరించబడిన బహిరంగ ప్రాంగణం భవనం శోభను పెంచుతుంది. పెద్ద కమిటీ గదులు అత్యాధునిక ఆడియో-విజువల్ సిస్టమ్‌లతో అమర్చబడి ఉంటాయి. అయితే సమావేశ గదులలో గ్రాఫికల్ ఇంటర్‌ఫేస్‌లు, బయోమెట్రిక్‌లు, స్మార్ట్ డిస్‌ప్లేలు ఉంటాయి. ఇవి ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేస్తాయి. ఈ భవనంలో మంత్రి మండలి కోసం 92 గదులు, ఆరు కమిటీ గదులు, ఒక ప్రాంగణం నిర్మించారు. ఇవి పార్లమెంటు సభ్యుల మధ్య పరస్పర చర్యలను సులభతరం చేస్తాయి. ముఖ్యంగా ఇది భారతదేశ వారసత్వానికి ప్రతిబింబించేలా 'రాజ్యాంగ సభ'ను కలిగి ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)