9సెకన్లలో 40 అంతస్తుల టవర్స్ కూల్చివేత - ఆ టెక్నాలజీ ఏంటో తెలుసా?
మరో 3 రోజుల్లో నోయిడాలోని ట్విన్ టవర్స్ నేలమట్టమవనున్నాయి. ఇంప్లోషన్, గ్రావిటీ పద్ధతి ద్వారా వాటిని కూల్చివేయనున్నారు. పెద్ద పెద్ద భవనాలు కూల్చడానికి ఇంకా అనేక విధానాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలోని ట్విన్ టవర్స్ ను ఆగస్టు 28న కూల్చివేయనున్నారు. 40 అంతస్థులు ఉన్న ఈ భారీ సముదాయాన్ని 9 సెకన్లలో నేలమట్టం చేయనున్నారు. దీని కోసం 3,500 కిలోలకుపైగా పేలుడు పదార్థాలను వినియోగించనున్నారు. ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ ఈ ప్రక్రియను చేపడుతోంది. ఉన్నచోటునే భవంతులు కూలిపోయేలా ప్రణాళికలు రచించారు.
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత
దేశంలో ఎన్నడూ చూడని విధంగా.. ఈ నెల 28న ఈ ఎత్తైన భవనాన్ని కూల్చివేయనున్నారు. ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 100 మీటర్ల ఎత్తున్న నోయిడా ట్విన్ టవర్లు సెకన్ల వ్యవధిలోనే కూలిపోనున్నాయి. ఇందుకోసం 3,500 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించనున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన జెట్ సంస్థ సహకారంతో ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి ఇంప్లోషన్, గ్రావిటీ విధానాన్ని ఉపయోగిస్తుంది. నిర్మాణాలను కూల్చివేయడానికి నిపుణులు ఉపయోగించే అనేక పద్ధతుల్లో ఇది ఒకటి. పక్కనే ఉన్న భవనాలకు కట్టడాలకు ప్రమాదం వాటిళ్లకుండా ఎత్తైనా నిర్మాణలు ఉన్నచోటే కూల్చేయడానికి ఈ విధానాన్ని అనుసరిస్తారు.
భవనాలను, ఎత్తైన నిర్మాణాలను కూల్చివేయడానికి అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
1 పూర్తిగా కూల్చివేయడం
ఈ పద్ధతిలో నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేస్తారు. దీన్ని ఎక్కువగా ఒక భవనం పునర్నిర్మాణానికి వర్తింపజేస్తారు. ఈ రకం కూల్చివేత చేయడానికి విభిన్న మార్గాలు ఉన్నాయి,
ఇంప్లోషన్
ఇది ఒక రకమైన కూల్చివేత ప్రక్రియ. ఇందులో అంతస్థులు ఒకదానిమీద ఒకటి కూలిపోయేలా పేలుడు పదార్థాలు అమరుస్తారు. దీని ద్వారా ముందుగా నిర్ణయించిన ప్లాన్ ప్రకారమే భవనం కూలిపోతుంది.
కెమికల్
ఈ పద్ధతిలో కాంక్రీట్ కూల్చివేత పౌడర్, కాంక్రీట్ బ్రేకింగ్ కెమికల్, కాంక్రీట్ క్రాకింగ్ కెమికల్ ఉపయోగించడం ద్వారా నిర్మాణం కూలిపోయేలా చేస్తారు. ఇది చాలా శక్తివంతమైనది. తక్కువ శ్రమ, సమయంతో భారీ భవనాలను కూల్చివేయవచ్చు. కాంక్రీట్ బ్రేకింగ్ పౌడర్ నాన్ ఎక్స్ ప్లోజివ్, శబ్ధం రాకుండా ఉంటుంది.
కంట్రోల్డ్
ఈ పద్ధతిలో భవనాలు, నిర్మాణాలను సురక్షితమైన రీతిలో పేల్చివేస్తారు. నేలమట్టం అయిన తర్వాత శిథిలాలను తొలగించుకోవాలి. ఎత్తైన భవనాలు, వంతెనలు, చిమ్నీ స్టాకులు, కూలింగ్ టవర్లు కూల్చివేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది.
మెకానికల్
ఈ విధానంలో కాంక్రీట్, స్టీల్ ని పగలగొట్టే సామర్ధ్యం కలిగిన ప్రత్యేక హైడ్రాలిక్ ఎక్స్ కవేటర్లను ఉపయోగిస్తారు. వీటికి ప్రత్యేక మెకానికల్ యంత్రాలు, టూల్స్ ఉంటాయి. కూల్చివేత తర్వాత శిథిలాలు తొలగించడానికి క్రేన్లను వాడతారు.
2- సెలెక్టివ్ కూల్చివేత
ఈ రకం కింద ఒక నిర్మాణం నిర్ధిష్ట భాగాలు విచ్ఛిన్నం అవుతాయి. ఇది సమీప నిర్మాణాలు, ప్రాంతాలు, భవనాలకు సంబంధించిన మిగిలిన నిర్మాణాలను సంరక్షిస్తూనే.. నిర్ధిష్టమైన భవనాన్ని కూల్చివేస్తుంది.
3- అంతర్గత కూల్చివేత
దీని ద్వారా భవనంలోని అంతర్గత నిర్మాణాలను కూల్చివేస్తారు. గోడలు, సీలింగులు, పైపులు మొదలైన వాటిని తొలగిస్తారు.
4- స్ట్రిప్-అవుట్ కూల్చివేత
ఈ పద్ధతిలో భవనం భాగాలను జాగ్రత్తగా తొలగిస్తారు. దీని ద్వారా తొలగించిన విడిభాగాలను మళ్లీ ఉపయోగించుకోవచ్చు