అన్వేషించండి

PM Modi: కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వం అక్కర్లేదు, పాక్ నుంచి తూటాలు వస్తే మిస్సైల్స్‌తో అటాక్: ప్రధాని మోదీ

Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశం తన సైనిక, రాజకీయ, మానసిక లక్ష్యాలను సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం సైనిక, రాజకీయ, మానసిక లక్ష్యాలను విజయవంతంగా సాధించిందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా జరిగిన ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌తో శత్రుత్వం విషయంలో వ్యూహాత్మక మార్పును సూచిస్తుందని అధికారులు ఏఎన్ఐకి తెలిపారు. కాశ్మీర్ అంశంపై మాకు ఎవరూ మధ్యవర్తి అవసరం లేదని, అది భారత్‌లో భాగమేనని ప్రధాని మోదీ కుండబద్ధలుకొట్టారు.

పాకిస్తాన్, పీఓకేలోని బహావల్‌పూర్, మురిద్కే, ముజఫరాబాద్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులతో భారత సైనిక లక్ష్యం నెరవేరింది. “మేం వారిని మట్టిలో కలిపేశాం. బహావల్‌పూర్, మురిద్కే, ముజఫరాబాద్ ఉగ్రస్థావరాలు నేలమట్టం చేసి, మట్టిలో కలిపేశామని’ ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్లు సమాచారం.

బలమైన దౌత్య చర్యలో భాగంగా 1960 సింధు జలాల ఒప్పందాన్ని సరిహద్దులు దాటిన ఉగ్రవాదం అనే అంశంతో లింక్ పెట్టారు. సరిహద్దు దాటి వచ్చే ఉగ్రదాడులు చేస్తుంటే చూస్తూ కూర్చోకుండా.. ఉగ్రవాద దాడులు ఆగే వరకు ఒప్పందాన్ని సస్పెండ్ చేయాలని భారతదేశం నిర్ణయించింది. పాకిస్తాన్‌కు స్పష్టమైన మానసిక సందేశం (Psychological Message) ఇచ్చినట్లు పేర్కొంది. “మేం పాక్ భూభాగంలోకి ప్రవేశించి మరీ, వారిని ఢీకొట్టాం. వారి గడ్డమీద దాడి చేసి సక్సెస్ అయ్యాం” అని ప్రధానమంత్రి మోదీ అన్నారని సమచారం..

ఆపరేషన్ సింధూర్ ముగియలేదు..

పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై దాడుల అనంతరం తలెత్తిన, ప్రస్తుత పరిణామాలపై.. “భారతదేశం స్పష్టమైన సందేశం ఇచ్చింది. అక్కడ ఎవరూ సురక్షితంగా లేరు. ఇది గతం కంటే కొత భిన్నమైన పరిస్థితి. టెక్నికల్, మిలిటరీ మధ్య కొంచెం గ్యాప్ కనిపించింది. ఈ విషయంలో భారతదేశానికి, పాకిస్తాన్ మధ్య భారీ వ్యత్యాసం ఉంది. మనతో పోల్చితే వారు అసలు రేసులో లేరని చెప్పవచ్చు. మన సార్వభౌమాధికారిన్ని ప్రశ్నించేలా ప్రవర్తించడం, ఉగ్రదాడి చేయడంతో భారతదేశం తమకు నచ్చిన తీరుగా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ దాడులలో ఎక్కువ శాతం డ్రోన్స్, మిస్సైల్స్, ఫైటర్ జెట్లు విఫలమయ్యాయి అని ప్రధాని మోదీ అన్నారని తెలిపింది.

ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని ఏఎన్ఐ వర్గాలు పునరుద్ఘాటించాయి. “వారు దాడి చేస్తే, మేం ప్రతిదాడి చేస్తాం. వాళ్లు కాల్పులు జరిపితే, మేం మిస్సైల్స్ తో తగిన రీతిలో బదులిస్తాం. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేయడం కీలక మలుపు అని త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోదీ చర్చించారు. రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, విదేశాంగ మంత్రుల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ (DGMOs) మధ్యే చర్చ జరిగిందని ఏఎన్ఐ నివేదించింది.

ది న్యూ యార్క్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ఫోన్లో మాట్లాడారు. “పాకిస్తాన్ ఏదైనా దాడి చేస్తే, మా రియక్షన్ భయంకరంగా, మరింత బలంగా, విధ్వంసకరంగా ఉంటుందని” చెప్పారని ఏఎన్ఐ వర్గాలు తెలిపాయి. 

 భారతదేశం టార్గెట్ పెద్దది.. చిన్న శిబిరాల జోలికి పోదు 

ISI తో అనుసంధానమై, దగ్గరి లింక్స్ ఉన్న మురిద్కే, బహావల్‌పూర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి తర్వాత భారతదేశం కీలక హెచ్చరికలు పంపింది. భారత్ కేవలం ప్రధాన కార్యాలయాలపై దాడి చేస్తుంది. చిన్న చిన్న ఉగ్ర శిబిరాల జోలికి వెళ్లం. మేం బాధితులను, నేరస్థులను ఒకటి చూడలేమని ప్రపంచానికి భారత్ స్పష్టం చేసిందని అన్నారు.

ఇంటెలిజెన్స్ పక్కా సమాచారం, ప్లానింగ్‌తో ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు జరిగాయి. రాహీం యార్ ఖాన్ వైమానిక స్థావరం (పాకిస్తాన్‌లో) రన్‌వే పూర్తిగా నేలమట్టమైందని సమాచారం. చక్లాల్లో ఉన్న పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నూర్ ఖాన్ కూడా తీవ్రంగా దెబ్బతిందని తెలుస్తోంది. 

మధ్యవర్తిత్వం చేయడానికి ఎవరూ అవసరం లేదు

కశ్మీర్‌ భారత్‌కు చెందిన ప్రాంతం. దేశంలోని ఓ భాగం. దానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మనం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పాక్) ను త్వరలో తిరిగి హస్తగతం చేసుకోవడం తప్ప మాట్లాడటానికి మరేం లేదు. ఒకవేళ పాకిస్తాన్ ఏమైనా చర్చలు జరపాలని భావిస్తే.. అది కేవలం ఉగ్రవాదులను అప్పగించడం అయితే మాట్లాడతాం. ఈ వివాదాలపై మధ్యవర్తిత్వం చేయడానికి భారత్‌కు ఎవరూ అవసరం లేదు" అని కేంద్రం సంకేతాలు ఇచ్చిందని ఏఎన్ఐ నివేదించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, పాకిస్తాన్ మధ్య కశ్మీర్ విషయాన్ని మధ్యవర్తిత్వం చేయాలని సూచించిన తర్వాత మోదీ ప్రభుత్వం నుంచి ఈ మెస్సేజ్ బయటకు వచ్చింది..

ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం

భారతదేశం, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించి, ప్రకటన చేసిన మరుసటిరోజైన ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, NSA అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

శనివారం రెండు దేశాల మధ్య ఏర్పడిన అవగాహన తరువాత పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని భారతదేశం ఆరోపించింది. కాల్పుల విరమణ ప్రకటన తరువాత చిన్న దాడులు జరిగాయని.. సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చర్చించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య

వీడియోలు

Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
Embed widget