BrahMos Missiles in Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ మిస్సైల్స్‌తో టార్గెట్స్ ఛేదించాం- సీఎం యోగి ఆదిత్యనాథ్
యోగి ఆదిత్యనాథ్ లక్నోలో బ్రహ్మోస్ యూనిట్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ లో బ్రహ్మోస్ తో పాక్‌ను చావదెబ్బ కొట్టామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం సంచలన విషయాన్ని వెల్లడించారు. భారతదేశం ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దాడుల్లో పాకిస్తాన్, పీఓకే ఉగ్రస్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణి వినియోగించినట్లు ఆయన ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ బ్రహ్మోస్ వాడినందుకే భారత్ సక్సెస్ అయిందని, అందుకే తాము ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేశామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కట్టుకథ మొదలుపెట్టింది. ఇరుదేశాలు కాల్పుల విరమణ ప్రకటించిన అనంతరం శనివారం నాడు పాక్ ప్రభుత్వం భారత్ మీద ఆరోపణలు చేసింది.
బ్రహ్మోస్ సత్తా ఏంటో పాకిస్తాన్‌ను అడగండి..
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ మిస్సైల్ సెంటర్‌ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్‌గా ప్రారంభించారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభించిన కార్యక్రమంలో యూపీ సీఎ యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూపీ సీఎ యోగి మాట్లాడుతూ.. "ఆపరేషన్ సింధూర్‌లో బ్రహ్మోస్ క్షిపణి సామర్థ్యాన్ని మీరు చూసి ఉంటారు. మీరు చూడకపోయి ఉంటే, బ్రహ్మోస్ క్షిపణి సత్తా గురించి పాకిస్తాన్ ప్రజలను అడగండి" అని లక్నోలో బ్రహ్మోస్ ఉత్పత్తి యూనిట్ ప్రారంభోత్సవంలో యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్, పీఓకే లోని ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసి సక్సెస్ సాధించామని యోగి ఆదిత్యనాథ్ చెప్పడంతో దేశ వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ అవుతోంది.
#WATCH | Lucknow | UP CM Yogi Adityanath says, "You must have seen a glimpse of the BrahMos missile during Operation Sindoor. If you didn't, then just ask the people of Pakistan about the power of the BrahMos missile. PM Narendra Modi has announced that any act of terrorism going… pic.twitter.com/lv2LzYNcXs
— ANI (@ANI) May 11, 2025
"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్రవాద చర్య అయినా యుద్ధంగా పరిగణిస్తామని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయకపోతే ఆ సమస్యను పరిష్కరించలేము. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి మోదీ నాయకత్వంలో మనమందరం ఒకటిగా ఉండాలి. శాంతి మంత్రం జపిస్తే, ఉగ్రవాదం ఆగదు. వారికి వారి భాషలోనే సమాధానం చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చింది" అని యూపీ సీఎం యోగి అన్నారు.
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది..
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో బైసరన్ లోయలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మందిని చంపేశారు. ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కీలకమైన జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి విజయం సాధించింది. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగిసిపోలేదని, మరిన్ని ఉగ్ర స్థావరాలు బాకీ ఉన్నాయని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల అఖిలపక్ష సమావేశం అనంతరం అన్నారు. ఉగ్రవాదంపై భారత్ పోరాటం మరో దశకు చేరిందని, మోదీ నాయకత్వంలో పాక్ ఉగ్రవాదులను ఏరివేయడమే లక్ష్యమన్నారు.






















