By: ABP Desam, Satyaprasad Bandaru | Updated at : 25 Apr 2023 04:57 PM (IST)
ఆపరేషన్ కావేరి
Operation Kaveri : ఆఫ్రికా దేశం సూడాన్ లో అంతర్యుద్ధం మొదలైంది. సైన్యం, పారామిలటరీ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో సుడాన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది, ఆపరేషన్ కావేరి పేరుతో సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకువస్తున్నారు. ఈ ఆపరేషన్ భాగంగా భారతీయుల మొదటి బ్యాచ్ సూడాన్ నుంచి బయలుదేరింది. INS సుమేధ యుద్ధ నౌక 278 మందితో పోర్ట్ సుడాన్ నుంచి జెడ్డాకు బయలుదేరింది. పోర్ట్ సూడాన్ నుంచి భారతీయులను తరలింపు దృశ్యాలను అల్ అరేబియా ప్రసారం చేసింది. ఓడరేవు వద్ద డాక్ చేసిన INS సుమేధ వీడియో ప్రదర్శించింది.
#WATCH | First batch of stranded Indians leave Sudan under Operation Kaveri. INS Sumedha with 278 people onboard departs Port Sudan for Jeddah: MEA spox
— ANI (@ANI) April 25, 2023
(Video: MEA spox) pic.twitter.com/MdxvJhwxnf
3 వేల మంది భారతీయులు
సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల మొదటి బ్యాచ్‌ను మంగళవారం ఆపరేషన్ కావేరీలో భాగంగా స్వదేశానికి తరలిస్తున్నారు. INS సుమేధ 278 మంది భారతీయులతో పోర్ట్ సుడాన్ నుంచి జెడ్డాకు బయలుదేరింది. సుడాన్‌లో చిక్కుకుపోయిన భారత పౌరులను రక్షించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ కావేరీని ప్రారంభించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం తెలిపారు. సూడాన్‌లోని భారతీయులకు సహాయం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జైశంకర్ అన్నారు. ప్రస్తుతం సూడాన్ లో ఉన్న 3,000 మంది భారతీయ పౌరుల భద్రతపై దృష్టి సారించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. "ఆపరేషన్ కావేరిలో భాగాంగా సూడాన్ లో చిక్కుకుపోయిన భారతీయుల మొదటి బ్యాచ్ ఆ దేశం నుంచి బయలుదేరింది. 278 మంది వ్యక్తులతో INS సుమేధ పోర్ట్ సుడాన్ నుంచి జెడ్డాకు బయలుదేరింది" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.
First batch of stranded Indians leave Sudan under Operation Kaveri, INS Sumedha with 278 people onboard departs Port Sudan for Jeddah: MEA spox
— ANI (@ANI) April 25, 2023
(Photos: MEA spox) pic.twitter.com/7XZOhALIuw
సైన్యం, పారామిలిటరీ గ్రూపు మధ్య భీకర పోరు
సూడాన్‌లో గత 12 రోజులుగా దేశ సైన్యం.. పారామిలిటరీ గ్రూపు మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఫలితంగా ఇప్పటి వరకు దాదాపు 400 మంది పౌరులు మరణించారు. ఈ నేపథ్యంలో సూడాన్‌లో ఉన్న భారతీయుల శ్రేయస్సు, భద్రతకు హామీ ఇవ్వడానికి భారతదేశం పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది. సూడాన్‌లో భద్రతా పరిస్థితిని సంక్లిష్టతను పరిశీలిస్తున్నామని తెలిపింది. సూడాన్‌లోని భారతీయుల రక్షణకు వివిధ భాగస్వాములతో సమన్వయం చేసుకుంటున్నామని వివరించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయం.. ఆ దేశ అధికారులతో పాటు, ఐక్యరాజ్యసమితి, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, యునైటెడ్ స్టేట్స్ సహా ఇతరులతో తరచూ చర్చలు జరుపుతుంది.
Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ
Form 16: ఇంకా ఫామ్-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్ కూడా ఉంది
NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!
EPFO: 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లకు EPFO మెసేజ్‌లు, అందులో ఏం ఉంది?
Youngest Billionaire: లైఫ్‌లో రిస్క్ చేయకపోతే మిగిలేది రస్కే - యంగెస్ట్ బిలియనీర్ సలహా
TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్, కవచ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్
Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?