బాలుడి అన్నయ్య, అక్కయ్యలు చేపలతో ఆడుకుంటూ బాలుడిని నవ్వించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో చేప పసివాడి గొంతులోకి ఎగిరిపడింది.
MP Viral News: ఏడాదిన్నర బాలుడి గొంతులో ఎగిరిపడ్డ చేప! ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు!
MP Viral News: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఘటన తల్లిదండ్రులకు అలర్ట్‌గా మారింది. ఏడాది వయసు ఉన్న బాలుడి గొంతులో లైవ్ ఫిష్ ఎగిరిపడింది.

- బాలుడి గొంతులో లైవ్ ఫిష్ పడి, తీవ్ర రక్తస్రావం అయ్యింది.
- ఆపరేషన్ ద్వారా వైద్యులు బాలుడి గొంతులో చేపను తొలగించారు.
- చిన్న పిల్లల్లో గొంతులో వస్తువులు ఇరుక్కోవడం ప్రాణాంతకం.
MP Viral News: ఇండోర్‌లో జరిగిన ఘటన అందర్నీ షాక్‌కి గురి చేసింది ఏడాది బాలుడు గొంతులో లైవ్ ఫిష్ పడింది. దీంతో ఆ బాలుడు తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రి పాలయ్యాడు. వైద్యులు ఆపరేషన్ చేసి బాలుడి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారుతోంది.
సుమారు మూడు అంగుళాల పొడవు ఉన్న లైవ్ ఫిష్ ఏడాది వయసు ఉన్న బాలుడు గొంతులోకి ఎగిరిపడింది. ఈ ఘటన ఏప్రిల్ 3న జరిగింది. ఇంట్లో అక్వేరియంను శుభ్రం చేస్తుండగానే ఈ ఘటన జరిగింది. అలంకరణ కోసం ఉంచిన చేపలతో బాలుడి అన్నలు, అక్కలు ఆడుకుంటున్న టైంలో ఈ ఘటన జరిగింది.
పిల్లల అజాగ్రత్త వల్ల ఒక సంవత్సరం వయసు ఉన్న బాలుడు ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. బాలుడిని నవ్వించేందుకు చేపలతో సోదరులు ఆడుతున్నారు. దీంతో బాలుడు గట్టిగా నవ్వాడు. ఇంతలో చేప పసివాడి గొంతులో పడింది. ఆ చేప గొంతులో ఇరుక్కుపోవడంతో బాలుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. నోటి నుంచి రక్తస్రావం కూడా అయ్యింది.
పరిస్థితి విషమంగా ఉందని గ్రహించిన కుటుంబ సభ్యులు ఆ బాలుడిని ఆసుపత్రిలో చేర్చారు. మహరాజా యశ్వంతరావు ఆసుపత్రి వైద్యులు బాలుడిని పరీక్షించి ఆపరేషన్ చేస్తేనే ప్రాణాలు కాపాడగలమని కుటుంబానికి చెప్పారు.
ఆలస్యం చేయకుండా సర్జరీ చేసిన వైద్యులు
ఎంవైహెచ్‌లోని ఈఎన్టీ చీఫ్ డాక్టర్ యమిని గుప్తా వెంటనే అత్యవసర బృందాన్ని అప్రమత్తం చేసి, ఆలస్యం చేయకుండా ఆపరేషన్ చేసి బాలుడి ప్రాణాలను కాపాడారు. " మేం బాలుడిని పరీక్షించినప్పుడు సుమారు మూడు అంగుళాల పొడవున్న చేప బాలుడి గొంతులో ఇరుక్కుపోయి, సజీవంగా కొట్టుకుంటోంది. దాని వల్ల బాలుడి గొంతులో గాయమైంది. దీంతో రక్తం కారుతోంది. ఆ బాలుడు టెన్షన్ పడుతున్నాడు. ఏడుస్తున్నాడు. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది." అని డాక్టర్ యమిని గుప్తా తెలిపారు.
అరగంట చికిత్స తర్వాత బాలుడు సేఫ్
ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా తాను ఆ బాలుడికి ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నానని, ఆరుగురు వైద్యుల బృందం అరగంట పాటు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి అతని గొంతులోంచి చనిపోయిన చేపను తొలగించిందని గుప్తా చెప్పారు. ఆపరేషన్ తర్వాత కొన్ని రోజులపాటు బాలుడి పరిస్థితిని పర్యవేక్షించిన అనంతరం, అతడిని ఎంవైహెచ్ నుంచి డిశ్చార్జ్ చేశారని, ప్రస్తుతం అతను ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యుల తెలిపారు. " ఏడాది వయసు ఉన్న బాలుడి గొంతులో ఇరుక్కున్న చేపను ఆపరేషన్ చేసి తొలగించడం దే మొదటి కేసు" అని గుప్తా చెప్పారు. చిన్న పిల్లల శ్వాస మార్గాలు ఇరుకుగా ఉండటం వల్ల వారి గొంతులో ఏ వస్తువైన ఇరుక్కుపోవడం ప్రాణాంతకం కాగలదని తెలిపారు.
Frequently Asked Questions
బాలుడి గొంతులో చేప పడటానికి కారణం ఏమిటి?
ఆపరేషన్ తర్వాత బాలుడి ఆరోగ్యం ఎలా ఉంది?
ఆపరేషన్ విజయవంతమైంది. బాలుడిని కొద్దిరోజుల పర్యవేక్షణ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అతను ఆరోగ్యంగా ఉన్నాడు.
బాలుడికి ఎంత పొడవున్న చేప గొంతులో ఇరుక్కుంది?
సుమారు మూడు అంగుళాల పొడవున్న సజీవ చేప బాలుడి గొంతులో ఇరుక్కుపోయింది.
ఈ తరహా కేసు వైద్యులకి కొత్తా?
డాక్టర్ యమిని గుప్తా ప్రకారం, ఏడాది వయసున్న బాలుడి గొంతులో ఇరుక్కున్న చేపను ఆపరేషన్ చేసి తొలగించడం ఇదే మొదటి కేసు.
ట్రెండింగ్ వార్తలు





















