Corona Cases: దేశంలో ఐదు వేలు మార్క్ దాటిన ఒమిక్రాన్ కేసులు.. 15శాతానికిపైగా పెరిగిన కరోనా కేసులు
మహారాష్ట్రలో కరోనా, ఒమిక్రాన్ కేసుల ఉద్ధృతి ఇంకా తగ్గలేదు. 24గంటల్లోనే 1281కేసులు రిజిస్టర్ అయ్యాయి. తర్వాతి స్థానంలో రాజస్థాన్ ఉంది.
దేశంలో కరోనా క్రమంగా కమ్మేస్తోంది. 24 గంటల వ్యవధిలో సుమారు రెండు లక్షల కేసులు రిజిస్టర్ అయ్యాయి. దేశవ్యాప్తంగా లక్షా94వేల 720 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో ఇదే అత్యధిక కేసులు. ఇది ఓవరాల్‌గా 15.8 శాతం పెరిగినట్టు లెక్క. ఇందులో 4, 868 ఒమిక్రాన్ కేసులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మొత్తం కేసుల్లో 1805 మంది రికవరీ అయ్యారు.
ఈ కేసుల్లో ఎక్కువ మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి. 1281 కేసులతో దేశంలోనే ఎక్కువ కేసులు రిజిస్టర్ అవుతున్న రాష్ట్రంగా ఉంది. దీని తర్వాత రాజస్థాన్ ఉంది. అక్కడ ఒక్కరోజులో 645 కేసులు వెలుగులోకి వచ్చాయి. మూడో స్థానంలో ఉన్న దిల్లీలో 546 కేసులు బయటపడ్డాయి.
కేంద్ర ఆరోగ్య శాఖ ఇస్తున్న లెక్కల ప్రకారం ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా 442 మంది చనిపోతే... 60, 405 మంది వైరస్ బారి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి 3, 46, 30, 536 మంది కోలుకున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. రోజువారి పాజిటివ్ రేటు 11.05 ఉంటే... వీక్లీ పాజిటివిటీ రేటు 9.82గా ఉంది. మంగళవారం లెక్కల ప్రకారం చాలా రాష్ట్రాల్లో కేసులు సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో 21, 098 కేసులు వెలుగు చూశాయి. దీంతో అక్కడ లక్షకుపైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి.
తమిళనాడులో 15, 379 కేసులు, కేరళలో 9,066 మందికి వైరస్ సోకింది. దిల్లీలో చాలా వరకు వర్క్‌ఫ్రమ్ అవకాశం కల్పించి మరిన్ని ఆంక్షలు విధిస్తే అక్కడ కూడా 21వేల 259 కొత్త కేసులు రిజిస్టర్ అయ్యాయి.
దేశవ్యాప్తంగా 69.52 కోట్ల టెస్టులు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. ఇప్పటి వరకు 153.8కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్టు తెలిపింది.
అన్నిజిల్లాల్లో సరిపడేంత ఆక్సిజన్ నిల్వలు ఉండేలా చూసుకోవాలని అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషన్ లేఖ రాశారు. ఇతర వైద్య సదుపాయాలపై కూడా దృష్టి పెట్టాలన్నారు.
Also Read: Viral News: మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా? ఉప్పే కాదు అంతకుమించి! ఈ షాకింగ్ విషయాలు చూడండి!
Also Read: Horoscope Today 12th January 2022: ఈ రాశుల వారికి ఈ రోజంతా శుభసమయమే... మీ రాశి ఫలితం
Also Read: OMICRON: ఒమిక్రాన్ వేరియంట్‌ను అణిచేయాలంటే బూస్టర్ డోస్ అవసరం... చెబుతున్న కొత్త పరిశోధన