Jammu Kashmir CM: జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
Jammu Kashmir CM: 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వం కొలువు దీరింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి మొదటి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం చేశారు.
Jammu Kashmir CM: 10 ఏళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రిగా సురేంద్ర చౌదరి నియమితులయ్యారు. వీళ్లతోపాటు మరో నలుగురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. జావేద్ దార్, సకీనా ఇట్టు, జావేద్ రాణా, సతీష్ శర్మ ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 2024లో నౌషేరా స్థానం నుంచి సురేంద్ర చౌదరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనాపై విజయం సాధించారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జమ్మూకి ఏం వస్తున్న ప్రశ్నకు సమాధానం మొదటి రోజే ఇచ్చింది ఒమర్ సర్కారు. నౌషేరా ఎమ్మెల్యేను కేంద్ర పాలిత ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రిగా చేశారు.
LoP @RahulGandhi Ji and Congress General Secretary @priyankagandhi Ji attend the oath ceremony of New CM of Jammu and Kashmir Omar Abdullah Ji.
— Sama Ram Mohan Reddy (@RamMohanINC) October 16, 2024
Our mission is to restore the statehood of J&K and we will fulfill it!🔥 pic.twitter.com/oZZ3bgwhkQ
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 2024లో నౌషేరా స్థానం నుంచి సురేంద్ర చౌదరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనాపై విజయం సాధించారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జమ్మూకి ఏం వస్తున్న ప్రశ్నకు సమాధానం మొదటి రోజే ఇచ్చింది ఒమర్ సర్కారు. నౌషేరా ఎమ్మెల్యేను కేంద్ర పాలిత ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రిగా చేశారు.
#WATCH | Srinagar | After taking oath as Jammu & Kashmir Deputy CM, Surinder Kumar Choudhary says," I have no words to thank our leaders Farooq Abdullah & Omar Abdullah for giving such a big position. With his decision to make me the Deputy CM, Omar Abdullah has proved that Jammu… pic.twitter.com/iW1Cp2IGsT
— ANI (@ANI) October 16, 2024
2024 జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ 42 స్థానాల్లో భారీ విజయం సాధించింది. మిత్రపక్షం కాంగ్రెస్‌కు 6 సీట్లు వచ్చాయి. మొత్తంగా NC-కాంగ్రెస్ కూటమికి 48 సీట్లు లభించాయి. దీంతో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ మంత్రివర్గంలో ఎందుకు చేరలేదు?
ఒమర్ మంత్రివర్గంలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. దీనికి రెండు కారణాలు ఉన్నాయనే టాక్ నడుస్తోంది. ఒకటి ఒమర్ ప్రభుత్వంలో కాంగ్రెస్ రెండు మంత్రి పదవులు కోరుకుంది. కానీ ఒకటే ఇచ్చేందుకు ఆయన అంగీకరించారు. ఒత్తిడి పెంచేందుకు బయటి నుంచి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. జమ్మూ కశ్మీర్‌లో 6 సీట్లు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. అందుకే మంత్రిపదవులు తీసుకోకుండా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. రాజకీయ ప్రాయశ్చిత్తం చేస్తోందని అంటున్నారు.
రాజకీయంగా తాము ఐక్యంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చేందుకు ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారోత్సవానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ప్రధాని కూడా బహిరంగ సభల్లో పదేపదే హామీ ఇచ్చినా రాష్ట్ర హోదా పునరుద్ధరించలేదని ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.