అన్వేషించండి

Julana Assembly seat result: జులానాలో మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్ విజయం- సెటైర్లు వేసిన బ్రిజ్‌భూషణ్

Haryana Elections Results:మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్ హర్యానాలోని జులానా సీటును గెలుచుకున్నారు. 15 ఏళ్లుగా కాంగ్రెస్‌ విజయం సాధించలేని స్థానంలో  గెలిచి అధ్యక్షా అనేందుకు సిద్దమయ్యారు 

Haryana Assembly Elections 2024: ఒలంపిక్స్ లో ఊహించని పరిస్థితిలో పతకం అందుకోకుండా గుండెల నిండా  నిరాశతో భారత్‌కు చేరిన స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ రాజకీయంగా విజయం సాధించారు. హర్యానా ఎన్నికల్లో వెలువడిన ఫలితాల్లో ఆమె కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలుపొందారు. 

పారిస్‌ ఒలింపిక్స్‌లో మహిళల రెజ్లింగ్‌ విభాగంలో తలపడిన వినేశ్‌ ఫొగట్‌ తుది పోరులో తలపడాల్సిన సమయంలో అధిక బరువు కారణంగా ఆమె పోటీ నుంచి వైదొలిగిన విషయం అందరికి తెలిసిందే. ఒలంపిక్స్‌లో అనుకోకుండా పతకం కోల్పోయిన  కుంగిపోకుండా వినేశ్ ఫొగట్‌ రాజకీయా రంగప్రవేశం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి హర్యానా ఎన్నికల్లో వినేశ్ ఫొగట్‌ పోటీ చేశారు. జులానా అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి పోటీ చేసిన ఆమెకు ఓటర్లు బ్రహ్మారథం పట్టారు.

పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే వినేశ్‌ ఫొగల్‌ విజయం సాధించారు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినా ఆమె గెలిచారు. మొదట్లో వినేష పొగట్ తొలి నాలుగు రౌండ్‌లలో బిజెపి ఆధిక్యంలో కొనసాగింది.. దీంతో కౌంటింగ్ హాల్ నుంచి పోగట్ వెళ్ళిపోయారనే ప్రచారం జరిగింది. తర్వాత ఆమెను విజయం వరించింది. 

ఒలింపిక్స్‌లో వెంటాడిన దురదృష్టం రాజకీయాల్లో అదృష్టంగా మారిందనీ చెప్పచ్చు. ఫలితాల్లో మొదటి రౌండ్‌ నుంచి వినేశ్‌ ఫొగట్‌ ఆధిక్యం కనబరించారు. మధ్యలో కొంత వెనుకబడినా తర్వాత పుంజుకుని చివరి రౌండ్‌ వరకు వినేశ్‌ ఆధిక్యం కొనసాగించారు. బీజేపీ తరఫున యోగేశ్‌ బజ్‌రంగీ పోటీ చేయగా.. అతడిపై వినేశ్ ఫొగట్‌ విజయం సాధించారు.

రెజ్లింగ్‌లో పరిస్థితుల కారణంగా విజయం సాధించలేకపోయిన వినేశ్‌ ఫొగట్‌ను జులానా ప్రజలు విజయాన్ని ఆదరించారు. ఒలింపిక్స్‌లో మెడల్‌ను కోల్పోయిన వినేశ్‌కు ఎమ్మెల్యే పదవి ఇచ్చి గౌరవించారు. కాగా రెజ్లింగ్‌లో రాజకీయంగా తీవ్ర అవమానాలు, గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న వినేశ్‌ ఫొగట్‌ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవడం అందరికీ అర్చర్యపరిచారు. ఎమ్మెల్యేగా వినేశ్‌ ఫొగట్‌ విజయం సాధించినా అక్కడ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆమె కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగనున్నారు.

వినేష్ ఫోగట్ హర్యానాలోని జింద్ జిల్లాలోని జులానా స్థానం నుంచి విజయం సాధించారు.  కాంగ్రెస్ తరపున పోటీ చేసిన  స్థానంలో గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. అంతే కాకుండా 15 ఏళ్లుగా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలవడానికి ప్రయాస పడుతున్నారు. ఇప్పుడు  ఫోగట్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. 

జులానాలో కెప్టెన్ యోగేష్‌ బైరాగీపై ఫోగట్ 6,015 ఓట్ల తేడాతో గెలిచారు. ఆమెకు 65,080 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌కు 59,065 ఓట్లు వచ్చాయి. ఐఎన్‌ఎల్‌డీకి చెందిన సురీందర్ లాథర్ 10,158 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే అమర్జీత్ దండాకు కేవలం 2,477 ఓట్లు మాత్రమే వచ్చాయి. గత 2019 ఎన్నికల్లో బీజేపీకి చెందిన పర్మీందర్ సింగ్ ధుల్‌పై 25,000 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు.

జులనా సీటులో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఫోగట్‌కు వ్యతిరేకంగా WWEలో 'లేడీ ఖలీ'గా ప్రసిద్ధి చెందిన మాజీ రెజ్లర్ కవితా దలాల్‌పై పోటీ చేశారు. ఈ స్థానం నుంచి జెజెపి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే అమర్జీత్ సింగ్ ధండా బరిలో ఉన్నారు. వినేష్ ఫోగట్ హర్యానాలోని జింద్ జిల్లాలోని భక్తా ఖేడా గ్రామానికి చెందిన రెజ్లర్ సోమ్‌వీర్ రాథీని 2018లో వివాహం చేసుకున్నారు. ఈ గ్రామం జులానా అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది. ఇది జాట్‌ల ఆధిపత్యం ఉన్న  ప్రాంతం.

జులానా అసెంబ్లీ స్థానం జింద్ జిల్లాలో ఉంది. జింద్ జిల్లాలో జులానా, సఫిడాన్, జింద్, ఉచన కలాన్, నర్వాణా అనే ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. హర్యానాలో మొత్తం ఓటింగ్ శాతం 67.9 కాగా జులానాలో 74.66% పోలింగ్ నమోదైంది. సిర్సా జిల్లాలోని ఎల్లినాబాద్ అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 80% పైగా ఓటింగ్ రిజిస్టర్ అయింది.

వినేష్ ఫోగట్ విజయంపై బ్రిజ్‌భూషణ్ సెటైర్లు

వినేష్ ఫోగట్ విజయంపై బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. వినేష్ ఫోగట్ గెలిచినా కాంగ్రెస్‌లో ఉన్నందున సర్వనాశనం అవుతుందని అన్నారు. గెలుపొందడంపై సమస్యేమీ లేదన్నారు. అయితే ఆమె ఎక్కడికి వెళ్లినా అక్కడ అంతా విధ్వంసమేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడ అలాంటి పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. ఆమె మా పేరు చెప్పి గెలిస్తే మేం గొప్పవాళ్లమని అన్నారు. నా పేరుకు అంత శక్తి ఉందని కానీ కాంగ్రెస్ మునిగిపోయిందని ఎద్దేవా చేశారు.

క్రీడలపై ఫోకస్: వినేష్ ఫోగట్ 

జులానాలో గెలిచిన తర్వాత వినేష్ ఫోగట్ మాట్లాడుతూ... ప్రజల అభిమానాన్ని పొందినకు సంతోషంగా ఉందన్నారు. అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. క్రీడల అభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ పెడతానన్నారు. 

Also Read: నాడు అయోధ్యలో నేడు కశ్మీర్‌లో మోదీనే పడగొట్టిన రాహుల్ గాంధీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Telangana Weather Update: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు- అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 
తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు- అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 
Hari Hara Veera Mallu: పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
Uttar Pradesh Crime News: భర్త మొండెంపైనే నిద్రపోయిన భార్య- తల తీసుకెళ్లిన ప్రియుడు- మీరట్ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు
భర్త మొండెంపైనే నిద్రపోయిన భార్య- తల తీసుకెళ్లిన ప్రియుడు- మీరట్ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు 
Embed widget