By: ABP Desam | Updated at : 04 Jun 2023 11:45 AM (IST)
Edited By: Pavan
రైల్వే మంత్రి
Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి మూల కారణాన్ని గుర్తించినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం వెల్లడించారు. ప్రమాద స్థలంలో ఉంటూ పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి.. రైలు ప్రమాదానికి మూల కారణం తెలిసిందని, రైల్వే భద్రతా కమిషనర్ త్వరలోనే నివేదిక సమర్పించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
'ప్రమాదంపై విచారణ పూర్తయింది. రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ నివేదికను త్వరలోనే అందిస్తారు. ఆ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇప్పటికే ఈ ఘోర ప్రమాదానికి దారి తీసిన మూల కారణాన్ని గుర్తించాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. రైల్వే ట్రాక్ పునురద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని మృతదేహాలను గుర్తించి తొలగించాం. బుధవారం ఉదయానికి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి చేయడమే మా లక్ష్యం. ఆ దారిలో రైళ్లు ఎప్పట్లాగా నడవడానికి పరిస్థితులను చక్కదిద్దుతా'మని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
#WATCH | The root cause of this accident has been identified. PM Modi inspected the site yesterday. We will try to restore the track today. All bodies have been removed. Our target is to finish the restoration work by Wednesday morning so that trains can start running on this… pic.twitter.com/0nMy03GUWK
— ANI (@ANI) June 4, 2023
విస్మయానికి గురిచేసిన ఒడిశా రైలు ప్రమాదం
అత్యంత భయానక రీతిలో జరిగిన ఒడిశా రైలు ప్రమాద ఘటన జరిగిన తీరు విస్మయం కలిగిస్తోంది. విపరీతమైన బరువుతో ఉండే రైలు పట్టాలు తప్పితే, దాన్ని తిరిగి పట్టాలపైకి ఎక్కించడం మామూలు విషయం కాదు. ఎంతో వ్యయప్రయాసలు పడాలి. అలాంటిది, ఒడిశాలో జరిగిన ప్రమాదంలో రైలు ఇంజిన్ ఏకంగా గూడ్స్ రైలు పైకి ఎక్కేసింది. దాదాపు 15 అడుగులు ఎత్తున ఉండే గూడ్స్ రైలు వ్యాగన్ పైకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకొని వెళ్లింది. ప్రమాద స్థలంలో పడిఉన్న బోగీలు, ఇంజిన్ ఉన్న స్థానం చూసి నిపుణులు సైతం విస్మయం చెందుతున్నారు.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైన సమయంలో దాదాపు 128 కిలో మీటర్ల వేగంతో వెళుతున్నట్లుగా రైల్వే అధికారులు తెలిపారు. రైలును మెయిన్ లైన్ కాకుండా లూప్ లైన్‌కి మళ్లించినప్పుడు వేగం బాగా తగ్గాల్సి ఉంది. కానీ, కోరమాండల్ ఎక్స్ ప్రెస్ వేగం ఎందుకు తగ్గలేదనేది ఒక ప్రశ్నగా ఉంది. ఆ వేగంతోనే కోరమాండ్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనక నుంచి బలంగా ఢీకొని రైలింజన్ వ్యాగన్ పైకి ఎక్కేసిందని నిపుణులు భావిస్తున్నారు.
గూడ్స్ రైలులో ఒక్కో ఖాళీ వ్యాగన్ 25 - 26 టన్నుల బరువు ఉంటుంది. దాంట్లో నింపే సరకు బరువు ఒక్కో దాంట్లో మరో 54-60 టన్నుల దాకా ఉండొచ్చు. అలాంటి వ్యాగన్ పైకి రైలింజన్ ఎక్కేసింది. 128 కిలో మీటర్ల వేగంతో ఢీకొట్టడం వల్లే కోరమాండల్ ఇంజిన్ గూడ్సు రైలుపైకి ఎక్కినట్లు నిపుణులు భావిస్తున్నారు.
చనిపోయిన వారి సంఖ్య 288కి
శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 288కు చేరుకుంది. 56 మంది తీవ్ర గాయాలపాలయ్యారని, మరో 747 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో తెలుగువాళ్లే వంద మందికిపైగా ఉన్నారని సమాచారం.
అవయవ దానం చేస్తే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, స్టాలిన్ సంచలన నిర్ణయం
Chandrayaan-3: చంద్రుడు, అంగారక గ్రహాలపై భారత్‌కు శాశ్వత నివాసం ఉండాలి: ఇస్రో చీఫ్
Iphone 15: ఐఫోన్ డెలివరీ ఆలస్యమైందని స్టోర్ సిబ్బందిపై దాడి, కేసు నమోదు
Delivery Boy: పేషెంట్‌గా మారిన డెలివరీ బాయ్, డాక్టర్‌ను కత్తితో బెదిరించి దోపిడీ - ట్విస్ట్ ఏంటంటే!
ఉస్మానియాలో రోడ్డెక్కిన విద్యార్థులు, TSPSC రద్దు చేయాలని డిమాండ్
TDP News : కర్నూలు టీడీపీలో కీలక మార్పులు - బైరెడ్డి చేరిక ఖాయమయిందా ?
Amazon Prime Ads: అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్స్ గోల - వచ్చే సంవత్సరం నుంచే స్టార్ట్!
Ram - Virat Kohli Biopic : విరాట్ కోహ్లీ బయోపిక్‌లో రామ్ పోతినేని - హీరో ఏమన్నారో తెలుసా?
Mindspace Buildings Demolition: మాదాపూర్ మైండ్ స్పేస్ లో 2 భవనాలు క్షణాల్లో నేలమట్టం
/body>