By: Ram Manohar | Updated at : 05 Jun 2023 01:11 PM (IST)
ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ జరపడాన్ని మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు.
Odisha Train Accident:
ప్రధాని మోదీకి లేఖ రాసిన ఖర్గే
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రతిపక్షాలు భగ్గమంటున్నాయి. కవచ్ సిస్టమ్ ఎందుకు పెట్టలేదంటూ ప్రశ్నిస్తున్నాయి. మోదీ సర్కార్ వైఫల్యం వల్లే ఇంత ఘోర ప్రమాదం జరిగిందని తేల్చి చెబుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీకి గురి పెట్టింది. ఇప్పటికే ప్రియాంక గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు చేయగా...ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా స్పందించారు. ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. ఈ ప్రమాదంపై ఎన్నో అనుమానాలున్నాయన్న ఖర్గే...మోదీ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తప్పుడు నిర్ణయాలతో రైల్వేని ప్రమాదంలోకి నెట్టేశారని ఆరోపించారు. "మోదీ సర్కార్ తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల రైల్వే ప్రయాణం ప్రమాదకరంగా మారింది. దేశ ప్రజల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తోంది" అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కేంద్రరైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌పైనా విమర్శలు చేశారు ఖర్గే. ప్రమాదంపై విచారణకు సీబీఐని నియమించడాన్నీ తప్పుపట్టారు. నేర సంఘటనల్ని ఇన్వెస్టిగేట్ చేసే సీబీఐకి రైల్వేతో ఏం సంబంధం అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలకు సీబీఐ ఎలాంటి బాధ్యత వహించలేదని తేల్చి చెప్పారు.
"సీబీఐ ఉన్నది కేవలం నేర సంఘటనల్ని విచారించేందుకు. రైల్వే ప్రమాదాలకు సీబీఐకి ఏంటి సంబంధం? సీబీఐ మాత్రమే కాదు. మరే దర్యాప్తు సంస్థకీ దీంతో పని లేదు. టెక్నికల్, పొలిటికల్ ఫెయిల్యూర్స్‌కి సీబీఐ ఎలా బాధ్యత వహిస్తుంది? రైల్వే సేఫ్‌టీ గురించి వీళ్లకు ఏం అవగాహన ఉంటుంది? సేఫ్‌టీ సిగ్నలింగ్ గురించి తెలుస్తుందా?"
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
The devastating train accident in Odisha has shocked the nation.
— Mallikarjun Kharge (@kharge) June 5, 2023
Today, the most crucial step is to prioritise installation of mandatory safety standards to ensure safety of our passengers
My letter to PM, Shri @narendramodi, highlighting important facts. pic.twitter.com/fx8IJGqAwk
రైల్వేలో సంస్కరణలు తీసుకొస్తున్నామని మోదీ సర్కార్ ప్రచారం చేసుకుంటుందే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు ఖర్గే. రైల్వేపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని మండి పడ్డారు.
"ఏళ్లు గడిచే కొద్ది రైల్వేని మరింత సంస్కరించాలి. సామర్థ్యం పెంచాలి. కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి. ఇవన్నీ వదిలేసి మోదీ ప్రభుత్వం రైల్వేపై సవితి తల్లి ప్రేమ చూపిస్తోంది. ప్రమాదం ఎందుకు జరిగిందో అని రైల్వే మంత్రే స్వయంగా చెబుతున్నారు. మళ్లీ ఆయనే సీబీఐకి అప్పగించామని అంటున్నారు. 2016లో కూడా కాన్‌పూర్‌లో రైలు ప్రమాదం జరిగితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ చేపట్టాలని అన్నారు. ఆ తరవాత 2017లో ఏ ఎన్నికల ర్యాలీలో అది ప్రమాదం కాదు కుట్ర అని తేల్చి చెప్పారు. ఇప్పుడు జరిగింది కూడా కుట్రే అయితే అందుకు కారకులైన వాళ్లను కఠినంగా శిక్షించాలి"
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..
Rahul Gandhi: నిన్న రైల్వే కూలీగా, నేడు కార్పెంటర్‌గా రాహుల్ గాంధీ - రంపం చేతబట్టి, కార్మికులతో ముచ్చట్లు
మొబైల్‌లో మునిగిపోయిన డ్రైవర్, ప్లాట్‌ఫామ్ పైకి ఎక్కిన ట్రైన్ - ఐదుగురు సస్పెండ్
కెనడా ఆర్మీ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసిన ఇండియన్ హ్యాకర్స్! మరింత పెరిగిన ఉద్రిక్తతలు
భారత్‌కి తొలి ప్రధాని నెహ్రూ కాదు సుభాష్ చంద్రబోస్ - బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది
/body>