Coromandel Train Accident: వెనక నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయ్, కాసేపు స్పృహలోనే ఉన్నాను - కోరమాండల్ డ్రైవర్
Coromandel Train Accident: ప్రమాదం జరిగిన కాసేపటి వరకూ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ స్పృహలో ఉన్నాడు.
Coromandel Train Accident:
డ్రైవర్‌తో మాట్లాడిన రైల్వే బోర్డ్
ఒడిశా రైలు ప్రమాదంపై ఓ వైపు విచారణ జరుగుతుండగానే కీలక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదం జరిగిన తరవాత ఏం జరిగిందో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ వివరించినట్టు రైల్వే బోర్డ్ వెల్లడించింది. యాక్సిడెంట్ అయిన కాసేపటి వరకూ స్పృహలో ఉన్నట్టు తెలిపింది. ప్రమాదం జరిగే ముందు గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని, అందుకే ఆగకుండా వెళ్లిపోయానని డ్రైవర్ చెప్పినట్టు అధికారులు స్పష్టం చేశారు. రైల్వే బోర్డ్ సభ్యురాలు జయ వర్మ చెప్పిన వివరాల ఆధారంగా చూస్తే...లోకోపైల్‌ట్‌తో రైల్వే బోర్డ్ అధికారులంతా మాట్లాడారు. రెడ్ సిగ్నల్ పడకపోవడం వల్ల వేగంగా దూసుకొచ్చినట్టు లోకోపైలట్ చెప్పినట్టు వివరిస్తున్నారు.
"ట్రైన్‌ని ఆపాలని ఎవరూ సమాచారం ఇవ్వలేదు. రెడ్ సిగ్నల్ కూడా లేదు. అందుకే వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన కాసేపటి వరకూ డ్రైవర్ స్పృహలో ఉన్నా...ఆ తరవాత ఉన్నట్టుండి కిందపడిపోయాడు. పరిస్థితి విషమించడం వల్ల ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతానికి చికిత్స అందిస్తున్నారు. పైలట్ పేరు మోహంతి. అతనితో పాటు కోపైలట్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన సమయంలో వెనక నుంచి ఏదో వింత శబ్దాలు వినిపించాయట. కానీ అదేంటో గుర్తించేలోపే ప్రమాదం జరిగిపోయింది"
- రైల్వే బోర్డ్
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్ ట్రైన్‌ని ఢీకొట్టిన సమయంలో లోపల గార్డ్ లేడు. అందుకే ప్రాణాలతో బయటపడ్డాడు. రైల్వే నిబంధనల ప్రకారం...గూడ్స్ గార్డ్‌తో పాటు డ్రైవర్ ట్రైన్‌ని ఎక్కడ పార్క్ చేసే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునే బాధ్యత వాళ్లదే. కానీ...ఆ సమయంలో అక్కడ వాళ్లు లేకపోవడమూ విమర్శలకు దారి తీసింది.
అదానీ సాయం..
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల చదువు బాధ్యతను తాము తీసుకుంటామని గౌతమ్ అదానీ ప్రకటించారు. వారి చదువుకు అయ్యే ఖర్చునంతా తామే భరిస్తామన్నారు. ఉచితంగా విద్యను అందించి వారికి మంచి భవిష్యత్ కల్పిస్తామని చెప్పారు. ఈ మేరకు గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. 'ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో అందరం తీవ్రంగా కలత చెందాం. ఈ ఘోర దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పాఠశాల విద్యను అందించాలని అదానీ గ్రూప్ నిర్ణయించుకుంది. బాధితులను ఆదుకోవడం మనందరి ఉమ్మడి బాధ్యత. వారి కుటుంబాలకు, పిల్లలకు మంచి భవిష్యత్ అందించండి' అంటూ గౌతమ్ అదానీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
उड़ीसा की रेल दुर्घटना से हम सभी बेहद व्यथित हैं।
— Gautam Adani (@gautam_adani) June 4, 2023
हमने फैसला लिया है कि जिन मासूमों ने इस हादसे में अपने अभिभावकों को खोया है उनकी स्कूली शिक्षा की जिम्मेदारी अडाणी समूह उठाएगा।
पीड़ितों एवं उनके परिजनों को संबल और बच्चों को बेहतर कल मिले यह हम सभी की संयुक्त जिम्मेदारी है।
Also Read: తమ్ముడి డెడ్‌బాడీ దొరక్క తల్లడిల్లిపోతున్న యువకుడు, అమ్మ కోసం మరొకరి ఆవేదన