Odisha Train Accident: రైలు ప్రమాద మృతులకు కేంద్రం, ఒడిశా చెరో రూ.10 లక్షలు- తమిళనాడు, బెంగాల్ చెరో రూ.5 లక్షలు పరిహారం
Odisha Train Accident: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు కేంద్రం, ఒడిశా రాష్ట్రాలో చెరో రూ.10 లక్షల రూపాయలు పరిహారం ఇస్తామని ప్రకటించాయి.
Odisha Train Accident: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 260 మందికిపైగా మృతిచెందినట్లు అధికారులు చెబుతున్నారు. 900 మంది తీవ్రంగా గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.10 లక్షలు పరిహారం
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం అందిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
Ex-gratia compensation to the victims of this unfortunate train accident in Odisha;
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 2, 2023
₹10 Lakh in case of death,
₹2 Lakh towards grievous and ₹50,000 for minor injuries.
రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఒడిశా
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద మృతులకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడ్డ వారికి రూ.2 లక్షలు ఇవ్వనుంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కంట్రోల్ రూమ్ కు వెళ్లారు. రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలను అప్రమత్తం చేసి సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా ఆదేశించారు.
ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଶ୍ରୀ @Naveen_Odisha ବାଲେଶ୍ୱର ବାହାନଗା ଟ୍ରେନ ଦୁର୍ଘଟଣା ସ୍ଥଳରେ ପହଞ୍ଚି ସ୍ଥିତିର ସମୀକ୍ଷା କରିଛନ୍ତି। ଏଥିସହ ଜିଲ୍ଲା ମୁଖ୍ୟ ଚିକିତ୍ସାଳୟ ଗସ୍ତ କରି ସମସ୍ତ ଆହତଙ୍କ ଉତ୍ତମ ଚିକିତ୍ସା ସେବା ବିଷୟରେ ପଚାରି ବୁଝିଛନ୍ତି। ଉଦ୍ଧାର କାର୍ଯ୍ୟରେ ସ୍ଥାନୀୟ ଲୋକଙ୍କ ସହଯୋଗକୁ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଉଚ୍ଚ ପ୍ରଶଂସା କରିଛନ୍ତି। pic.twitter.com/xQ5OdUFu7A
— CMO Odisha (@CMO_Odisha) June 3, 2023
రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామన్న తమిళనాడు
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు తమిళనాడుకు చెందిన 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. గాయపడ్డ 50 మందికిపైగా క్షతగాత్రులను ప్రత్యేక విమానంలో చెన్నైకి తరలించారు. రైలు ప్రమాదంపై సీఎం స్టాలిన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. గాయపడ్డవారికి రూ. లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు.
ஒடிசா மாநிலத்தில் நேற்று ஏற்பட்ட இரயில் விபத்தில் நூற்றுக்கணக்கான மனித உயிர்களை இழந்திருக்கிறோம். மிகப் பெரிய துயர நிகழ்வாக நாட்டையே இது சோகத்தில் ஆழ்த்தியுள்ளது.
— M.K.Stalin (@mkstalin) June 3, 2023
எனவே, தமிழ்நாடு அரசின் சார்பில் இன்று துக்க நாளாக அனுசரிக்கப்படும். இன்று நடைபெறுவதாக இருந்த நிகழ்ச்சிகள் வேறொரு… pic.twitter.com/XZ2zv2qSOq
రైలు ప్రమాదంలో బెంగాల్‌కు చెందిన వారే ఎక్కువ
రైలు ప్రమాదంలో బెంగాల్ కు చెందిన ప్రయాణికులే ఎక్కువగా ఉన్నారు. ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సర్కారు తరఫున ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. తీవ్ర గాయాలైన వారికి ఒక్కొక్కరికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.50 వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ సీఎంవో ట్వీట్ చేసింది.
Shocked to know that the Shalimar- Coromondel express, carrying passengers from West Bengal, collided with a goods train near Balasore today evening and some of our outbound people have been seriously affected/ injured. We are coordinating with Odisha government and South…
— Mamata Banerjee (@MamataOfficial) June 2, 2023