News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు షురూ- యాక్సిడెంట్‌ స్పాట్‌ను పరిశీలించిన ఎంక్వయిరీ టీం

Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ మేరకు సీబీఐ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

FOLLOW US: 
Share:

Odisha Train Accident:  ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించారు. రైలు ప్రమాదంపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. రైలు ప్రమాదంపై విచారణ జరిపేందుకు సీబీఐ అధికారుల బృందం ఘటనా స్థలానికి చేరుకుంది.

ఒరిస్సాలోని బాలాసోర్ రైలు ప్రమాదం కేసులో రైల్వే యాక్ట్ సెక్షన్ లోని 337, 338, 304ఎ, 34, 153, 154, 175 సెక్షన్ల కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేసింది సిబిఐ. ఈ ఎఫ్ఐఆర్‌లో విధించిన సెక్షన్ల గురించి సిబిఐ కాసేట్లో అధికారిక సమాచారాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది?

ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో 275 మంది మృతి చెందినట్లు ఒడిశా ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం కోరమండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొనడంతో పాటు దానిలోని కొన్ని బోగీలు రెండో లైన్ గుండా వెళ్తున్న షాలిమార్ ఎక్స్ ప్రెస్ వెనుక బోగీలను ఢీకొన్నాయి.

ఎంత మంది చనిపోయారు, ఎంత మంది గాయపడ్డారు?

ఈ రైలు ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య మొదట 288గా ఒడిశా ప్రభుత్వం తెలిపింది. కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా తెలిపారు. తదుపరి పరిశీలన, బాలాసోర్ జిల్లా మేజిస్ట్రేట్ ఇచ్చిన నివేదిక తర్వాత మరణాల సంఖ్యను 275గా మార్చారు. 

క్షతగాత్రులు సోరో, బాలాసోర్, భద్రక్, కటక్‌లో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని జెనా తెలిపారు. ఇప్పటివరకు 793 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, 382 మంది ప్రభుత్వ ఖర్చులతో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 88 మృతదేహాలను గుర్తించామని, 78 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని, ఇంకా 187 మందిని గుర్తించాల్సి ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. సీబీఐ విచారణ ఉత్తర్వులు జారీ చేయడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ.. ఇది హెడ్‌లైన్స్‌లో వచ్చేందుకు చేసే ప్రయత్నమే తప్ప వేరేది కాదని  మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దీనికి సంబంధించిన ఓ టైంటేబుల్‌ని కూడా ఆయన వివరించారు. 2016లో కాన్పూర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ, దీనిపై ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించారని గుర్తు చేశారు. కానీ ఇంతవరకు ఏమీ దొరకలేదని అన్నారు. సీబీఐ విచారణ ప్రకటించక ముందే బాలాసోర్ రైలు ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ తన నివేదికను కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. గడువును చేరుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇది హెడ్ లైన్ మేనేజ్ మెంట్ తప్ప మరేమీ కాదన్నారు.

జైరాం రమేష్ ఇంకా ఇలా రాశారు, "ఇప్పుడు ఈ కాలక్రమాన్ని గుర్తుంచుకోండి ...

నవంబర్ 20, 2016: కాన్పూర్ సమీపంలో ఇండోర్-పాట్నా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఫిబ్రవరి 24, 2017: కాన్పూర్ రైలు ప్రమాదం ఒక కుట్ర అని ప్రధాని అన్నారు.

అక్టోబర్ 21, 2017: ఈ కేసులో ఎన్ఐఏ ఎలాంటి చార్జిషీట్ దాఖలు చేయలేదని పత్రికల్లో వచ్చింది. 

జూన్ 6, 2023: కాన్పూర్ రైలు ప్రమాదంపై ఎన్ఐఏ తుది నివేదిక గురించి ఇంకా అధికారిక సమాచారం లేదు. జవాబుదారీతనం లేదు! అని తన ట్విటర్‌లో రాసుకొచ్చారు. 

Published at : 06 Jun 2023 12:12 PM (IST) Tags: CBI Coromandel Express Odisha Train Accident

ఇవి కూడా చూడండి

Top Headlines Today: నేడు బాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల ర్యాలీ; తెలంగాణలో ఎన్నికల హడావుడి ఎందుకు లేదు? - నేటి టాప్ న్యూస్

Top Headlines Today: నేడు బాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల ర్యాలీ; తెలంగాణలో ఎన్నికల హడావుడి ఎందుకు లేదు? - నేటి టాప్ న్యూస్

ICG Recruitment: ఇండియన్ కోస్ట్ గార్డు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

ICG Recruitment: ఇండియన్ కోస్ట్ గార్డు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

IFFCO Notification: ఇఫ్‌కోలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుంటే చాలు

IFFCO Notification: ఇఫ్‌కోలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుంటే చాలు

One Nation One Election: కోవింద్ అధ్యక్షతన తొలి భేటీ- పార్టీలు, లా కమిషన్ సూచనలు ఆహ్వానించనున్న ప్యానెల్

One Nation One Election: కోవింద్ అధ్యక్షతన తొలి భేటీ- పార్టీలు, లా కమిషన్ సూచనలు ఆహ్వానించనున్న ప్యానెల్

అవయవ దానం చేస్తే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, స్టాలిన్ సంచలన నిర్ణయం

అవయవ దానం చేస్తే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, స్టాలిన్ సంచలన నిర్ణయం

టాప్ స్టోరీస్

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Weather Latest Update: త్వరలో బంగాళాఖాతంలో తుపానుకు అవకాశం! నేడు వర్షాలు పడే ప్రాంతాలు ఇవే: ఐఎండీ

Weather Latest Update: త్వరలో బంగాళాఖాతంలో తుపానుకు అవకాశం! నేడు వర్షాలు పడే ప్రాంతాలు ఇవే: ఐఎండీ

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!