By: Ram Manohar | Updated at : 22 Mar 2023 11:04 AM (IST)
ఢిల్లీలో మోదీ హఠావో పోస్టర్లు కలకలం రేపాయి. (Image Credits: IANS)
Posters Against Modi:
ఢిల్లీ వ్యాప్తంగా వేలాది పోస్టర్లు..
ఢిల్లీలో ప్రధాని మోదీ పోస్టర్లు రాజకీయాల్ని వేడెక్కించాయి. మోదీ ఓ డిక్టేటర్ అంటూ వేలాది పోస్టర్లు అంటించారు. వీటిని చూసి బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలెర్ట్ అయిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు 100 కేసులు నమోదు చేశారు. అరెస్ట్ అయిన నలుగురిలో ఇద్దరికి ప్రింటింగ్ ప్రెస్‌లు ఉన్నాయి. "మోదీ హఠావో, దేశ్ బచావో" అని వెలిసిన పోస్టర్లను తొలగించారు పోలీసులు. ఇప్పటికే 2 వేల పోస్టర్లను తీసేశారు. పబ్లిక్ ప్రాపర్టీలపై ఇలాంటి పోస్టర్లు అంటించడం నేరం. పైగా వీటిని ప్రింట్ చేసిన ప్రింటింగ్ ప్రెస్ పేరు కూడా లేదు. చట్టరీత్యా ఇది నేరం అని పోలీసులు తేల్చి చెప్పారు. అంతే కాదు. ఈ పోస్టర్లన్నీ ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యాలయానికి వెళ్తున్నట్టు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని ఓ వ్యాన్‌లో భారీ మొత్తంలో ఈ పోస్టర్లు ఉన్నట్టు తెలిపారు. డ్రైవర్‌ను ప్రశ్నించగా ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యాలయానికి తీసుకెళ్తున్నానంటూ సమాధానమిచ్చాడు. అంతకు ముందే కొన్ని పోస్టర్లు డెలివరీ చేసినట్టు చెప్పాడు. ఆప్ ఈ వివాదంపై స్పందించింది. ఈ పోస్టర్లలో అంత అభ్యంతరకరమైన విషయం ఏముందని ప్రశ్నించింది. FIRలు నమోదు చేయడంపైనా అసహనం వ్యక్తం చేసింది. ఇది మోదీ నియంతృత్వానికి పరాకాష్ఠ అంటూ మండి పడింది. అరెస్ట్ అయిన నిందితులను విచారించగా...మోదీ హఠావో, దేశ్ బచావో పోస్టర్లను 50 వేల వరకూ ప్రింట్ చేయాలని ఆర్డర్ వచ్చినట్టు చెప్పారు. ప్రింటింగ్ ప్రెస్ పేరు పెట్టకపోవడం వల్లే అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. లిక్కర్ స్కామ్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆప్, బీజేపీ మధ్య యుద్ధం మొదలైంది. కావాలనే తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆప్ ఆరోపిస్తోంది. అటు బీజేపీ ఆప్ ఓ అవినీతి పార్టీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు.
#DelhiPolice arrested 6 men while 100 #FIR under sec of Printing Press Act & Defacement of Property Act have been registered in connection with posters against PM #NarendraModi which were found pasted on walls & poles in #Delhi.
One of the posters read 'Modi hatao, desh bachao'. pic.twitter.com/RkKA1cABbk— IANS (@ians_india) March 22, 2023
मोदी सरकार की तानाशाही चरम पर है‼️
— AAP (@AamAadmiParty) March 22, 2023
इस Poster में ऐसा क्या आपत्तिजनक है जो इसे लगाने पर मोदी जी ने 100 F.I.R. कर दी?
PM Modi, आपको शायद पता नहीं पर भारत एक लोकतांत्रिक देश है।
एक पोस्टर से इतना डर! क्यों? pic.twitter.com/RLseE9Djfq
Also Read: Delhi NCR Earthquake: భారత్ సహా పలు ఏషియా దేశాల్లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం
Top Headlines Today: అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు ఏం చెప్పబోతోంది- ఈడీ ముందుకు కాంగ్రెస్ లీడర్లు
Top 10 Headlines Today: బీజేపీకి జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు, తెలంగాణ కాంగ్రెస్‌లో నయా జోష్ కనిపిస్తోంది.
Gold-Silver Price Today 31 May 2023: వన్నె తగ్గిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు
Wrestlers At Haridwar: గంగా నదిలో మెడల్స్ పారవేసేందుకు సిద్ధమైన రెజ్లర్లు, అంతలోనే ఆసక్తికర పరిణామం
Chhattisgarh News: ఫోన్ కోసం రిజర్వాయర్ నీళ్లనే తోడించిన ఆఫీసర్, సస్పెండ్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు
AP Registrations : ఏపీలో రివర్స్ రిజిస్ట్రేషన్ల పద్దతి - ఇక మాన్యువల్‌గానే ! సర్వర్ల సమస్యే కారణం
TSLPRB: ఎస్ఐ, కానిస్టేబుల్ ఫైనల్ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల - రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం!
99 రూపాయలకే ఫస్ట్ డే ఫస్ట్ షో, విడుదలైన రోజే ఇంట్లో కొత్త సినిమా చూసేయొచ్చు
BRO Update: డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేసిన పవన్ కల్యాణ్ 'బ్రో' - మరీ ఇంత ఫాస్టా?