Court Notice To Lord Shiva : దేవుడిపై కబ్జా కేసు - పైగా రూ. పదివేలు ఫైన్ వేస్తామని వార్నింగ్ ! ఇప్పుడు దేవుడికి దారేది?
గోపాలా....గోపాలా సినిమా స్టోరీ ఇప్పుడు రియల్‌గా ఛత్తీస్‌ఘడ్‌లో జరుగుతోంది. ఎవరో గుడి కట్టేశారు. గుడిలో శివుడ్నిపెట్టారు. అధికారులు భూమిని కబ్జా చేశారని శివుడికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు దేవుడికి దారేది?
దేవుడ్ని కోర్టుకు లాగే కథతో తెలుగులో గోపాల.. గోపాల సినిమా వచ్చింది. అచ్చంగా ఇలాగే .. దేవుడ్ని కోర్టుకు లాగేశారు చత్తీస్ ఘడ్ అధికారులు. రోడ్డును ఆక్రమించారన్న కారణంగా శివుడికి నోటీసులు జారీ చేసిన విషయంలో కొద్ది రోజుల క్రితం హైలెట్ అయింది. చత్తీస్ గఢ్ నీటి పారుదల శాక అధికారుల జంజ్గీర్- చంపా జిల్లాలో కాలువ పక్కన ఉండే సర్వీస్ రోడ్‌ను ఆక్రమించిన కేసులో వివరణ ఇవ్వాలంటూ నేరుగా ఈశ్వరుడికే తాఖీదులు ఇచ్చారు. అప్పుడు ఆయన రాలేదు. మరేం చేసారో తెలియదు కానీ.. మరోసారి అలాంటి పనే చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించారు ఇది నేరం... అంటూ అధికారులు శివుడికి మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈనెల 25 జరిగే విచారణకు హాజరుకాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
రోజుకు 2 గంటలే మోదీ నిద్రపోతున్నారట- ఎందుకో తెలుసా?
ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని రాయగఢ్‌కు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు.ఆ భూమిలో ఉన్న శివాలయం సహా మొత్తం 16మందిని నిందితులుగా పేర్కొన్నారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి, నిజానిజాలు ఏంటో తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటనే స్థానిక తహశీల్దార్ కార్యాలయం రంగంలోకి దిగింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి మూడు రోజులు విచారణ జరిపింది.ప్రాథమిక విచారణలో కబ్జాలను గుర్తించి దాదాపు 10 మందికి నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరుకాకపోతే.. చట్టప్రకారం చర్యలు భూమిని ఖాళీ చేయించి, రూ.10వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నోటీసులు అందుకున్న వారిలో ఆరో వ్యక్తి శివుడు.
రష్యాపై ఆంక్షలు విధిస్తే భారత్ వణుకుతోంది: బైడెన్
అసలు శివుడు భూమిని కబ్జా చేయడం ఏమిటనేది అందరికీ వచ్చే డౌట్. అది అధికారులకు మాత్రం రాలేదు. శివుడి విగ్రహాన్ని పెట్టిన వారో లేకపోతే ఆలయాన్ని కట్టిన వారో కబ్జా చేసిన వాళ్లవుతారు. వారికే నోటీసులు ఇవ్వాలి. వారి వివరాలు తెలియకపోతే.. కనీసం పూజారికి అయినా ఇవ్వాలి. కానీ దేవుడికే ఇచ్చారు అధికారులు.. పైకా రాకపోతే రూ. పదివేలు ఫైన్ వేస్తామని బెదిరింపులు కూడా. శివుడు ఎట్టి పరిస్థితుల్లో రాడు.. మరి నిజంగానే ఫైన్ వేస్తారా? ఫైన్ వేస్తే ఎవరు కడతారు ? ఇలాంటి సమస్యలను ముందుగా అధికారులు ఆలోచించుకోలేదు. అందుకే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నారు.
ఇలాంటివి మీడియాలో హైలెట్ అవుతాయని తెలిసినా అధికారులు తాము నిబంధనల ప్రకారమే వెళ్తున్నామంటున్నారు. ఆ గుడి ఎవరు కట్టారో తెలియదని.. అందుకే గుడిలో ఉన్న శివుడికి నోటీసులు ఇచ్చామని అంటున్నారు. వారి వాదన వారు వినిపిస్తున్నారు. కానీ అది అసహజంగా ఉండటంతోనే వైరల్ అవుతోంది.