అన్వేషించండి

ప్రభుత్వంపై అవిశ్వాసం కాదు- కూటమి పార్టీలకు విశ్వాస పరీక్ష- మోడీ సెటైర్లు

ఈ ఉదయం బీజేపీ పార్లమెంట్ పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ  ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇండియా పార్టీలపై విమర్శలు చేశారు.

లోక్‌సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఇండియాలోని పార్టీలకు విశ్వాస పరీక్షేనని ఎద్దేవా చేశారు ప్రధానమంత్రి మోదీ. 2024 జనరల్ ఎలక్షన్‌ల కంటే ముందే సెమీఫైనల్‌ చూడాలని ప్రతిపక్షాల కూటమి కోరుకుందని అభిప్రాయపడ్డారు. ఆ సెమిఫైనల్ రిజల్ట్‌ ఎలా ఉందో అందరూ చూశారని అన్నారు.

ఈ ఉదయం బీజేపీ పార్లమెంట్ పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ  ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లు,అవిశ్వాస తీర్మానంపై జరిగిన మాటల యద్ధం, జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ మోదీ ఈ కామెంట్స్ చేశారు. 

ఈ భేటీలో విపక్ష కూటమిపై ప్రధానమంత్రి మోదీ తీవ్ర విమర్శలు చేశారు. వాళ్లంతా ఒకరిపై ఒకరు అపనమ్మకంతో ఉన్నారని ఇదే వాళ్ల పతనానికి దారి తీస్తుందని జోస్యం చెప్పారు . అవిశ్వాస తీర్మానం సందర్భంగా మాట్లాడే వారి జాబితాను గుర్తు చేస్తూ వారంతా ఆఖరి బాల్‌కు సిక్స్ కొట్టాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు మోదీ. 

కూటమిలోని పార్టీలకు పరీక్ష పెట్టుకునేందుకే ఈ అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తీసుకొచ్చారని మోదీ ఎద్దేవా చేశారు. ఎవరి కూటమిలో ఉన్నారో ఎవరు లేరో ఈ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా తేల్చుకుంటారని విమర్శించారు. 

2018లోనే వారిపై అవిశ్వాసం ప్రకటించామన్నారు మోదీ. కూటమిని మోదీ "ఘమండియా" అని మరోసారి పిలిచారు. హిందీలో ఘమండియా అంటే అహంకారం అని అర్థం. ఆ కూటమిలోని కొందరు నేతలు చాలా అహంకారంతో ఉన్నారని, వాళ్లంతా బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నియంత్రుత్వ పోకడలను ప్రోత్సహిస్తూ ఇండియా కూటమిలో ఉన్న వాళ్లు ఇప్పుడు సామాజిక న్యాయం కోసం మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

బీజేపీకి వ్యతిరేకంగా ఏకైనా విపక్షాలు ఇండియాగా ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఆ కూటమిపై మోదీ ఎదురు దాడి చేస్తూనే ఉన్నారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌ను కొత్తగా బ్రాండింగ్ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. 

దేశాభివృద్ధికి ప్రతిపక్ష కూటమి "అడ్డంకి"గా మారిందని ఇండియా అనేది అవినీతి, వారసత్వ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రానున్న సందర్భంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక కామెంట్స్ చేశారు. ఈ భేటీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ జేపీ నడ్డా హాజరయ్యారు.

టాప్ హెడ్ లైన్స్

Viral Video: అమ్మ పెళ్లి చేస్తుందని గుండు చేయించుకున్న అమ్మాయి! వీడియో వైరల్‌! యూజర్ల షాకింగ్ రియాక్షన్ 
అమ్మ పెళ్లి చేస్తుందని గుండు చేయించుకున్న అమ్మాయి! వీడియో వైరల్‌! యూజర్ల షాకింగ్ రియాక్షన్ 
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
POCSO Act: టీనేజ్ లవ్ అఫైర్లపై పోక్సో అస్త్రం.. చాలా కేసుల్లో చట్టం దుర్వినియోగం! సుప్రీంకోర్టు ఆందోళన
టీనేజ్ లవ్ అఫైర్లపై పోక్సో అస్త్రం.. చాలా కేసుల్లో చట్టం దుర్వినియోగం! సుప్రీంకోర్టు ఆందోళన
AIADMK Crisis EPS 2026: AIADMK సంక్షోభం - ఈపీఎస్ కోట బద్దలు కొడుతున్న వలసలు - వాడిపోతున్న రెండాకులు - భవిష్యత్ లేదా?
సంక్షోభం - ఈపీఎస్ కోట బద్దలు కొడుతున్న వలసలు - వాడిపోతున్న రెండాకులు - భవిష్యత్ లేదా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Jyothika Munirathnam: 'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Embed widget