Bihar CM Nitish : బీహార్ సీఎంకు ఎన్ని కష్టాలో ! స్పీకర్‌పై ఏ రేంజ్‌లో ఊగిపోయారో చూశారా ?

సాధారణంగా స్పీకర్ సీఎం ఏం చెబితే అది చేస్తారు. కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు మాత్రం ఆ అదృష్టం లేదు. అందుకే ఆయన కాసేపు టెంపర్ తెచ్చుకోవాల్సి వచ్చింది.

FOLLOW US: 

స్పీకర్ అంటే సీఎం ఏం చెబితే అది చేస్తారని తెలుగు రాష్ట్రాల ప్రజలకు  బాగా తెలుసు. ఎవర్ని సస్పెండ్ చేయమంటే వారిని చేస్తారు.. ఎప్పుడు వాయిదా వేయమంటే అప్పుడు వేస్తారనేది రోజూ చూస్తున్నారు. అదే సమయంలో అధికారపక్షానికి ఇబ్బంది వస్తే ఎలా డిఫెండ్ చేస్తారో కూడా చూస్తూ ఉన్నాం. కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు మాత్రం అలాంటి అదృష్టం లేదు. పైగా ఆయన స్పీకర్ విపక్షంతో కుమ్మక్కయి..   తమ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు సహకరిస్తున్నారని ఫైరయిపోయారు. అసహనంతో ఊగిపోయారు. ఈ ఘటన సోమవారం బీహార్ అసెంబ్లీలో చోటు చేసుకుంది. 

బీహార్‌లో ఇటీవల జరిగిన ఓ నేర ఘటనపై అసెంబ్లీలో విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నాయి. ఆ ఘటనపై విపక్ష నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరికి చాన్స్ వస్తూనే ఉంది. ఆ విమర్శలన్నీ వింటున్న బీహార్ సీఎం నితిష్‌కుమార్‌కు మెల్లగా ఆగ్రహం పెరిగింది. అదే సమయంలో స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా ఈ వివాదంలోకి ముఖ్యమంత్రిని లాగారు. 'పోలీసులు లఖిసరాయి అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీనిపై మాకంటే సీఎంకే ఎక్కువ తెలిసి ఉంటుంది. మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను'' చెప్పడంతో నితీష్ కుమార్ స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

స్పీకర్ తీరుతో సీఎం నితీష్ కుమార్ ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది.  అయితే ఇలాంటి అంశాలు సభలో చర్చించడం ఏమిటని.. పోలీసులు చూసుకుంటారని స్పష్టం చేశారు.  ''సభను ఇలాగే నడపాలని మీరు అనుకుంటున్నారా? ఇలాగే నడపాలని అనుకుంటే మేము సభను ముందుకు సాగనీయం. చర్చలు జరగాల్సిన తీరు ఇది కాదు'' అని నితీష్ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాపై విరుచుకపడ్డారు.  ''మీరంతా కలిసే నన్ను అసెంబ్లీ స్పీకర్ చేశారు. ఇంతటి ఉన్నత స్థానంలో కూర్చున్నప్పటికీ నా ప్రాంతానికి సంబంధించిన అంశానని నేను ప్రస్తావించలేక పోతున్నాను. సభ్యులందరినికీ సమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుంది'' అని స్పీకర్ సమాధానం ఇచ్చినా... ముఖ్యమంత్రి వెనక్కి తగ్గలేదు. 

బీహార్‌లో బీజేపీ - జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం ఉంది.  బీజేపీకి అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ... ముఖ్యమంత్రి పదవిని జేడీయూ నేత నితీష్ కుమార్‌కు ఇచ్చారు. అయితే రెండు పార్టీల మధ్య ఇప్పుడు సఖ్యత తగ్గిపోతోంది. ముఖ్యమంత్రి పదవిని నితీష్‌కు ఇచ్చినప్పటికీ ... స్పీకర్ పదవి సహా కీలకమైన అన్ని పదవులు బీజేపీ దగ్గరే ఉన్నాయి. దీంతో నితీష్ కుమార్‌కు తరచూ చిక్కులు వచ్చి పడుతున్నాయి. 

Published at : 14 Mar 2022 05:46 PM (IST) Tags: BIHAR CM Nitish Kumar Bihar Assembly Speaker JDU Bihar BJP

సంబంధిత కథనాలు

Indigo OverAction  :   ఇండిగోకు రూ. ఐదు లక్షల జరిమానా -  మళ్లీ అలా చేస్తే ?

Indigo OverAction : ఇండిగోకు రూ. ఐదు లక్షల జరిమానా - మళ్లీ అలా చేస్తే ?

IAS Keerti Jalli : అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?

IAS Keerti Jalli :  అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి  సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?

Hardik Patel Joining BJP: ఆప్ కాదు బీజేపీలోకే హార్దిక్ పటేల్ - చేరిక ముహుర్తం ఖరారు !

Hardik Patel Joining BJP:  ఆప్ కాదు బీజేపీలోకే హార్దిక్ పటేల్ - చేరిక ముహుర్తం ఖరారు !

International Booker Prize 2022: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ అందుకున్న గీతాంజలి శ్రీ- ఆ రికార్డ్ ఆమెదే!

International Booker Prize 2022: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ అందుకున్న గీతాంజలి శ్రీ- ఆ రికార్డ్ ఆమెదే!

Ladakh Road Accident: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు జవాన్లు మృతి

Ladakh Road Accident: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు జవాన్లు మృతి

టాప్ స్టోరీస్

Nara Lokesh: TDP మహానాడులో కీలక తీర్మానాలు, నారా లోకేష్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు

Nara Lokesh: TDP మహానాడులో కీలక తీర్మానాలు,  నారా లోకేష్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు

BSNL 5GB Daily Data Plan: రోజుకు 5 జీబీ డేటా అందించే బీఎస్ఎన్ ప్లాన్ - రూ.600 లోపే - 84 రోజుల వ్యాలిడిటీ!

BSNL 5GB Daily Data Plan: రోజుకు 5 జీబీ డేటా అందించే బీఎస్ఎన్ ప్లాన్ - రూ.600 లోపే - 84 రోజుల వ్యాలిడిటీ!

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Gas Cylinders Explode: గ్యాస్‌ సిలిండర్‌ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్‌ ఇదే!

Gas Cylinders Explode: గ్యాస్‌ సిలిండర్‌ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్‌ ఇదే!