అన్వేషించండి

New Rules In Banking: సెప్టెంబ‌ర్ 1 నుంచి బ్యాంకింగ్, టెలికాం‌లో 6 కొత్త రూల్స్ ఇవే

Telugu News: సెప్టెంబ‌ర్ 1 నుంచి వివిధ రంగాల్లో మార్పులు చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు సేవా రంగాలైన టెలికాం, బ్యాంకింగ్, ఎల్జీజీల‌లో కీల‌క మార్పులు జ‌ర‌గ‌నున్నాయి.

New Rules in Banking and Telecom Sectors సెప్టెంబ‌ర్ 1 నుంచి దేశ‌వ్యాప్తంగా కొన్ని కొత్త రూల్స్ అమ‌ల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్‌, ఎల్పీజీ, ఆధార్, టెలికాం విభాగాల‌కు సంబంధించి ఈ నిబంధ‌న‌లు ప్ర‌వేశ‌పెడుతున్నారు. కొన్ని నిర్ణ‌యాలు ఖ‌ర్చుల‌పై ప్ర‌భావం చూపుతుండ‌గా మ‌రికొన్ని నిర్ణ‌యాలు లాభం చేకూర్చ‌బోతున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డీఏ ప్ర‌క‌ట‌న లాభం చేకూర్చ‌నుండ‌గా బ్యాంకింగ్‌, ఎల్పీజీల‌పై తీసుకున్న నిర్ణ‌యాలు ఖ‌ర్చుల‌ను ప్ర‌భావితం చేయ‌నున్నాయి.

క్రెడిట్ కార్డుల‌పై యుటిలిటీ పాయింట్లు 2వేల‌కు కుదింపు

సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి క్రెడిట్ నిబంధ‌న‌లు మార‌బోతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు యుటిలీటీ లావాదేవీల‌పై ప‌రిమితిని విధించింది. వినియోగ‌దారులు ఇక‌పై నెల‌కు 2000 క్రెడిట్ పాయింట్ల వ‌ర‌కు మాత్ర‌మే పొందుతారు. కొన్ని నిర్దిష్ట వ్య‌య వ‌ర్గాల్లో రివార్డుల‌ను నియంత్రించే ల‌క్ష్యంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. దేశంలో కోట్లాది మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. వారంద‌రిపై ఈ ప్ర‌భావం క‌నిపించ‌నుంది. టెలికాం కేబుల్ లావాదేవీలు కూడా 2000 పాయింట్ల‌కు ప‌రిమితం చేశారు. ఈ లావాదేవీల‌న్నీ నిర్దిష్ట కోడ్ (MCC) కింద ట్రాక్ చేస్తారు. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇకపై థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా జ‌రిపే విద్య చెల్లింపులకు రివార్డ్ పాయింట్లు చెల్లించ‌దు. ఇక‌పై తప్పనిసరిగా విద్యా సంస్థ వెబ్‌సైట్ ద్వారా లేదా POS మెషీన్‌ల ద్వారా మాత్ర‌మే ప్రత్యక్ష చెల్లింపులను చేయాలి.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని తగ్గించింది. దీంతోపాటు చెల్లింపు గడువును కూడా 18 నుంచి 15 రోజులకు తగ్గించేసింది. 

UPIలో రూపే క్రెడిట్ కార్డ్

RuPay క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు సెప్టెంబరు 1 నుంచి యూపీఐ, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో చెల్లింపులు చేసిన‌ట్ల‌యితే ఆయా చెల్లింపు సేవా ప్రదాతల క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్న వారి రివార్డ్ పాయింట్‌లను పొందుతారు. క్రెడిట్ కార్డ్‌ల రివార్డ్ పాయింట్లు, ప్రయోజనాలలో సమానంగా ఉండేలా చూడాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) RuPay  బ్యాంకులను ఆదేశించింది.

గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌పై స‌మీక్ష‌

ప్ర‌తినెలా 1వ తేదీన కేంద్ర ప్ర‌భుత్వం ఎల్పీజీ సిలిండ‌ర్లను సమీక్ష చేసి ధ‌ర‌ల్లో మార్పులు చేస్తుండ‌టం జ‌రుగుతుంది. అయితే క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ల‌లోనే ఎక్కువ మార్పులు జరుగుతుంటాయి. గ‌త‌నెల‌లో క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్‌పై రూ. 8.50 లు పెరిగింది. జూలైలో రూ. 30 త‌గ్గింది. ఇక‌పై ఎల్బీజీ గ్యాస్ సిలెండర్ ధరపై కూడా సమీక్ష జరిగే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. దీంతోపాటు సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ ధ‌ర‌ల‌పై కూడా మార్పు క‌నిపించే అవ‌కాశం ఉంది. 

టెలికాం కంపెనీల‌కు సూచ‌న‌లు
వ‌చ్చే నెల నుంచి ఫేక్ కాల్స్‌, ఫేక్ మెసేజెస్ నియంత్ర‌ణ‌పై కొత్త నిబంధ‌న‌లు అమ‌ల్లోకి రానున్నాయి. ట్రాయ్ (టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా)  ఆదేశాల మేర‌కు జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ కొన్ని సూచ‌న‌లు చేసింది. టెలీమార్కెటింగ్‌, క‌మ‌ర్షియ‌ల్‌, ప్ర‌చారం కోసం చేసే కాల్స్ కు ఇక‌పై 140 తో ప్రారంభ‌మ‌య్యే నంబ‌ర్ ఎంచుకోవాల‌ని సూచించింది. ట్రాయ్ సూచ‌న‌తో ఇక‌పై వినియోగ‌దారుల‌కు అన్‌వాంటెడ్ కాల్స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించ‌నుంది. 140 తో కాల్ వ‌స్తే మాట్లాడ‌టం ఇష్టం లేన‌ప్పుడు క‌ట్ చేసేయొచ్చు. కానీ ఇంత‌కాలం సాధార‌ణ నంబ‌ర్ల నుంచే కాల్స్ వ‌స్తున్న కార‌ణంగా వినియోగ‌దారులు ఇబ్బందులు ప‌డేవారు. 

ఆధార్ కార్డు అప్‌డేట్‌..

ఆధార్ కార్డు అప్‌డేట్ కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం వెలువ‌డిన‌ట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆ త‌ర్వాత ఆధార్ కార్డులో ఏవైనా మార్పు చేర్పులు చేసుకోవాలంటే మాత్రం ఖ‌చ్చితంగా రుసుము చెల్లించాలి. సో.. ఉచితంగా ఈ సేవ‌ల‌ను పొందాలంటే సెప్టెంబ‌ర్ 14 వ‌ర‌కే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో వినియోగ‌దారులు త్వ‌ర‌గా స‌రిచేసుకోండి. 

ఉద్యోగుల డీఏ 3 శాతం పెంపు?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన ప్రకటన రానున్న‌ట్టు స‌మాచారం. కేంద్ర ప్ర‌భుత్వం డియర్‌నెస్ అలవెన్స్ పెంపు ప్రకటన ఉండవచ్చని భావిస్తున్నారు. డీఏను 3 శాతం పెంచుతార‌ని ఉద్యోగులు ఆశిస్తున్నారు. అదే క‌నుక‌ జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 53 శాతానికి పెరుగుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trump: ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
India Exports to America: భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
Adilabad Latest News: ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
Iran vs America: అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trump: ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
India Exports to America: భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
Adilabad Latest News: ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
Iran vs America: అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
I-PAC Raid Case: బెంగాల్ డీజీపీని తొలగించండి! సుప్రీంకోర్టులో ఈడీ కొత్త పిటిషన్ దాఖలు!
బెంగాల్ డీజీపీని తొలగించండి! సుప్రీంకోర్టులో ఈడీ కొత్త పిటిషన్ దాఖలు!
Zubeen Garg Death: మరణం వెనుక మద్యం మత్తు... ప్రముఖ సింగర్ డెత్ మిస్టరీ రివీల్ చేసిన సింగపూర్ పోలీసులు
మరణం వెనుక మద్యం మత్తు... ప్రముఖ సింగర్ డెత్ మిస్టరీ రివీల్ చేసిన సింగపూర్ పోలీసులు
TMMTMTTM Box Office: రిలీజ్‌కు ముందు హడావిడి చేశారు... తిప్పి కొడితే 50 కోట్లు కూడా రాలేదుగా
రిలీజ్‌కు ముందు హడావిడి చేశారు... తిప్పి కొడితే 50 కోట్లు కూడా రాలేదుగా
Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో ఉద్రిక్తత! లాఠీచార్జ్ చేసి అదుపు చేసిన పోలీసులు !
సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో ఉద్రిక్తత! లాఠీచార్జ్ చేసి అదుపు చేసిన పోలీసులు !
Embed widget