అన్వేషించండి

రామాయణంలో ఉన్నదే చెప్పాను, మనోభావాలు దెబ్బ తీయడం నా ఉద్దేశం కాదు - NCP నేత జితేంద్ర క్లారిటీ

Jitendra Awhad: రాముడు మాంసాహారి అని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడం వల్ల ఎన్‌సీపీ నేత జితేంద్ర క్లారిటీ ఇచ్చారు.

Jitendra Awhad on Lord Ram:


క్లారిటీ ఇచ్చిన జితేంద్ర..

రాముడు మాంసాహారి అంటూ NCP నేత జితేంద్ర అవ్హద్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీజేపీ నేతలు ఈ కామెంట్స్‌పై తీవ్రంగా మండి పడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై స్పందించిన జితేంద్ర చివరకు క్షమాపణలు చెప్పారు. ఎవరి మనోభావాలను దెబ్బ తీయడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అన్నారు. 

"నా వ్యాఖ్యలు కొంత మంది మనోభావాలను దెబ్బ తీసిందని తెలిసి బాధగా అనిపించింది. అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఒకరి మనోభావాలు దెబ్బ తీయడం నా ఉద్దేశం కాదు. అయినా రాముడు మాంసాహారి అని నేను సొంతగా సృష్టించింది ఏమీ కాదు. వాల్మీకి రామాయణంలోనే అది రాసుంది. 1891 నాటి అధికారిక ప్రతిని కోల్‌కత్తా ఐఐటీ కాన్పూర్‌లో ప్రింట్ చేశారు. ఈ విషయంలో చాలా రీసెర్చ్ జరిగింది. అదే నేను ఇవాళ ప్రజల ముందుంచాను. నేనేమీ సొంతగా ఈ వ్యాఖ్యలు చేయలేదు. నేను చెప్పిందంతా 1891 నాటి పుస్తకంలో రాసుందే. ఆ పుస్తకాన్ని నేనేమీ రాయలేదు"

- జితేంద్ర అవ్హద్, NCP నేత 

ప్రతిపక్షాలపై బీజేపీ ఫైర్..

ఇప్పటికే జితేంద్ర వ్యాఖ్యలపై బీజేపీ నేత పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. రాముడి భక్తుల మనోభావాలు దెబ్బ తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో I.N.D.I.A కూటమిపైనా ఫైర్ అయ్యారు. 

"ప్రతిపక్షాల వైఖరే ఇంత. రాముడి భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమే వాళ్ల పని. ఓట్లు రాబట్టుకునేందుకు హిందువుల గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడడం సరికాదు. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తైంది. బహుశా ఇది జీర్ణించుకోలేక వాళ్లు అలా మాట్లాడుతున్నారేమో"

- రామ్‌ కదం, బీజేపీ నేత

NCP నేత జితేంద్ర అవ్హద్ (Jitendra Awhad) రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు మాంసాహారి అని ఆయన చేసిన కామెంట్స్‌ సంచలనమవుతున్నాయి. శరద్ పవార్‌ క్యాంప్‌కి చెందిన NCP నేత అయిన జితేంద్ర షిరిడీలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడే ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు. రాముడు బహుజన వర్గానికి చెందిన వాడని అన్నారు. ఆయన జంతువులను వేటాడి వాటి మాంసం తినే వాడని తేల్చి చెప్పారు. అన్నేళ్ల పాటు అడవిలో ఉన్న రాముడికి శాకాహారం ఎక్కడ దొరికిందని ప్రశ్నించారు. 

"రాముడు బహుజన వర్గానికి చెందిన వాడు. ఆయన జంతువులను వేటాడి వాటి మాంసం తినేవాడు. రాముడిని ఉదాహరణగా చూపించి అందరూ శాకాహారులైపోవాలని ప్రచారం చేస్తున్నారు. కానీ రాముడు శాకాహారి కాదు..మాంసాహారి. 14 ఏళ్ల పాటు అడవిలో ఉన్న రాముడికి శాకాహారం ఎక్కడ నుంచి దొరుకుతుంది..?"

- జితేంద్ర అవ్హద్, ఎన్‌సీపీ నేత 

Also Read: ఏ తప్పూ చేయలేదు, నా అడ్డు తొలగించుకోడానికి బీజేపీ చేస్తున్న కుట్ర ఇది - ఈడీ సమన్లపై కేజ్రీవాల్

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మూడేళ్ల తర్వాత స్వదేశానికి సురక్షితంగా చేరిన ఒడిశా మహిళ!
మూడేళ్ల తర్వాత స్వదేశానికి సురక్షితంగా చేరిన ఒడిశా మహిళ!
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
Retirement Plan: రిటైర్మెంట్ టైంలో రూ.5 కోట్లు కావాలా? SIPని ఎలా ప్రారంభించాలి? ఏం చేయాలంటే
రిటైర్మెంట్ టైంలో రూ.5 కోట్లు కావాలా? SIPని ఎలా ప్రారంభించాలి? ఏం చేయాలంటే
LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Shani Dev Story: నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
Embed widget