News
News
X

National Science Day 2023: సత్యాన్వేషణలో ప్రాణాలు పణంగా పెట్టిన గెలీలియో గెలిలీ, గియర్డానో బ్రూనో

National Science Day 2023: తమ ప్రాణాలు తీసేస్తారు అని తెలిసినా భయపడలేదు. జీవిత ఖైదు వేశారు. నాలుకకు మేకులు కొట్టారు. తొణకలేదు బెణకలేదు.

FOLLOW US: 
Share:

National Science Day 2023: ప్రపంచంలో ఓ ఇద్దరు సైంటిస్టులు తమ రియల్ లైఫ్ లో ఒకటే టైమ్ లో ఒకే అంశంపై వేర్వేరుగా పోరాటం చేశారు. నిజం.. సత్యం కోసం నిలబడ్డారు. తమ ప్రాణాలు తీసేస్తారు అని తెలిసినా భయపడలేదు. జీవిత ఖైదు వేశారు. నాలుకకు మేకులు కొట్టారు. తొణకలేదు బెణకలేదు. ఈ క్రమంలో వాళ్లపై మతానికి వ్యతిరేకమని ముద్ర వేశారు. ఒకరిని చనిపోయేవరకూ ఇంటి నుంచి బయటకు రానీయలేదు. ఇంకొకరిని బతికుండగానే కాల్చి తగులబెట్టారు. ఈ రోజు నేషనల్ సైన్స్ డే కదా. సర్ సీవీ రామన్ కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్  అడ్వాన్స్డ్ సైన్స్ ను ఎంత ఇంపాక్ట్ చేసిందో తెలుసుకనే ముందు...సత్యం కోసం నిజం కోసం ఈ రోజు మనం అనుభవిస్తున్న సైన్స్ కోసం ప్రాణాలను సైతం వదిలేసిన ఇద్దరు సైంటిస్టులు గురించి తెలుసుకుందాం.

గెలీలియో గెలిలీ, గియర్డానో బ్రూనో. ఇద్దరూ ఇటలీకి చెందిన వాళ్లే మేధావులు. మంచి చదువులు చదువుకున్నారు. గెలీలీయో యూనివర్సిటీ ఆఫ్ పీసాలో చదువుకున్నారు. చదువుకున్నది మెడిసన్ అయినా తన తండ్రి కోరిక మేరకు మ్యాథ్స్ లోనూ పట్టు సాధించాడు. ఆ తర్వాత కోపర్నికస్ ప్రతిపాదించిన సూర్య కేంద్రక సిద్ధాంతానికి ఆకర్షితుడై ఖగోళ పరిశోధనలపై  దృష్టి పెట్టాడు. ఆకాశానికి అసలు అవధులు ఉన్నాయా. ఈ భూమి ని దాటి అంతరిక్షంలో ఏమేమున్నాయో ఇలాంటి ప్రశ్నలు గెలిలీయోను కుదురుగా ఉండనివ్వలేదు. అప్పటికే తను పెరిగిన క్రైస్తవ మతం భూమి ఈ విశ్వానికి కేంద్రం విషయాన్నే బలంగా నమ్ముతోంది. చర్చికి వ్యతిరేకంగా ఎవరైనా భూమి కేంద్రం కాదని పరిశోధనలు చేస్తుంటే వాళ్లను ద్రోహులుగా, సైతాను వారసులుగా చూస్తున్న రోజుల్లో గెలిలీయో ధైర్యం చేశాడు. సత్యాన్వేషణ కోసం చర్చిని ఎదిరించాడు. లిప్పర్ షే నుంచి టెలిస్కోప్ కాన్సెప్ట్ తెలుసుకుని 1609లో తొలిసారిగా తన ఓన్ గా ఓ టెలిస్కోప్ తయారు చేసుకుని ఈ భూమిని దాటి ఆకాశంలో ఆ అంతరిక్షంలో ఏముందో చూశాడు గెలీలియో. లెన్స్‌ల కలయికను మార్చడం ద్వారా టెలిస్కోప్ శక్తిని 8 రెట్లు పెంచాడు. విశ్వాన్ని అధ్యయనం చేయటం మొదలు పెట్టాడు. 

చంద్రుడు, సూర్యుడు, జ్యుపీటర్‌, వీనస్‌ గ్రహాలను అధ్యయనం చేశారు. దీని ఆధారంగానే విశ్వంలోని కొత్త కొణాలపై 1610 లో ‘స్టారీ మెసెంజర్‌’ అనే పుస్తకాన్ని రాశారు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పారు. దీని కారణంగా చర్చి పెద్దలు అతడిని మతవిశ్వాస ఘాతకుడుగా భావించి గృహ నిర్బంధంలో ఉంచారు. అప్పటికే డెభ్బై ఏళ్ల వయస్సుకు చేరుకున్నా చర్చి కనికరించలేదు. తన జీవితంలో ఆఖరి తొమ్మిదేళ్లు ఇంటి నుంచి గెలిలీయో ను బయటకు రానీయలేదు. 1642 ఇటలీ హై ఫీవర్, హార్ట్ పాల్పిటేషన్స్ తో గెలిలీయో చనిపోయాడు. సత్యం కోసం జీవితాంతం నిలబడిన మనిషి గెలిలీయో. ఈరోజు జేమ్స్ వెబ్ లాంటి అతిపెద్ద టెలిస్కోపులు ఈ అనంతమైన విశ్వాన్ని జల్లెడ పడుతున్నాయంటే ఆ రోజు గెలిలీయో తన ఉద్దేశ్యం మార్చుకోకుండా ధైర్యంగా నిలబడి శిథిలమైపోయిన తీరే కారణం.

అచ్చం గెలీలియోలానే... బ్రూనో కూడా బైబిల్ కి విరుద్ధమైన సూర్యకేంద్ర సిధ్ధాంతాన్ని నమ్మాడు. దాన్ని ప్రచారం చేశాడు. మతం నుంచే పుట్టిన బ్రూనోను ఆ మతమే కమ్మేసింది. చర్చిలో ఫాదర్ గా మొదలైన గియోర్డానో బ్రూనో ఆతర్వాత చర్చికి వ్యతిరేకంగా భూకేంద్ర సిద్ధాంతాన్ని కొట్టిపారేశాడు. ఆకాశంలో కనిపిస్తున్న ప్రతీ నక్షత్రం ఓ సూర్యుడిలాంటిదని....దాని చుట్టూ కూడా భూమిలాంటి గ్రహాలు తిరుగుతూ ఉండవచ్చని బ్రూనో నమ్మేవాడు. ఈ భూమి లాంటి భూములు విశ్వంలో ఇంకెన్నో ఉంటాయని నమ్మేవాడు. బ్రూనో ప్రతిపాదనలు మత విశ్వాసాలకు విరుద్ధమైనవి కదా మత బోధకులకు కోపం తెప్పించిన అంశం భూమికి, సూర్యునికి అంతం, ఆరంభం ఉంటాయన్నది. బ్రూనోపై 131 అభియోగాలను మోపి 1591లో కేసును నమోదు చేశారు. 
1593లో బ్రూనోను గాలి వెలుతురు చొరబడని ఒక కారాగారంలో బంధించి ఎన్నో హింసలకు గురిచేశారు. ఈ కారాగారంలో బ్రూనో సుమారు ఏడు సంవత్సరాలకుపైగా నరకయాతన అనుభవించాడు. ప్రతిరోజూ మత గురువుల నుంచి బ్రూనోకు ఓ మెసేజ్ వచ్చేది. బ్రూనో తన ప్రతిపాదనలు తప్పని ఒప్పుకోవడం, సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ఖండించడం, తాను ప్రచారం చేసిన అంశాలు తప్పని బహిరంగంగా ఒప్పుకోవడం. అయితే ప్రతి రోజూ బ్రూనో ఈ ప్రతిపాదనలు తిరస్కరించేవాడు. చివరకు బ్రూనోను మతద్రోహిగా, సైతానుగా, రెచ్చగొట్టే ఉపన్యాసకుడుగా, మతానికి పరమ శత్రువుగా ప్రకటించి, ఒక్క రక్తంబొట్టు నష్టపోకుండా అగ్నికి ఆహుతి చెయ్యాలన్న మరణశిక్షకు ఆదేశాలు జారీ చేశారు. 
1600 సంవత్సరం ఫిబ్రవరి 17న మత పెద్దల ఆదేశాల మేరకు ఇనుప సంకెళ్ళతో బ్రూనోను బంధించి తాను నమ్మిన సత్యాన్ని ప్రజలకు చెప్పనీయకుండా ఉండటానికి వీలుగా నాలుకను ఇనుపతీగలతో చుట్టి, నోటికి అడ్డంగా గుడ్డను కట్టి రోమ్‌నగర వీధుల గుండా ఊరేగిస్తూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఏ పని చేసినా వారికి ఈ శిక్ష తప్పదంటూ నినదిస్తూ ఊరేగించారు. తప్పును ఒప్పుకుంటే క్షమించి వదిలేస్తామని చివరి అవకాశం ఇచ్చారు. బ్రూనో సత్యాన్ని ఎవరూ నాశనం చేయలేరేన్నట్లు తల అడ్డంగా ఊపాడు.  నమ్మిన సిద్ధాంతం కోసం నిజం కోసం బ్రూనో బతికున్నప్పుడే నిలువునా కాలిపోయాడు.

ఆ తర్వాత దాదాపు మూడొందల ఏళ్లకు ఎక్కడైతే బ్రూనోను సజీవ దహనం చేశారో అదే కాంపో డి ఫియోరీలో బ్రూనోలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2000వ సంవత్సరంలో బ్రూనో 400వ జయంతి సందర్భంగా ఏ చర్చి పెద్దలైతే బ్రూనోను సజీవ దహనం చేశారో అది తాము చేసిన అతి పెద్ద తప్పని బహిరంగ ప్రకటన చేశారు. ఫిబ్రవరి 17న సత్యాన్వేషణ దినంగా జరుపుతున్నారు.

సైన్స్ అంటే ప్రగతికి ఉపయోగపడేది. మతం అంటే జీవన విధానాన్ని సరైన దిశలో నడిపించేది. ఈ రెండింటినీ బ్యాలెన్స్డ్ గా ఆలోచించాల్సిన పాలకులు ఆ పని చేయకపోతే..ప్రజలు సంయమనంతో ఉండకపోతే జరిగే నష్టం ఊహించటం చాలా కష్టం. ఇలాంటివి మరే దేశాల్లో జరగలేదని కాదు చాలా చోట్ల జరిగాయి..ఇంకా జరుగుతూనే ఉన్నాయి. హేతువాద దృక్పథంతో ఆలోచించటం..భిన్నాభిప్రాయాలకు గౌరవం ఇవ్వటం..సత్యం కోసం అన్వేషించటం..ఏ సైన్స్ డే లైనా అందించాల్సిన స్ఫూర్తి ఇదే.

Published at : 28 Feb 2023 11:13 PM (IST) Tags: Galileo CV Raman National Science Day 2023 National Science Day Giordano Bruno

సంబంధిత కథనాలు

CMA Result 2023: ఐసీఎంఏఐ సీఎంఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే!

CMA Result 2023: ఐసీఎంఏఐ సీఎంఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే!

GATE 2023: వెబ్‌సైట్‌లో 'గేట్-2023' స్కోరుకార్డులు, డైరెక్ట్ లింక్ ఇదే!

GATE 2023: వెబ్‌సైట్‌లో 'గేట్-2023' స్కోరుకార్డులు, డైరెక్ట్ లింక్ ఇదే!

Laxman Narasimhan: స్టార్‌ బక్స్‌ కొత్త సీఈవోగా భారతీయుడు - ఆయన స్పెషాలిటీ ఇదే!

Laxman Narasimhan: స్టార్‌ బక్స్‌ కొత్త సీఈవోగా భారతీయుడు - ఆయన స్పెషాలిటీ ఇదే!

పానీపూరీ రుచి చూసిన జ‌పాన్ ప్ర‌ధాని

పానీపూరీ రుచి చూసిన జ‌పాన్ ప్ర‌ధాని

నోటీసుల కంటే ముందే ఫోన్ల గురించి ఎలా మాట్లాడుతారు?- మంత్రి శ్రీనివాస్ గౌడ్

నోటీసుల కంటే ముందే ఫోన్ల గురించి ఎలా మాట్లాడుతారు?- మంత్రి శ్రీనివాస్ గౌడ్

టాప్ స్టోరీస్

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !

AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !

TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?

TSPSC :  పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?