Monsoon Session 2023: ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, వెల్లడించిన క్యాబినెట్ కమిటీ
Monsoon Session 2023: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి మొదలు కానున్నాయి.
Parliament Monsoon Sessions:
ట్వీట్ చేసిన ప్రహ్లాద్ జోషి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి మొదలు కానున్నాయి. పార్లమెంటరీ కమిటీ క్యాబినెట్ కమిటీ ఈ సమావేశాల తేదీల్ని ఖరారు చేసింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో క్యాబినెట్ కమిటీ సమావేశం జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అధికారికంగా ట్వీట్ చేశారు.
"పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి మొదలవుతాయి. ఆగస్టు 11వ తేదీ వరకూ కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు సభ సజావుగా సాగేలా చూస్తారని ఆశిస్తున్నాను. ఫలవంతమైన చర్చలు జరపాలని కోరుకుంటున్నాను"
- ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
"Monsoon Session, 2023 of Parliament will commence from 20th July and continue till 11th August. Urge all parties to contribute towards productive discussions on Legislative Business and other items during the Monsoon Session," tweets Parliamentary Affairs Minister Pralhad Joshi pic.twitter.com/1o5rq0odug
— ANI (@ANI) July 1, 2023
యూసీసీపై కాంగ్రెస్ కసరత్తు..
యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) బిల్‌ని ఈ వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెడతారని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలు ఇదే విషయం చెబుతున్నాయి. జులైలో వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. అప్పుడే దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. కేబినెట్ కమిటీ మీటింగ్‌లో డిసైడ్ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం...Uniform Civil Code Bill ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపనుంది. దీనిపై అందరి అభిప్రాయాలూ తెలుసుకుంటుంది. ఆ తరవాతే పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. యునిఫామ్ సివిల్ కోడ్ (UCC)పై కేంద్రం స్పీడ్ పెంచిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా కసరత్తులు మొదలు పెట్టింది. వర్షాకాలం సమావేశాల్లో ఈ బిల్‌ని ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. అంతకు ముందు పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి దీనిపై డిస్కస్ చేయనుంది. అయితే...అటు కాంగ్రెస్ మాత్రం ఈ కోడ్‌ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సోనియా గాంధీ కీలక నేతలతో ఇప్పటికే చర్చించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ మరో కీలక భేటీ నిర్వహించనున్నారు సోనియా గాంధీ.
పార్లమెంట్లో ప్రస్తావించిన అంశాలపై చర్చించడంతో పాటు యునిఫామ్ సివిల్ కోడ్ బిల్ ప్రవేశపెడితే ఏం చేయాలన్నదీ డిస్కస్ చేయనున్నారు కాంగ్రెస్ నేతలు. జులై 3వ తేదీన ప్రత్యేకంగా యూసీసీ గురించే చర్చించేందుకు మరోసారి సమావేశం అవనున్నారు.నేరుగా సోనియా గాంధీ రంగంలోకి దిగడం వల్ల UCCని ఆ పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంటోందని అర్థమవుతోంది. ఇది కేవలం మైనార్టీలను అణిచివేసేందుకే అని ప్రచారం చేసి ఎంతో కొంత బీజేపీకి డ్యామేజ్ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే పలు విపక్షాలూ వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవల రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడం అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చింది.
Also Read: Delhi Rains: భారీ వర్షాలకు ఢిల్లీ రోడ్లు జలమయం, గుంతలో పడి ఆటో డ్రైవర్ మృతి