By: ABP Desam | Updated at : 18 Dec 2021 11:02 PM (IST)
కుక్క పిల్లను తీసుకెళ్తున్న కోతి
మహారాష్ట్ర బీడ్ జిల్లా మజల్‌గావ్ తాలూకాలోని లావుల్ గ్రామం. ఇక్కడ కొంతకాలంగా ఊహించని ఘటన జరుగుతుంది. జంతువులకు ప్రతీకారం ఏళ్లపాటు ఉంటుందా? అనే అనుమానం కలుగుతుంది. ఇక్కడ శునకాల పిల్లలను.. కోతులు ఎత్తుకెళ్తున్నాయి. వాటిని చెట్ల మీదకు తీసుకెళ్తున్నాయి. అక్కడి నుంచి.. కిందకు తోసేస్తున్నాయని.. లావుల్ గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మెుత్తం 300 కుక్కపిల్లల్ని చంపేశాయట. నెల రోజుల వ్యవధిలోనే.. ఇలా.. 125 పైగా కుక్క పిల్లల్ని చంపాయని చెబుతున్నారు.
రెండు నెలల నుంచి మూడు కోతులు లావుల్ గ్రామలో తిష్ట వేశాయని స్థానికులు చెబుతున్నారు. కుక్క పిల్లలు వెళ్తుంటే.. వాటి వెంట వెళ్తాయి. వాటిని పట్టుకుని.. పరుగున వెళ్లి చెట్లు లేదా ఇళ్లు ఎక్కుతాయి. ఎత్తైన ప్రదేశాల నుంచి.. వాటిని కిందకు నెట్టి చంపుతాయి. ఈ కారణంగా శునకాల పిల్లలు అక్కడికక్కడే పడి చనిపోతున్నాయి. వాటిని ఎత్తుకెళ్లే సమయంలో కోతుల వెంట గ్రామస్థులు పడినా.. అవి అస్సలు వదలడం లేదు.
శునకాలను రక్షించేందుకు ప్రయత్నం చేసి.. గాయపడిన వారూ ఉన్నారు. సీతారం అనే వ్యక్తి.. కొన్ని రోజుల క్రితం.. తమ ఇంట్లోని కుక్క పిల్లను కోతులు తీసుకుని వెళ్తుంటే వెంటుపడ్డాడు. దీంతో అవి అతడిపై దాడికి ప్రయత్నించాయి. కోతుల నుంచి తప్పించుకునే క్రమంలో ఇంటి పైకప్పు నుంచి కింద పడ్డాడు సీతారం. అతడి కాలు విరిగిపోయి.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
రెండున్నర నెలల క్రితం లావుల్ గ్రామంలో.. ఓ కోతి పిల్లను.. శునకం చంపేసిందని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో కుక్కలపై కోతులు పగ పెంచుకుని.. వాటి పిల్లలను చంపేసి ప్రతీకారం తీర్చుకుంటున్నాయని పేర్కొంటున్నారు.
Also Read: Pakistan: కరాచీలోని ప్రైవేట్ బ్యాంక్ లో భారీ పేలుడు... 12 మంది మృతి, మరో 11 మందికి గాయాలు
Also Read: 12 ఏళ్ల క్రితం తప్పిపోయి.. పాక్ జైల్లో తేలాడు.. భార్యకు మరో పెళ్లైంది.. ఇంకో ట్విస్టు ఏంటంటే
Also Read: KTR Standup Comedy : ఆ ఇద్దరు స్టాండప్ కమెడియన్లకు కేటీఆర్ ఆఫర్ ! బెంగళూరు గాలి తీసేశారుగా !?
Also Read: Akilesh IT Raids : యూపీలో ఐటీ దాడుల కలకలం.. అఖిలేష్ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు !
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !
UP News: ప్రియుళ్లతో పారిపోయిన ఐదుగురు వివాహితలు - ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Tandoor Ban: తందూరీ రోటీలను బ్యాన్ చేసిన ప్రభుత్వం,రూల్ బ్రేక్ చేస్తే భారీ జరిమానా
Chinese Spy Balloons: భారత్‌పైనా చైనా స్పై బెలూన్ నిఘా,సంచలన విషయం చెప్పిన అమెరికా
Mehbooba Mufti: కశ్మీర్‌ను అఫ్గనిస్థాన్గా మార్చేస్తారా? పేదల ఇళ్లు కూల్చడమెందుకు - మెహబూబా ముఫ్తీ
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం
Balakrishna Phone : బాలకృష్ణ ఏ ఫోన్ వాడుతున్నారో చూశారా? పాకెట్లో ఎలా స్టైలుగా పెట్టారో?
Kalyan Ram On Taraka Ratna Health : ఎందుకీ మౌనం - తారక రత్న హెల్త్ అప్డేట్ మీద కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?