Money Laundering Case: సీఎం ఇంటిపై ఈడీ దాడులు- 18 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు
Money Laundering Case: ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ఇంటిపై ఈడీ దాడులు చేస్తోంది.
Money Laundering Case: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేస్తోంది. సీఎం నివాసంతో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
Enforcement Directorate (ED) conducts raid at the locations of Jharkhand CM Hemant Soren's MLA representative Pankaj Mishra. Raids going on at 18 locations, including Sahibganj, Berhait and Rajmahal in connection with a tender scam.
— ANI (@ANI) July 8, 2022
Visuals from Sahibganj in Jharkhand. pic.twitter.com/AQiBKR5sdH
18 చోట్ల
మొత్తం 18 చోట్ల శుక్రవారం తెల్లవారుజాము నుంచే సోదాలు చేస్తున్నారు. సీఎం సొరేన్ సహాయకుడు పంకజ్ మిశ్రా ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. దాడులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు పారామిలిటరీ బలగాల సాయం తీసుకుంది ఈడీ.
టెండర్ స్కామ్ వ్యవహారం, మైనింగ్ కుంభకోణం ఆరోపణలపై ఈడీ గతంలోనే సొరేన్‌కు నోటీసులు ఇచ్చింది. ఆ వ్యవహారంపైనే ప్రస్తుతం ఈడీ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో
2019లో జరిగిన ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమి జయకేతనం ఎగురవేసింది. ఈ కూటమి మొత్తం 47 స్థానాల్లో గెలుపొంది సాధారణ మెజార్టీ కన్నా 5 స్థానాలు ఎక్కువ సాధించింది. ప్రతిపక్ష కూటమికి నేతృత్వం వహిస్తోన్న హేమంత్ సోరెన్ సారథ్యంలోని జేఎంఎం 30 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఝార్ఖండ్ శాసనసభలో మొత్తం 81స్థానాలు. జేఎంఎం 30 సీట్లలో, కాంగ్రెస్ 16, ఆర్జేడీ ఒకచోట గెలుపొందాయి. భాజపా 25, ఏజేఎస్‌యూ 2, ఇతరులు 7 చోట్ల విజయం సాధించారు. 1995 నుంచి జంషెడ్‌పుర్ తూర్పు నుంచి 5 సార్లు ప్రాతినిథ్యం వహించిన ముఖ్యమంత్రి, భాజపా సీనియర్ నేత రఘుబర్‌దాస్ ఓటమిపాలయ్యారు. రఘుబర్‌దాస్‌పై 8 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు స్వతంత్ర అభ్యర్థి సరయిరాయ్. రఘుబర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయనకు భాజపా టికెట్ నిరాకరించినందున తిరుగుబాటు అభ్యర్థిగా నిలిచి గెలిచారు. ఆరుగురు మంత్రులు, స్పీకర్ కూడా ఓటమిపాలయ్యారు.
Also Read: Mohammad Zubair Bail: జర్నలిస్ట్ జుబైర్‌కు ఊరట- ఆ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
Also Read: Uttarakhand Car Accident: నదిలో కొట్టుకుపోయిన కారు- 9 మంది మృతి!