(Source: ECI/ABP News/ABP Majha)
92nd Air Force Day : అద్భుతమైన ఎయిర్ షో - తన బలం ఎంతో చూపిన వైమానిక దళం
IAF: ఎయిర్ అడ్వెంచర్ షోలో రాఫెల్, మిగ్-29, సుఖోయ్-30 ఎంకేఐ వంటి ఆధునిక యుద్ధ విమానాలను కూడా తమ విన్యాసాలను ప్రదర్శించాయి. వేలాది మంది ప్రజలు ఆదివారం నిర్వహించిన ప్రదర్శనను వీక్షించారు.
92nd Air Force Day: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 92వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు (అక్టోబర్ 6) తమిళనాడులోని చెన్నై మెరీనా ఎయిర్ ఫీల్డ్ లో ఎయిర్ అడ్వెంచర్ షో నిర్వహించారు. 21 ఏళ్ల తర్వాత చెన్నైలో వైమానిక దళ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ ఎయిర్ అడ్వెంచర్ షోలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా పాల్గొన్నారు. 21 ఏళ్ల తర్వాత తొలిసారిగా చెన్నైలో నిర్వహిస్తున్న మెరీనా బీచ్‌లో గరుడ కమాండోలు తమ బలాన్ని ప్రదర్శించారు. వేలాది మంది ప్రజలు ఆదివారం రోజున అక్కడికి చేరుకుని, రాఫెల్‌తో సహా భారత వైమానిక దళం అద్భుతమైన విన్యాసాలను వీక్షించారు. అక్టోబరు 8న ఇక్కడ జరగనున్న 92వ వైమానిక దళ దినోత్సవ ఏర్పాట్లలో భాగంగా ఈ షోను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఐఏఎఫ్ విమానం అద్భుతమైన వైమానిక ప్రదర్శన చెన్నై ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఈ సందర్భంగా మెరీనా బీచ్‌లో అద్బుతమైన ఎయిర్ షోతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకునే ప్రయత్నం కూడా జరిగింది.
విమానాల అద్భుత విన్యాసాలు
ఎయిర్ అడ్వెంచర్ షోలో రాఫెల్, మిగ్-29, సుఖోయ్-30 ఎంకేఐ వంటి ఆధునిక యుద్ధ విమానాలను కూడా తమ విన్యాసాలను ప్రదర్శించాయి. సూర్య కిరణ్ ఏరోబాటిక్స్ టీమ్, సారంగ్ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్ కూడా తమ వైమానిక విన్యాసాలను ప్రదర్శించారు. తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండ, అధునాతన తేలికపాటి హెలికాప్టర్ ధృవ్ ఎంకే4 కూడా ఎయిర్ షోలో పాల్గొన్నాయి. ఎయిర్ షో పట్ల చిన్న పిల్లలు, పెద్దల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. భారత వైమానిక దళం తన 92వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తమిళనాడులోని చెన్నై మెరీనా ఎయిర్‌ఫీల్డ్‌లో ఈరోజు ఎయిర్ అడ్వెంచర్ షోను నిర్వహించింది. 21 ఏళ్ల తర్వాత తొలిసారిగా చెన్నై ఎయిర్ ఫోర్స్ డే వేడుకలను నిర్వహించింది. గతంలో కంటే ఈసారి వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
#WATCH | Chennai, Tamil Nadu: Fighter aircraft Sukhoi Su-30MKI takes part in the Air Show organised ahead of the upcoming 92nd Air Force Day, as CM MK Stalin, Air Force Chief Air Chief Marshal AP Singh,
and a large number of spectators look on.
— ANI (@ANI) October 6, 2024
Source: Tamil Nadu DIPR/ IAF pic.twitter.com/Ejkr1uFHqg
షోకు హాజరైన ప్రముఖులు
లైట్‌హౌస్, చెన్నై పోర్ట్ మధ్య మెరీనాలో జరిగిన 92వ వైమానిక దళ దినోత్సవ వేడుకల్లో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, రాష్ట్ర మంత్రులు, చెన్నై మేయర్ ఆర్ ప్రియా, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకే మెరీనా బీచ్ వద్ద ఉత్సాహంగా ప్రజలు గుమిగూడారు. చాలా మంది గొడుగులు పట్టుకుని మండుతున్న ఎండల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నించారు. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక గరుడ దళానికి చెందిన కమాండోలు మాక్ రెస్క్యూ ఆపరేషన్, బందీలను విడిపించడంలో తమ సాహసోపేత నైపుణ్యాలను ప్రదర్శించడంతో ఎయిర్ షో ప్రారంభమైంది.
భారత వైమానిక దళానికి చెందిన 72 విమానాలు
తూర్పు తీరంలో కలిసే మెరీనా బీచ్‌లో జరిగే గ్రాండ్ ఎయిర్ షోలో పాల్గొనడానికి 72 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు సూలూరు, తంజావూరు, తాంబరం, అరక్కోణం, బెంగళూరు నుండి బయలుదేరాయి. ఈ వైమానిక ప్రదర్శనలో, భారతదేశానికి గర్వకారణంగా పిలువబడే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సిఎ) తేజస్‌తో పాటు, రాఫెల్, మిగ్ -29, సుఖోయ్ -30 ఎంకెఐ వంటి ఆధునిక యుద్ధ విమానాలు కూడా ఫ్లైపాస్ట్‌లో పాల్గొన్నాయి. నేవీకి చెందిన P8I, పాతకాలపు డకోటా కూడా ఫ్లైపాస్ట్‌లో పాల్గొన్నాయి.
#WATCH | Chennai, Tamil Nadu: Indian Air Force's Sarang Helicopter Display team takes part in the Air Show organised ahead of the upcoming 92nd Air Force Day.
— ANI (@ANI) October 6, 2024
Source: IAF pic.twitter.com/fUqGb4OpKy
లిమ్కా రికార్డు సృష్టించడం ఎయిర్ ఫోర్స్ కల
చెన్నైలోని మెరీనా బీచ్‌లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈరోజు కూడా ప్రయత్నించింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే రెండు గంటల వైమానిక ప్రదర్శనకు దాదాపు 15 లక్షల మంది ప్రేక్షకులు హాజరవుతారని అంచనా. ఎయిర్ షోలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొనడం వల్ల లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకుని చరిత్ర సృష్టించాలని ఎయిర్ ఫోర్స్ భావిస్తోంది. ఈ కార్యక్రమంలో ఎయిర్ ఎక్సర్ సైజ్ లతో పాటు సాగర్, ఆకాష్, బాణం, త్రిశూల్, రుద్ర, ధ్వజ్ వంటి నిర్మాణాలను కూడా ప్రదర్శించారు. దాదాపు 72 విమానాలు వైమానిక ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఇది లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. సూపర్ సోనిక్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ రాఫెల్ సహా దాదాపు 50 విమానాలు పాల్గొన్నాయి. హెరిటేజ్ ఎయిర్‌క్రాఫ్ట్ డకోటా, హార్వర్డ్, తేజస్, ఎస్ యూ-30, సారంగ్ కూడా ఏరియల్ సెల్యూట్ లో పాల్గొన్నాయి. ఎయిర్ షో సందర్భంగా మెరీనా బీచ్‌లో భారత వైమానిక దళానికి చెందిన గరుడ కమాండోలు తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించారు.
ఎయిర్ ఫీల్డ్ క్లోజ్
గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వివిధ నగరాల్లో వైమానిక దళ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. గత సంవత్సరం ఈ కార్యక్రమం ప్రయాగ్‌రాజ్‌లో .. అంతకు ముందు సంవత్సరం చండీగఢ్‌లో నిర్వహించారు. ఈ సంవత్సరం చెన్నైలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ ప్రదర్శనను ప్రజలకు మరింత చేరువ కావడం ద్వారా దేశంలోని వైమానిక సామర్థ్యాలను ఎక్కువ మంది ప్రజలు వీక్షించవచ్చు. ఎయిర్‌షో కోసం సన్నాహకంగా, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం గగనతలం (MAA) అక్టోబరు 8 వరకు 15 నిమిషాల నుండి రెండు గంటల వరకు అడపాదడపా వ్యవధిలో మూసివేయనున్నారు. ఎయిర్‌షో జరిగే రోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఎయిర్‌ఫీల్డ్ మూతపడనుంది.