(Source: ECI/ABP News/ABP Majha)
ఆ నిందితులను ఉరి తీసే ఆలోచనలో ఉన్నాం, మణిపూర్ వీడియోపై సీఎం బైరెన్ సింగ్
Manipur Women Viral Video: మణిపూర్‌లో మహిళలను దారుణంగా హింసించిన నిందితులకు ఉరిశిక్ష వేసే యోచనలో ఉన్నామని సీఎం తేల్చి చెప్పారు.
Manipur Women Viral Video:
బైరెన్ సింగ్ ట్వీట్
మణిపూర్‌లో ఇప్పటి వరకూ జరిగిన హింస ఒకెత్తైతే..ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఓ పాత వీడియో సృష్టించిన సంచలనం మరో ఎత్తు. పార్లమెంట్‌నీ ఇది కుదిపేస్తోంది. రెండు నెలల క్రితం ఓ మహిళను నగ్నంగా ఊరేగించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఫలితంగా...అన్ని పార్టీలు బీజేపీపై తీవ్రంగా మండి పడుతున్నాయి. పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే నిందితుడుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే మణిపూర్ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ ఈ వీడియోపై స్పందించారు. నిందితులందరినీ కఠినంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు. నిందితులకు ఉరిశిక్ష వేసే యోచనలో ఉన్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలను అలా అవమానించడాన్ని చూసి గుండె మండిపోయిందని అన్నారు. సుమోటోగా స్వీకరించిన పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశారని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
"ఇద్దరు మహిళలపై అమానుషంగా ప్రవర్తించిన వీడియో చూసి నా గుండె మండిపోయింది. చాలా దారుణమైన చర్య ఇది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించాం. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాదు..ఉరిశిక్ష వేసే ఆలోచనలో కూడా ఉన్నాం. ఇలాంటి అమానవీయ ఘటనలకు మన సమాజంలో తావు లేదు"
- బైరెన్ సింగ్, మణిపూర్ ముఖ్యమంత్రి
Manipur horror: First arrest made; CM Biren Singh says capital punishment will be considered for culprits
— ANI Digital (@ani_digital) July 20, 2023
Read @ANI Story | https://t.co/FpmRJw83p8#Manipur #Arrest #ManipurCM #BirenSingh #ManipurPolice pic.twitter.com/pyxDNVwoKK
ఇదీ జరిగింది..
రెండు నెలల క్రితం మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై ఓ గుంపు దాడి చేసి నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడింది. ఈ వీడియో బుధవారం సోషల్ మీడియా గ్రూపుల్లో విస్తృతంగా సర్క్యులేట్ అయింది. ఈ వీడియోపై ప్రతిపక్షాలు, పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ దారుణం మే 4 నాటిదని పోలీసులు చెబుతున్నారు. కాంగ్పోక్పి జిల్లాలోని సైకుల్ పోలీస్ స్టేషన్లో ఆ గ్రామ పెద్ద ఈ దుర్ఘటనపై ఫిర్యాదు చేశారని... జీరో ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇది తౌబాల్లోని నాంగ్పోక్ సెక్మా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని అంటున్నారు. ఈ భయంకరమైన దాడి వీడియో వైరల్ కావడంతో స్థానిక గిరిజన నాయకుల ఫోరం (ITLF) ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్, షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ను స్పందించాలని అభ్యర్థించింది. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ప్రారంభమైన మొదట్లో ఇలాంటివి చాలా జరిగాయని ఐటీఎల్ఎఫ్ సభ్యులు తెలిపారు. మే 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు దాదాపు 800-1,000 మంది దుండగులు ఆయుధాలతో కాంగ్పోక్పి జిల్లాలోని బి ఫైనోమ్ గ్రామంలోకి ప్రవేశించారు. వారు గ్రామంపై విరుచుకుపడ్డారు. ఇళ్లను ధ్వంసం చేసి, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వంటసామాగ్రి, బట్టలు, రేషన్, పశువులు, పెంపుడు జంతువులను దోచుకున్నారు. మహిళలను వివస్త్రను చేసి ఊరేగించారు.
Also Read: Manipur Violence: నా గుండె రగిలిపోతోంది, ఎవరినీ వదిలిపెట్టం - మణిపూర్ హింసపై ప్రధాని మోదీ