Manipur Violence: మణిపూర్‌లో ఆగని మారణహోమం - కిడ్నాపైన ఇద్దరు విద్యార్థుల హత్య
మణిపూర్‌లో మారణహోమం కొనసాగుతూనే ఉంది. జులైలో కిడ్నాప్ అయిన మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురయ్యారు. ఆ ఇద్దరినీ దరుణంగా చంపేశారు.
మణిపూర్ మండుతూనే ఉంది. అక్కడ మొదలైన హింసాకాండకు అడ్డుకట్ట పడటంలేదు. మణిపూర్ మారణహోమానికి ఇప్పటికే ఎంతో అమాయులు బలైపోయారు. ఇద్దరు మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటన... యావత్ దేశాన్నే కదిలించింది. అక్కడ జరుగుతున్న దారుణాలను కళ్లకు కట్టింది. అయితే... కొద్దిరోజులుగా మణిపూర్‌లో పరిస్థితులు చక్కబడుతున్నాయని వచ్చాయి. మణిపూర్‌లో ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని కూడా పునరుద్దరించింది అక్కడి ప్రభుత్వం. అయితే... ఇప్పుడు మరో ఇద్దరు విద్యార్ధుల హత్య.. కలవరం రేపుతోంది.
జులైలో కిడ్నాపయిన ఇద్దరు విద్యార్థులను చంపేసిన ఫొటోలు.. సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మైతీ తెగకు చెందిన 17ఏళ్ల హిజామ్ లింతోయింగంబి, 20ఏళ్ల ఫిజామ్ హెమ్‌జిత్ జులై నుంచి కనిపించడం లేదు. వారు కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. అయితే... తాజాగా వీరికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇద్దరు విద్యార్థులు అటవీ ప్రాంతంలోని ఓ క్యాంపులో కూర్చుని ఉండగా... వెనక సాయుధులు నిల్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాయుధుల చేతిలో తుపాకులు కూడా ఉన్నాయి. మరో ఫొటోలో ఇద్దరు విద్యార్థులు చనిపోయి పడి ఉన్నారు. హెమ్‌జిత్ తల నరికేసి ఉన్నారు. వీరిద్దరినీ హత్య చేసినట్టు ఫొటోల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. అభంశుభం తెలియని విద్యార్థుల హత్య.. మణిపూర్‌లో జరిగిన, జరుగుతున్న దారుణాలు మరో నిదర్శనంగా నిలుస్తోంది.
మైతీ వర్గానికి చెందిన ఈ విద్యార్థులను కిడ్నాప్ చేసి చంపేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోల్లో విద్యార్థిని హిజామ్ వైట్ కలర్ టీషర్ట్ వేసుకుని ఉంది... విద్యార్థి హేమ్‌జిత్ చెక్స్ షర్ట్‌లో ఉన్నాడు. మరో ఫోటోలో ఇద్దరి మృతదేహాలను నేలపై పడేసినట్టు ఉంది. జూలైలో ఈ ఇద్దరూ కనిపించకుండా పోయారు. ఆ సమయంలో వారి కోసం గాలిస్తుండగా... ఓ షాపుల్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లో వీరిద్దరూ కనిపించారు. ఆ తర్వాత ఏమయ్యారన్నది తెలియలేదు. ఇప్పుడు ఆ ఇద్దరు విద్యార్థులు హత్యకు గురికావడం మణిపూర్‌లో కలవరం రేపుతోంది. పరిస్థితి మళ్లీ ఆదుపుతప్పే పరిస్థితి ఉండటంతో... అక్కడి ప్రభుత్వం, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఇద్దరు విద్యార్థులను ఎప్పుడో చంపేసి.. ఇప్పుడు ఫొటలు విడుదల చేసి ఉంటారని భావిస్తున్నారు. మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థుల హత్యతో.. మరోసారి ఆందోళనలు, అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థులు హత్య కేసును సీబీఐకి అప్పగించింది. కేంద, రాష్ట్ర పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని మణిపూర్ ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులు ఎలా కిడ్నాపయ్యారు..? వారు కనిపించకుండా పోయినప్పటి నుంచి దర్యాప్తు జరుపుతున్నామని ప్రకటించారు. ఎవరు కిడ్నాప్ చేశారు.. ఎప్పుడు చేశారు..? అన్న వివరాలు సేకరిస్తున్నారని తెలిపింది. విద్యార్థులను హత్య చేసిన వారిని పట్టుకునేందుకు అధికారులు.. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు మణిపూర్ సీఎం తెలిపారు.
ఇద్దరు విద్యార్థులు హేమ్‌జిత్, లింతోయింగంబి కిడ్నాప్, హత్యతో మైతీ వర్గంలో మళ్లీ ఆగ్రహావేశాలు రగిలే ప్రమాదం ఉండటంతో... ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుఓంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తోంది. ప్రజలు సంయమనం పాటించాలని... ప్రశాంతంగా ఉండాలని సూచించింది. అధునాతన సైబర్ ఫోరెన్సిక్స్ టెక్నాలజీతో.. ఫోటోలోని ఇద్దరు సాయుధులను గుర్తించే పనిలో ఉన్నామని తెలిపింది. ఇక.. మణిపూర్‌లో హింసాకాండ రగిలినప్పటి నుంచి ఇప్పటి వరకు 108 మంది మృతిచెందినట్టు అక్కడి అధికారిక లెక్కలు చెప్తున్నాయి.