Viral Video : పెళ్లి వేడుకలో టగ్ ఆఫ్ వార్, రొమాంటిక్ ట్రిక్ చేసిన వరుడు!
Viral Video : భారతీయ వివాహ వేడుకలు ఎంతో సందడిగా ఉంటాయి. వధూవరులను స్నేహితులు తరచూ ఆటపట్టిస్తుంటారు. అలాంటి సరదా వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
Viral Video : మన దేశంలో వివాహ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. వివాహాలు ఎంతో ఆహ్లాదకరంగా, ఆత్మీయుల ప్రేమ ఆప్యాయతలు, నవ్వులతో నిండి ఉంటాయి. వధూవరులకు వారి జీవితంలో అతిపెద్ద సంతోషకరమైన రోజు పెళ్లి రోజు. కాబట్టి భారతీయ వివాహాలలో వినోదం, సందడి భాగమై ఉంటాయి. వివాహ వేడుకల్లో ఆడవిడుపులు, మరింత సంతోషాలను నింపుతున్నాయి. తాజాగా పంజాబీ వివాహానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అక్కడ వరుడి స్నేహితుల్లో ఒకరు వధువును అతని నుంచి లాగేందుకు ప్రయత్నిస్తూ, వరుడ్ని ఆటపట్టించడం వీడియో చూడవచ్చు.
రొమాంటిక్ ట్రిక్ చేసిన వరుడు
ఇన్ స్టా గ్రామ్ పేజీలో రీల్స్ లో ఈ వీడియోను పోస్టు చేశారు. వివాహ వేడుక ప్రారంభం కావడానికి ముందు వధూవరులు కలిసి వేదికపై నిలబడి ఉన్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఒక వ్యక్తి వేదిక దగ్గరకు వచ్చి వధువు చేతిని పట్టుకోగా, వరుడు మరో చేతిని పట్టుకున్నాడు. అతను వధువును తనతో తీసుకువెళ్లడానికి ఆటపట్టిస్తూ ఆమె చేతిని లాగాడు కానీ వరుడు ఆమెను తన వైపుకు లాగుతున్నాడు. ఈ టగ్ ఆఫ్ వార్ కొనసాగుతున్నప్పుడు వధువు నవ్వుతుంది. చివరకు వరుడు ఓ రొమాంటిక్ ట్రిక్ ఉపయోగించాడు. అతను వధువును ఒక్కసారిగా ఎత్తుకొని వేదికపైకి తీసుకెళ్లాడు. ఆ క్షణం చాలా అద్భుతంగా ఉంది. వధూవరులు ఎంతో సంతోషంగా ఆ క్షణాలను ఆస్వాదించారు. సల్మాన్ ఖాన్-ప్రియాంక చోప్రా నటించిన సలామ్-ఇ-ఇష్క్ చిత్రంలోని 'తేను లేకే మెయిన్ జవాంగా' పాటను ఈ రీల్ లో బ్యాక్ గ్రౌండ్ లో వాడారు.
View this post on Instagram