అన్వేషించండి

సస్పెండయిన ఎంపీలతో నేడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భేటీ, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్‌లో సస్పెండయిన ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.  

Mallikarjuna Kharge Holds Key Meet :  కాంగ్రెస్ పార్టీ 2024 పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. వరుసబెట్టి సమావేశాలు నిర్వహిస్తోంది. మొన్నటి వరకు ఐదు రాష్ట్రాల ఎన్నికలతో బిజీగా గడిపారు నేతలు. అవి కాస్త ముగియడంతో సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తాజాగా పార్లమెంట్‌లో సస్పెండయిన ఎంపీలతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా భేటీ కానున్నారు.  అధికార పార్టీ వ్యవహారశైలి, ఏకపక్షంగా బిల్లులు ఆమోదింపజేసుకోవడం, సస్పెన్షన్లపై భవిష్యత్‌ కార్యాచరణను ఎంపీలతో చర్చించనున్నారు మల్లికార్జున ఖర్గే. భేటీకి అందరూ రావాలని సభ నుంచి సస్పెండయిన అందరూ ఎంపీలకు సమాచారం పంపారు.

తన ఇంటికి రావాలని ఖర్గేకు ఉప రాష్ట్రపతి జగదీప్‌ లేఖ

పార్లమెంటులో గందరగోళం, ఎంపీల సస్పెన్షన్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను... సోమవారం తన ఇంటికి రావాలని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆహ్వానించారు. తాను పలుమార్లు విజ్ఞప్తి చేసినా...ఈ సమావేశం జరగకపోవడాన్ని ఆయన గుర్తు చేస్తూ మరో లేఖ రాశారు. మల్లికార్జున ఖర్గేను ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదన్న ధన్‌ఖడ్‌...మీతో నేరుగా చర్చల ద్వారా అభిప్రాయాలను పంచుకోవాలనుకుంటున్నట్లు లేఖలో ప్రస్తావించారు. క్రిస్మస్‌ రోజు కుదరకపోతే మరో రోజైన రావొచ్చని ధన్‌ఖడ్‌ తెలిపారు. జగధీప్‌ ధన్‌ఖడ్‌తో సమావేశాన్ని మల్లికార్జున ఖర్గే తిరస్కరించారు. ఈ విషయం తనను ఎంతో ఆవేదననకు గురి చేసిందని చెప్పడంతో మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. దీనిపై మల్లికార్జున ఖర్గే ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఎంపీల సస్పెన్షన్ పై సోనియా గాంధీ ఆగ్రహం

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ సర్కార్ ఊపిరి ఆడకుండా చేస్తోందని మండిపడ్డారు. పార్లమెంటులో విపక్ష సభ్యులను బహిష్కరించడాన్ని తప్పు పట్టారు. పార్లమెంట్ లో భద్రతా వైఫల్యంపై చర్చ జరపాలని చట్టబద్ధమైన డిమాండ్‌ చేసినందుకు వేటు వేశారని సోనియా గాంధీ విమర్శించారు. సహేతుకమైన, చట్టబద్ధమైన డిమాండ్‌ను లేవనెత్తినందుకే ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులపై వేటు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ కూడా పార్లమెంట్‌ నుంచి ప్రతిపక్ష ఎంపీలను ఇలా సస్పెండ్‌ చేయలేదని సోనియా గాంధీ గుర్తు చేశారు. 

బీజేపీ ఎంపీలు పారిపోయారన్న రాహుల్ గాంధీ

కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విపక్షాలు ఆందోళనకు దిగాయి. లోక్ సభలో యువత పొగ వెదజల్లిన వెంటనే బీజేపీ ఎంపీలు బయటకు పారిపోయారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంట్ లోకి యువత ఎందుకు ప్రవేశించారనేది తెలుసుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు.  ఈ ఘటనలో భద్రతా వైఫల్యం ప్రధాన అంశమని తెలిపారు.  దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంతోనే యువత పార్లమెంట్ లోకి వచ్చి నిరసనకు దిగారని అన్నారు. ఉపాధి గురించి మాట్లాడని మీడియా, ఎంపీల రక్షణ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  తమకు పార్లమెంట్ లో నోటీసులు ఇచ్చినపుడు, కనీసం నోటీసుల్లో ఏముందో చదవడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget