Maharashtra News: మంత్రి తలపై పసుపు చల్లిన వ్యక్తి, పబ్లిక్‌లో ఉండగానే - అందరూ షాక్!
Maharashtra News: అందరి సమక్షంలో పలువురి అభ్యర్థనలు ప్రదర్శిస్తున్న మంత్రిపై హఠాత్తుగా పసుపు చల్లాడో వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకోగా వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Maharashtra News: మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ కు అనుకోని ఓ ఘటన ఎదురైంది. అందరి సమక్షంలో అభ్యర్థనలు పరిశీలిస్తున్న అతడిపై ఓ వ్యక్తి ఉన్నట్టుండి పసుపు చల్లాడు. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో అందరూ నోరెళ్లబెట్టగా.. వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
అసలేం జరిగిందంటే..?
రిజర్వేషన్లను డిమాండ్ చేస్తున్న ఓ వర్గానికి చెందిన ప్రజలను మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ శుక్రవారం రోజు కలుసుకున్నారు. ఈ క్రమంలోనే వారితో చర్చించిన తర్వాత ఇద్దరు వ్యక్తులు మంత్రికి లేఖను అందజేశారు. అయితే అందరి సమక్షంలో ఆ లేఖను తెరిచి మంత్రి చదువుతున్నారు. అంతలోనే ఇద్దరిలో ఓ వ్యక్తి తన వెంట తెచ్చుకున్న పసుపును మంత్రి తలపై చల్లాడు. ఈ చర్యతో అంతా నోరెళ్లబెట్టారు. తేరుకున్న మంత్రి అనుచరులు పసులు చల్లిన వ్యక్తిని నేల మీదకు ఈడ్చి.. దాడి చేశారు. ఓ వైపు తన్నులు తింటూనే మరోవైపు ఆ వ్యక్తి రిజర్వేషన్ల గురించి తన డిమాండ్ వినిపించాడు. సోలాపుర్ లోని ప్రభుత్వ రెస్ట్ హౌస్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
पवित्र भंडारा अंगावर उधळला तर मारहाण करावी लागते का..?? हेच का भाजपा चे हिदुत्व..?? pic.twitter.com/x9RgAkOq7x
— Shilpa Bodkhe - प्रा.शिल्पा बोडखे (@BodkheShilpa) September 8, 2023
అయితే మంత్రిపై పసుపు చల్లిన వ్యక్తి పేరు శేఖర్ బంగలే. బయటకు వచ్చిన తర్వాత శేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. తన వర్గం వారు ఎదుర్కుంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఆయన అలా చేసినట్లు వెల్లడించాడు. ఎస్టీ విభాగంలో తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ స్పందించారు. పసుపు సంతోషానికి గుర్తు అని, అందులో తనకు ఏ తప్పూ కనిపించలేదని చెప్పుకొచ్చారు. అలాగే తనపై పసుపు చల్లిన వ్యక్తిపై ఎలాంటి చర్యలకూ ఆదేశించలేదని వివరించారు.