Mahakumbh 2025: కుంభమేళాలో రాజ స్నానం - నాగ సాధువులు చేసుకునే 17 రకాల అలంకారాలు ఇవే!
Mahakumbh 2025: మహా కుంభమేళా జనవరి 13, 2025 నుంచి ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో నాగ సాధువులు ప్రత్యేక పాత్ర పోషించనున్నారు. రాజ స్నానంలో పాల్గొనే సమయంలో 17 రకాల మేకప్‌లు వేసుకుంటారు.

Mahakumbh 2025: యూపీలోని ప్రయాగరాజ్‌లో ప్రారంభం కానున్న మహా కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 13న ఈ మహా వేడుక ప్రారంభమవుతుంది. ఇది ఫిబ్రవరి 26న మహా శివరాత్రి రోజున ముగుస్తుంది. అందులో భాగంగా జనవరి 13న తొలి రాజస్నానం జరగనుంది. మహా కుంభమేళా అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక. దాదాపు 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి కోట్లలో భక్తులు తరలివస్తారు. అందులో ముఖ్యంగా చెప్పుకునేది నాగ సాధువులు. వీరు కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‍గా నిలుస్తారు. అందుకు ప్రధాన కారణం వారి జీవనశైలి, వేషధారణ, అచంచలమైన భక్తి.
17 అలంకారాలు - విశిష్ట ప్రాముఖ్యత
లౌకిక బంధాల నుంచి పూర్తిగా విముక్తి పొంది భోలేనాథ్ ఆరాధనలో మునిగి తేలేవారు నాగ సాధువులు. సాధారణ మనుషుల వలే కాకుండా నాగ సాధువులు సన్యాసి జీవితాన్ని గడుపుతారు. వారు ప్రాపంచిక విషయాలన్నింటినీ త్యజించి స్వచ్ఛత, ఆధ్యాత్మిక సాధనకు ఉదాహరణగా నిలుస్తారు. వీరు బయటి ప్రపంచాన్ని అస్సలు పట్టించుకోరు. వారికి తెలిసిందల్లా భగవంతుని ఆరాధనలో లీనమవడమే. వాస్తవానికి, నాగ సాధువులకు ఆధ్యాత్మిక శక్తి, భక్తి తప్ప మరేమీ లేదు. ఎందుకంటే నాగ అనే పదానికి సాహిత్యపరమైన అర్థం 'శూన్యం'. అయితే నాగ సాధువుల జీవితంలో ఓ 17 అలంకారాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి తప్పనిసరిగా వారు కలిగి ఉండాల్సిన అలంకారాలు. ఈ మేకప్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ మతంలోని 16 అలంకారాల గురించి చాలా మందికి తెలుసే ఉంటుంది. కానీ నాగ సాధువులు 16 కాదు 17 రకాల మేకప్‌లు వేసుకుని, ఆ తర్వాత మాత్రమే పవిత్ర నదిలో రాజ స్నానం చేస్తారు.
నాగ సాధువుల 17 అలంకారాలు ఇవే
- బూడిద
- చిన్న బట్ట (Nappies)
- చందనం
- కాళ్లకు ధరించేందుకు వెండి లేదా ఇనుముతో చేసిన కడియాలు
- పంచకేశ అంటే ఒక జడ ఐదుసార్లు చుట్టబడి ఉండడం
- కుంకుమ
- ఉంగరం
- పూల దండ
- చేతుల్లో పటకారు వంటి ఆయుధం
- ఢమరు
- కమండలం - ధీర్ఘ వృత్తాకారంలో ఉండే పాత్ర
- జడలు
- తిలకం
- మసి బొట్టు
- చేతిలో జపమాల
- విభూతి
- రుద్రాక్ష
నాగ సాధువుల జీవితంలో ఈ 17 రకాల అలంకారాలకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ 17 అలంకారాలు చేసుకున్న తర్వాత మాత్రమే, నాగ సాధువులు పవిత్ర నదిలో స్నానం చేస్తారు. మహా కుంభమేళాలోనూ నాగ సాధువులు ఖచ్చితంగా రాజ స్నానానికి ముందు ఈ అలంకరణ చేస్తారు.
నాగ సాధువులు అంటే..
భారతదేశంలో సాధువులు, సన్యాసులు ఎక్కువ మందే ఉన్నారు. నిజానికి చాలా మంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి బాగా ఇష్టపడుతుంటారు. కానీ ఇది అందరూ అనుకున్నంత సాధారణమైన, సులభమైన విషయమేమీ కాదు. కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాలి. బంధాలన్నీ వదులుకోవాలి. సర్వసుఖాలు, విలాసాలు అన్నీ వదిలిపెట్టాలి. ప్రాపంచిక ఆనందంతో సంబంధం లేకుండా జీవించేందుకు సిద్ధపడాలి. మహిళలైతే తాము ఎంతో ఇష్టపడే జుట్టును కూడా వదులుకోవాల్సి ఉంటుంది. కేవలం గుండుతోనే కనిపించాలి. ఇన్ని చేసినప్పటికీ ఒక 5, 6 ఏళ్ల పాటు వాళ్లను పరీక్షించాక.. వారు నాగ సాధువుగా మారే అవకాశం లభిస్తుంది.
Also Read : ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఆలస్యం.. ఆ స్టార్ ప్లేయర్ కోసం బీసీసీఐ రిస్క్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

