(Source: ECI/ABP News/ABP Majha)
LPG Cylinder Rates: గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు- రూ. 92 తగ్గించిన కేంద్రం
LPG Cylinder Rates: గత నెలలో వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా 350 రూపాయలు పెంచిన కేంద్రం ఈసారి 92 రూపాయలు మాత్రమే తగ్గించింది.
LPG Cylinder Rates: ఏప్రిల్ 1 రోజున ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సవరించింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను 92 రూపాయలు తగ్గించింది. గృహ వినియోగదారులు వినియోగించే ఎల్పీజీ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీన్ని గతనెలలోనే సవరించారు. 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సిలిండర్‌పై 50రూపాయలు పెంచారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను 350 రూపాయలు పెంచింది. ఇప్పుడు 92 రూపాయలు తగ్గించింది.
ఇండెన్ గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి
ఢిల్లీ : ₹2028
కోల్‌కతా: ₹2132
ముంబై: ₹1980
చెన్నై: ₹2192.50
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు
శ్రీనగర్ : ₹1,219
ఢిల్లీ : ₹1,103
పాట్నా: ₹1,202
లేహ్: ₹1,340
ఐజ్వాల్ : ₹1255
అండమాన్ : ₹1179
అహ్మదాబాద్: ₹1110
భోపాల్: ₹1118.5
జైపూర్ : ₹1116.5
బెంగళూర్: ₹1115.5
ముంబై: ₹1112.5
కన్యాకుమారి: ₹1187
రాంచీ: ₹1160.5
సిమ్లా: ₹1147.5
డిబ్రూగడ్: ₹1145
లక్నో: ₹1140.5
ఉదయ్‌పూర్: ₹1132.5
ఇండోర్ : ₹1131
కోల్‌కతా : ₹1129
డెహ్రాడూన్: ₹1122
విశాఖపట్నం: ₹1111
చెన్నై: ₹1118.5
ఆగ్రా: ₹1115.5
ఛండీగడ్: ₹1112.5
దేశీయ LPG సిలిండర్ల మాదిరిగా కాకుండా, వాణిజ్య గ్యాస్ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. 1 ఏప్రిల్ 2022న, ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ₹2,253కి అందుబాటులో ఉంది. గతేడాది కాలంలో ఢిల్లీలో మాత్రమే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు ₹225 తగ్గాయి.
ప్రత్యేకంగా, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం గృహ LPG గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని ప్రకటించింది. గత నెలలో, సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, 9.59 కోట్ల మంది ఉజ్వల యోజన లబ్ధిదారులు సంవత్సరానికి ప్రతి 14.2 కిలోల ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌పై ₹200 సబ్సిడీ పొందుతారని చెప్పారు. కేంద్రం ఏడాదికి 12 సార్లు రీఫిల్ పరిమితిని విధించింది