NDA కూటమిలో చేరిన జేడీఎస్, అమిత్‌షాతో భేటీ తరవాత అధికారిక ప్రకటన
JDS Joins NDA: జేడీఎస్ ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
JDS Joins NDA:
NDA కూటమిలో జేడీఎస్ చేరుతుందన్న వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయమై పలు సార్లు చర్చలు కూడా జరిగాయి. ఇన్నాళ్లకు ఈ విషయంలో ఓ స్పష్టత వచ్చింది. హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలోనే JDS ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్టు ప్రకటించింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కుమారస్వామి భేటీ అయిన తరవాత ఈ ప్రకటన వెలువడింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో NDA కూటమితో కలిసి నడవనుంది జేడీఎస్ పార్టీ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు రాబట్టలేకపోయింది JDS.బలమైన ఓటు బ్యాంకు ఉన్న చోటా కాంగ్రెస్ విజయం సాధించింది. కింగ్ మేకర్ తామే అని మొదటి నుంచి చెప్పుకున్న కుమార స్వామి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరవాత సైలెంట్ అయిపోయారు. అప్పటి నుంచి బీజేపీతో మంతనాలు జరుపుతున్నారు.
#WATCH | Former Karnataka CM and JDS leader HD Kumaraswamy meets Union Home Minister Amit Shah in Delhi. JDS to formally join the National Democratic Alliance (NDA).
— ANI (@ANI) September 22, 2023
BJP President JP Nadda and Goa CM Pramod Sawant are also present during the meeting. pic.twitter.com/7SpdnoWFSJ
హోంమంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ అయిన తరవాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. జేడీఎస్ పార్టీ NDA కూటమిలో చేరుతున్నట్టు ధ్రువీకరించారు.
"కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,జేడీఎస్ చీఫ్ హెచ్డీ కుమారస్వామిని హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కలిశాను. జేడీఎస్ పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. జేడీఎస్ పార్టీకి NDAలోకి ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాం. ఈ చేరికతో కూటమికి మరింత బలం వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ విజనరీకి అనుగుణంగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం"- జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
Met Former Chief Minister of Karnataka and JD(S) leader Shri H.D. Kumaraswamy in the presence of our senior leader and Home Minister Shri @AmitShah Ji.
— Jagat Prakash Nadda (@JPNadda) September 22, 2023
I am happy that JD(S) has decided to be the part of National Democratic Alliance. We wholeheartedly welcome them in the NDA.… pic.twitter.com/eRDUdCwLJc
గత వారమే జేడీఎస్ పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరుతుందన్న వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని మీడియా కుమారస్వామిని ప్రశ్నించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా అని అడగ్గా...వినాయక చవితి తరవాతే పూర్తి వివరాలు చెబుతానని వెల్లడించారు కుమారస్వామి. బీజేపీ బలహీనంగా ఉన్న ఓల్డ్ మైసూర్‌లోని నాలుగు నియోజకవర్గాల్లో జేడీఎస్ పోటీ చేస్తుందన్న ఊహాగానాలూ వచ్చాయి. వీటిని కొట్టి పారేశారు కుమారస్వామి. ముందుగా ఈ పొత్తుపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప్ హింట్స్ ఇచ్చారు. ఓ చిన్న పార్టీ తమతో పొత్తు పెట్టుకుంటుందని, నాలుగు సీట్లలో పోటీ చేస్తుందని చెప్పారు. జేడీఎస్ పేరు ఎత్తకుండానే పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పొత్తుతో బీజేపీకి కనీసం 25,26 నియోజకవర్గాల్లో మేలు జరుగుతుందని అంచనా వేశారు.
Also Read: ఎంపీ రమేశ్ బిదూరిపై హైకమాండ్ ఫైర్, అనుచిత వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసులు